Radhe Shyam: First Look of Krishnam Raju as Paramahamsa - Sakshi
Sakshi News home page

Krishnam Raju: రాధేశ్యామ్‌లో కృష్ణంరాజు పాత్ర ఇదే! పోస్టర్‌ రిలీజ్‌

Published Mon, Dec 20 2021 6:16 PM | Last Updated on Mon, Dec 20 2021 8:02 PM

Radhe Shyam: Krishnam Raju As Paramahamsa Poster Released - Sakshi

 పాన్‌ ఇండియా మూవీ రాధేశ్యామ్‌ ప్రమోషన్స్‌ జోరు పెంచింది. వరుసగా పాటలు రిలీజ్‌ చేస్తూ హైప్‌ పెంచుతున్న సినిమా టీమ్‌ తాజాగా సీనియర్‌ నటుడు కృష్ణంరాజు లుక్‌ను రిలీజ్‌ చేసింది. పరమహంస పాత్రలో కృష్ణంరాజు నటిస్తున్నట్లు పోస్టర్‌ ద్వారా అధికారికంగా వెల్లడించింది. మహాజ్ఞాని అయిన పరమహంస పాత్ర కోసం ఆయన ఏడాదిగా గడ్డం పెంచారు. ఇక ప్యారిస్‌ బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగే ఈ ప్రేమకథలో పూజా హెగ్డే ప్రేరణగా కనిపించనుంది. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలవుతోంది.

'జిల్‌' ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్‌ విన్నింగ్‌ హాలీవుడ్‌ మూవీ ‘గ్లాడియేటర్‌’కి యాక్షన్‌ కొరియోగ్రఫీ అందించిన నిక్‌ పోవెల్‌ వర్క్‌ చేస్తుండటం విశేషం. అయితే సినిమాలో మాత్రం యాక్షన్‌ పార్ట్‌ కన్నా ప్రేమకథే ఎక్కువ ఉంటుందట. ఇదిలా వుంటే కృష్ణం రాజు, ప్రభాస్‌తో కలిసి 'బిల్లా', 'రెబల్'‌ సినిమాల్లో కలిసి నటించారు. ఆయన చివరిసారిగా 2015లో వచ్చిన 'రుద్రమదేవి' చిత్రంలో గణపతి దేవుడుగా కనిపించారు. ఇన్నేళ్ల గ్యాప్‌ తర్వాత రాధేశ్యామ్‌లో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement