ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు భౌతికకాయాన్ని జూబ్లిహిల్స్‌లోని నివాసానికి తరలించారు.అక్కడ కుటుంసభ్యులతో పాటు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. కృష్ణంరాజును కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు.ఈ సందర్భంగా కృష్ణంరాజుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఈరోజు చాలా దుర్ధినమని, ఆయన లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని చిరంజీవి పేర్కొన్నారు.
ఆయన తీరు ఎంతో రాజసంగా ఉండేది : చిరంజీవి
ఆయన గతంలో చాలాసార్లు అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లారు. చికిత్స అనంతరం ప్రతిసారి ఆరోగ్యంగా తిరిగి వచ్చేవారు. ఈసారి కూడా అలాగే ఆరోగ్యంగా తిరిగివస్తారనుకున్నా. ఇలా అవుతుందని ఊహించలేదు. మొగల్తూరులో చిన్నపుడు అయన చూడటం కోసం ఎగబడిన వాళ్ళలో నేను ఉన్నను. ఇంకా ఆ దృశ్యం నా కళ్ళలో కదలాడుతూ ఉంది.ఆయన తీరు ఎంతో రాజసంగా ఉండేది.రావుగోపాల్ రావు లాంటి వాళ్లు రాజావారు రాజావారు అని పిలిచేవారు.కృష్ణంరాజు మహావృక్షం లాంటివారు ఈరోజు ఆ మహావృక్షం నేలకొరిగింది.పరిపూర్ణమై జీవితాన్ని అనుభవించారు..ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోుకుంటున్నాను అని పేర్కొన్నారు.
చాలా మంచి మనిషి.. దురదృష్టకరం : దిల్‌రాజు
'మంచి మనిషి, మహ మనిషి అయన్ని కోల్పోవడం దురదృష్టకరం. ఆయన లానే అన్ని గుణాలు ప్రభాస్‌లో ఉన్నాయి. కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను'
నాకు చాలా బాధాకరమైన రోజిది : మహేష్ బాబు
'కృష్ణంరాజు గారి మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. నాకు, చిత్ర పరిశ్రమకు చాలా బాధాకరమైన రోజిది. కృష్ణంరాజు గారి జీవితం, పని చేసిన విధానం, సినిమాకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.ప్రభాస్, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను'.
మా ఇంట్లో ఎక్కువగా మాట్లాడుకునే వ్యక్తి కృష్ణంరాజు: పవన్ కళ్యాణ్
ఎంతో సుప్రసిద్ధ నటుడు, మా కుటుంబానికి ఎంతో సానిహిత్యం ఉన్న వ్యక్తి. అందరి మంచి కోరుకునే వ్యక్తి. మా ఇంట్లో ఎక్కువగా మాట్లాడుకునే వ్యక్తి కృష్ణం రాజు.ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను
Comments
Please login to add a commentAdd a comment