రాధేశ్యామ్‌: కీలక పాత్రలో కృష్ణం రాజు | Krishnam Raju As Paramahamsa in Radhe Shyam | Sakshi
Sakshi News home page

రాధేశ్యామ్‌: ప్రభాస్‌తో కలిసి నటిస్తున్న కృష్ణం రాజు

Published Thu, Jan 21 2021 7:06 PM | Last Updated on Thu, Jan 21 2021 7:45 PM

Krishnam Raju As Paramahamsa in Radhe Shyam - Sakshi

బాహుబలి తర్వాత పూర్తిగా పాన్‌ ఇండియా సినిమాలపైనే దృష్టి పెట్టాడు ప్రభాస్‌. అలా 'సాహో' సినిమాతో తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులను పలకరించాడు. ఈ యాక్షన్‌ డ్రామాకు టాలీవుడ్‌లో మిశ్రమ స్పందన లభించినా హిందీలో మాత్రం సూపర్‌ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఇదే జోష్‌లో రాధేశ్యామ్‌ ద్వారా మరోసారి పాన్‌ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇందులో ప్రభాస్‌ పెదనాన్న కృష్ణం రాజు కీలక పాత్రలో నటిస్తున్నారట. బుధవారం 81వ పుట్టిన రోజు జరుపుకున్న కృష్ణం రాజు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. మహాజ్ఞానిగా పరమ హంస పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. అందుకోసమే గడ్డం పెంచుతున్నానని చెప్పారు. తన పాత్రతో పాటు ప్రభాస్‌ పాత్రకు సంబంధించిన షూటింగ్‌ మొత్తం పూర్తైందని, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. (చదవండి: రాహుల్‌ సిప్లిగంజ్‌‌ ‘లడిలడి’ సాంగ్‌.. వైరల్‌)

ఇక ప్యారిస్‌ బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగే ఈ ప్రేమకథలో పూజా హెగ్డే ప్రేరణగా కనిపించనుంది. 'జిల్‌' ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఒక్క క్లైమాక్స్‌ కోసమే రూ.30 కోట్ల ఖర్చుతో ప్రత్యేకంగా సెట్స్‌ వేయడం గమనార్హం. ఆస్కార్‌ విన్నింగ్‌ హాలీవుడ్‌ మూవీ ‘గ్లాడియేటర్‌’కి యాక్షన్‌ కొరియోగ్రఫీ అందించిన నిక్‌ పోవెల్‌ ‘రాధేశ్యామ్‌’కి వర్క్‌ చేస్తుండటం విశేషం. ఆయన పర్యవేక్షణలో ఈ సినిమా క్లైమాక్స్‌ యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. నిజానికి యాక్షన్‌ పార్ట్‌ కన్నా ప్రేమకథ ఎక్కువ ఉంటుందని ఆమధ్య ప్రభాస్‌ చెప్పుకొచ్చాడు. అయితే ఉన్న తక్కువ యాక్షన్‌ కూడా భారీ స్థాయిలో ఉంటుందట.

అండర్‌ వాటర్‌ సీక్వెన్స్‌ కూడా ఉన్నాయట. భారీ బడ్జేట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందిస్తున్నారు. 'బాహుబలి 2' రిలీజ్‌ అయిన ఏప్రిల్‌ 28వ తేదీనే ఈ సినిమాను రిలీజ్‌ చేయాలని ఆలోచిస్తుందట చిత్రయూనిట్‌. ఇదిలా వుంటే కృష్ణం రాజు, ప్రభాస్‌తో కలిసి 'బిల్లా', 'రెబల్'‌ సినిమాల్లో కలిసి నటించారు. ఆయన చివరిసారిగా 2015లో వచ్చిన 'రుద్రమదేవి' చిత్రంలో గణపతి దేవుడుగా కనిపించారు. ఇన్నేళ్ల గ్యాప్‌ తర్వాత రాధేశ్యామ్‌లో నటిస్తున్నారు. (చదవండి: పెదనాన్న జుట్టును చిన్నపిల్లాడిలా సరి చేస్తున్న ప్రభాస్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement