సాక్షి, హైదరాబాద్: కృష్ణంరాజు భౌతికకాయానికి సోమవారం నివాళులర్పించారు ఏపీ మంత్రులు. నివాళులు అర్పించిన వాళ్లలో మంత్రులు కారుమూరి, వేణుగోపాలకృష్ణ, రోజా తదితరులు ఉన్నారు. ఈ సందర్భగా.. పర్యాటక శాఖ మంత్రి రోజా మాట్లాడుతూ..
సినీ, రాజకీయ రంగాల్లో కృష్ణంరాజు రారాజు. ఆయన మరణం సినీ, రాజకీయ రంగానికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులు ప్రగాఢ సానుభూతి అని మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు.
ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కృష్ణంరాజుగారి అకాల మరణం బాధాకరం. ఈ వార్త తెలిసి.. ముఖ్యమంత్రి జగన్ చాలా దిగ్భ్రాంతి చెందారు. కృష్ణంరాజుగారు.. రాజకీయాలకు అతీతంగా అందరితో స్నేహ పూర్వకంగా వుండేవారు. ఏపీ తరపున మా మంత్రుల బృందం ఆయనకు నివాళులర్పించింది.
మంత్రి వేణుగోపాల్ మాట్లాడుతూ.. సినీ, రాజకీయ రంగాల్లో కృష్ణంరాజు సేవలు మరువలేనివి. ఎల్లప్పుడూ ప్రజలతో మమేకమై వుండేవారు.
ప్రసాద్ రాజు మాట్లాడుతూ.. కృష్ణంరాజు మరణం చాలా బాధాకరం. ఆపదలో వున్న ఎవరికైనా సహాయం చేసే గొప్ప మనసున్న వ్యక్తి కృష్ణంరాజు. సూర్య చంద్రులు వున్నంత వరకు అయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా గా మిగిలిపోతారు.
విశ్వరూప్ మాట్లాడుతూ.. కృష్ణంరాజుగారు సినీ పరిశ్రమలో ఓ ధృవ తారా. నర్సాపురం లో ఏ గ్రామానికి వెళ్లిన ఆయన జాడలు కనిపిస్తాయి. రాజకీయాలలో హుందా కలిగిన వ్యక్తి.
ఇదిలా ఉంటే.. కృష్ణంరాజు అంత్యక్రియలకు ఏపీ ప్రభుత్వం తరపు నుంచి వేణుగోపాలకృష్ణ, రోజా, కారుమూరి, చీఫ్ విప్ ప్రసాదరాజు హాజరుకానున్నారు.
ఇదీ చదవండి: రెబల్‌స్టార్ మృతి పట్ల ఏపీ ప్రముఖుల సంతాపం
Comments
Please login to add a commentAdd a comment