pay tribute
-
రామోజీ రావు మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం
-
‘నన్నోడించిన వాడ్నే పెళ్లి చేసుకుంటా’
‘‘బరిలో దూకండి. నన్ను ఓడించండి. ఆ దమ్మున్న మగవాడినే నేను పెళ్లి చేసుకుంటా’’.. పురుషాధిపత్యం కొనసాగుతున్న రోజుల్లో ఓ మహిళ విసిరిన సవాల్ ఇది. సాధారణ మహిళ అయితే చర్చకు అంతగా ఆస్కారం ఉండేది కాదు. కానీ, ఆ సవాల్ విసిరింది హమీదా బాను. ఇంతకీ ఇవాళ గూగుల్ హోం పేజీని గమనించారా?.. అందులో ఉంది ఆమెనే.1940-55 మధ్య.. కుస్తీ పోటీల్లో వందల మందిని ఓడించానని తనకు తానుగా ప్రకటించుకుంది హమీదా బాను. కళ్లారా ఆమె పాల్గొన్న పోటీలు చూసి అప్పటి మీడియా పొగడ్తలతో ఆమెను ఆకాశానికి ఎత్తేసింది. భారతదేశంలో తొలి మల్ల యోధురాలిగా హమిదా బాను పేరు చరిత్రకెక్కింది. ఇప్పుడు.. డూడుల్ రూపంలో ఆ యోధురాలికి గౌరవం ఇచ్చింది గూగుల్.సంప్రదాయ కుటుంబంలో పుట్టి.. హేతుబద్ధమైన పెద్దల్ని ఎదురించి.. ఇంటి నుంచి బయటకు వచ్చేసింది హమీదా. ఉత్తర ప్రదేశ్ మీర్జాపూర్ ఆమె స్వస్థలం. అక్కడి నుంచి ఆమె అలీఘడ్ వలస వెళ్లింది. అక్కడే సలాం పహిల్వాన్ ఆమెకు పరిచయం అయ్యాడు. ఆయన దగ్గర కుస్తీ శిక్షణ తీసుకుంటూ పలు పోటీల్లో పాల్గొందామె. అయితే 1954 ఫిబ్రవరిలో ఆమె ఇచ్చిన ఒక బహిరంగ ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనను ఓడించిన వాళ్లను వివాహం చేసుకుంటానని ప్రకటించి అటు ప్రజలు, ఇటు మీడియా దృష్టిని ఆకర్షించింది.ఛాలెంజ్‌లో భాగంగా.. పంజాబ్‌లో ఒకరిని, కోల్‌కతాలో ఒకరిని బాను ఓడించింది. ఆ తర్వాత గుజరాత్ బరోడాకు చేరుకున్న ఆమెకు ఘన స్వాగతం లభించింది. అప్పటికి ఆమె వయసు 34 ఏళ్లు. ఆ సవాల్ విసిరిన నాటికి ఆమె 300 మ్యాచ్‌లు పూర్తి చేసుకుందట. అయితే ఆమెతో తలపడాల్సిన చోటే గామా పహిల్వాన్ ఆఖరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఆమె బాబా పహిల్వాన్‌తో తలపడి.. కేవలం నిమిషం వ్యవధిలోనే ఆమె నెగ్గింది.బాను పాపులారిటీ ఏ స్థాయికి చేరిందో.. 1944లో బాంబే క్రానికల్ రాసిన ఒక కథనం చూస్తే తెలుస్తుంది. బాంబేలో ఆమె పాల్గొన్న ఒక మ్యాచ్ చూసేందుకు 20 వేల మంది ప్రేక్షకులు వచ్చారట. అయితే ప్రత్యర్థి గూంగా పహిల్వాన్ అసంబంద్ధమైన డిమాండ్లతో ఆ మ్యాచ్ జరగకుండా పోయింది. దీంతో ఆగ్రహించిన ప్రేక్షకులు స్టేడియంలో బీభత్సం సృష్టించారట.అమెజాన్ ఆఫ్ అలీగఢ్.. ముద్దుగా హమీదా బానుకు అప్పటి మీడియా పెట్టుకున్నపేరు. ఐదడుగల మూడు అంగుళాలు, 108 కేజీల బరువుతో.. రోజుకు ఐదున్నర లీటర్ల పాలు, రెండు లీటర్ల పండ్ల రసేఆలు, కేజీ మటన్, అరకేజీ బటర్, ఆరు గుడ్లు, రెండు ప్లేట్ల బిర్యానీ.. ఇలా ఆమె డైట్ గురించి కూడా అప్పట్లో పేపర్లు కథనాలు రాసేవి.హమిదా బాను కెరీర్ సగానికి పైగా వివాదాలతోనే సాగింది. మగవాళ్లతో ఆమె తలపడడాన్ని పలువురు బహిరంగంగానే వ్యతిరేకించారు. మొరార్జీ దేశాయ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె పోటీలపై నిషేధం విధించారు. అందుకు ఆమె బహిరంగంగానే ఆయనపై విమర్శలు గుప్పించింది. అలాగే.. ఆమె పాల్గొన్న పోటీల్లోనూ ప్రేక్షకుల నుంచి దాడులు తప్పలేదట. 1954 దాకా దేశ, విదేశీ రెజ్లర్లతో ఆమె తలపడింది. అయితే అదే ఏడాది విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చినా.. ఆర్థిక స్తోమత లేకపోవడం, స్పానర్లు ఎవరూ ముందుకు రాలేదన్న కారణాలతో ఆమె ఆగిపోయింది. అయితే ఆ ఆగిపోవడం.. బరికి శాశ్వతంగా హమిదా బానును దూరం చేసింది కూడా. 1987లో మహేశ్వర్ దయాల్ అనే రచయిత ఆమె జీవితం మీద రాసిన పుస్తకంలో సంచలన విషయాల్ని పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్, పంజాబ్‌లో ఆమె కుస్తీ పోటీల్లో పాల్గొందని, మగ పోటీదారులతో మాత్రమే ఆమె తలపడేదని, అయితే కొన్ని చోట్ల ఆమె రహస్య ఒప్పందాలు కూడా చేసుకునేదని ఆయన రాశారు.రెజ్లింగ్ కెరీర్ మాత్రమే కాదు.. వ్యక్తిగత జీవితం కూడా ఒడిదుడుకుల నడుమ సాగింది. కోచ్ సలాం పహిల్వాన్‌తో కలిసి అప్పటిదాకా ప్రొఫెషనల్ రిలేషన్ సాగించిన ఆమె.. ఆ తర్వాత ఆయనతో సహజీవనం చేసింది. ఈ క్రమంలోనే ఆమెను విదేశీ పోటీలకు వెళ్లకుండా సలామే అడ్డుకున్నాడనన్న ఆరోపణ ఒకటి ఉంది. ఇంకోవైపు ఉత్తర భారతం నలుమూలల పోటీల్లో పాల్గొన్న హమిదాను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. ముంబై కల్యాణ్ ప్రాంతంలో ఉంటూ.. సలాంతో కలిసి పాల వ్యాపారం మొదలుపెట్టింది.సలాం కూతురు సహారా, బానును పినమ్మగా చెబుతుంటుంది. అయితే సలాం ఆమెను శారీరకంగానూ ఎంతో వేధించేవాడని బాను మనవడు ఫిరోజ్ షేక్(ఆమె దత్తపుత్రుడి కొడుకు) ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. యూరప్‌కు వెళ్లకుండా బానును నిలువరించిన సలాం.. ఆమెను చిత్రహింసలకు గురి చేశాడని, ఈ క్రమంలోనే ఆమె కాళ్లు, చేతులు విరిగియాని ఆరోపించారాయన. కొన్నాళ్లకు సలాం, బానులు విడిపోయారు. సలాం కల్యాణ్‌లోనే ఉంటూ పాల వ్యాపారం కొనసాగించింది. డబ్బు సరిపోని సమయంలో పిండి వంటలు చేసి రోడ్ల మీద అమ్ముకునేది. అలా మల్లు యోధురాలిగా పేరున్న హమీదా బాను.. చివరి రోజులు మాత్రం కష్టంగానే గడిచాయని పలు కథనాలు వెల్లడించాయి. -
టీమిండియా స్పిన్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీకి కుటుంబ సభ్యుల నివాళులు
-
ఆ పేరు నేటికీ వినిపిస్తుంటుంది: గవర్నర్ అబ్దుల్ నజీర్
సాక్షి, కృష్ణా: దివంగత మహానేత, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఘనంగా నివాళి అర్పించారు. ఈ మేరకు శనివారం గవర్నర్ కార్యాలయం అధికారిక ఎక్స్(ట్విటర్) హ్యాండిల్ ఆయన సందేశం ఉంచింది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దార్శనికత కలిగిన నాయకుడు. రైతులు, పేద, అణగారిన వర్గాల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో ఆయన పేరుగాంచారు. అందుకే ఆ పేరు నేటికీ వినిపిస్తుంటుంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. ఆయన అమలు చేసిన ప్రజా-స్నేహపూర్వక సంక్షేమ కార్యక్రమాలకు ఎల్లప్పుడూ గుర్తుండిపోతారు అని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. Governor of Andhra Pradesh Sri S. Abdul Nazeer offered rich tributes to Dr. Y.S. Rajasekhara Reddy, Former Chief Minister in united Andhra Pradesh, on his death anniversary. pic.twitter.com/JgSHCGOgxR — governorap (@governorap) September 2, 2023 -
జగ్జీవన్ రామ్ జయంతికి సీఎం జగన్ నివాళి
సాక్షి, గుంటూరు: నేడు స్వాతంత్య్రోద్యమ నేత, సంస్కరణవాది బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. సీఎం నివాసంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్. జవహర్ రెడ్డి, అధికారులు హాజరయ్యారు. స్వాతంత్య్రోద్యమ నేత, సంస్కరణవాది బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి నివాసంలో నివాళులర్పించిన సీఎం శ్రీ వైఎస్ జగన్. హాజరైన మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్. జవహర్ రెడ్డి, అధికారులు pic.twitter.com/IEMfIuzX3e — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) April 5, 2023 -
సినీ, రాజకీయాల్లో రారాజు.. కృష్ణంరాజు: మంత్రి రోజా
సాక్షి, హైదరాబాద్: కృష్ణంరాజు భౌతికకాయానికి సోమవారం నివాళులర్పించారు ఏపీ మంత్రులు. నివాళులు అర్పించిన వాళ్లలో మంత్రులు కారుమూరి, వేణుగోపాలకృష్ణ, రోజా తదితరులు ఉన్నారు. ఈ సందర్భగా.. పర్యాటక శాఖ మంత్రి రోజా మాట్లాడుతూ.. సినీ, రాజకీయ రంగాల్లో కృష్ణంరాజు రారాజు. ఆయన మరణం సినీ, రాజకీయ రంగానికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులు ప్రగాఢ సానుభూతి అని మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కృష్ణంరాజుగారి అకాల మరణం బాధాకరం. ఈ వార్త తెలిసి.. ముఖ్యమంత్రి జగన్ చాలా దిగ్భ్రాంతి చెందారు. కృష్ణంరాజుగారు.. రాజకీయాలకు అతీతంగా అందరితో స్నేహ పూర్వకంగా వుండేవారు. ఏపీ తరపున మా మంత్రుల బృందం ఆయనకు నివాళులర్పించింది. మంత్రి వేణుగోపాల్ మాట్లాడుతూ.. సినీ, రాజకీయ రంగాల్లో కృష్ణంరాజు సేవలు మరువలేనివి. ఎల్లప్పుడూ ప్రజలతో మమేకమై వుండేవారు. ప్రసాద్ రాజు మాట్లాడుతూ.. కృష్ణంరాజు మరణం చాలా బాధాకరం. ఆపదలో వున్న ఎవరికైనా సహాయం చేసే గొప్ప మనసున్న వ్యక్తి కృష్ణంరాజు. సూర్య చంద్రులు వున్నంత వరకు అయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా గా మిగిలిపోతారు. విశ్వరూప్ మాట్లాడుతూ.. కృష్ణంరాజుగారు సినీ పరిశ్రమలో ఓ ధృవ తారా. నర్సాపురం లో ఏ గ్రామానికి వెళ్లిన ఆయన జాడలు కనిపిస్తాయి. రాజకీయాలలో హుందా కలిగిన వ్యక్తి. ఇదిలా ఉంటే.. కృష్ణంరాజు అంత్యక్రియలకు ఏపీ ప్రభుత్వం తరపు నుంచి వేణుగోపాలకృష్ణ, రోజా, కారుమూరి, చీఫ్ విప్ ప్రసాదరాజు హాజరుకానున్నారు. ఇదీ చదవండి: రెబల్‌స్టార్ మృతి పట్ల ఏపీ ప్రముఖుల సంతాపం -
జ్యోతిరావు పూలే వర్ధంతి.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, అమరావతి: సామాజిక అసమానతలను, దురాచారాలను దూరం చేయాలంటే విద్యే ఏకైక మార్గం అని నమ్మిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన నివాళులర్పించారు. ‘‘బడుగు, బలహీన వర్గాల హక్కులకోసం పోరాడిన ఉద్యమ కారుడు ఆయన. ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా ఘన నివాళి’’ అని సీఎం ట్విటర్లో పేర్కొన్నారు. సామాజిక అసమానతలను, దురాచారాలను దూరం చేయాలంటే విద్యే ఏకైక మార్గం అని నమ్మిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. బడుగు, బలహీన వర్గాల హక్కులకోసం పోరాడిన ఉద్యమకారుడు ఆయన. ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా ఘన నివాళి. #JyotiraoPhule — YS Jagan Mohan Reddy (@ysjagan) November 28, 2021 చదవండి: ఆ దిశగా మరో ముందడుగు.. సీఎం జగన్ ట్వీట్ -
వేణుమాధవ్ మృతి.. టీమిండియా క్రికెటర్ ట్వీట్
హాస్య నటుడు వేణుమాధవ్ మృతిపై టీమిండియా క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు యూసఫ్ పఠాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. వేణుమాధవ్ మరణించారన్న వార్త తనను షాకింగ్‌కు గురిచేసిందన్నాడు. సిల్వర్ స్క్రీన్‌పై తాను చూసిన అద్భుత హాస్యనటుల్లో అతను ఒకరని పఠాన్ తెలిపాడు. వేణుమాధవ్ లాంటి హాస్య నటుడిని ఇంకెవరూ భర్తీ చేయలేరన్నారు. ఈ సందర్భంగా వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ట్విటర్ వేదికగా ప్రగాఢ సానుభూతి తెలిపారు. అయితే క్రికెటర్ యూసఫ్ పఠాన్ వేణు మాధవ్‌కు సంతాపం తెలుపుతున్న సందేశానికి వేణుమాధవ్ ఫోటోను జతచేసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. గుజరాత్‌కు చెందిన పఠాన్‌కు కేవలం తెలుగు సినిమాలు మాత్రమే తీసిన వేణుమాధవ్ గురించి ఎలా తెలుసని కొందరు చర్చించుకుంటున్నారు. అయితే ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలు హిందీలో డబ్ అవుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సై, ఛత్రపతి వంటి చిత్రాలు హిందీ వర్షన్లో మంచి టాక్‌ను సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాల్లో వేణుమాధవ్ తన విలక్షణ కామెడీతో అందరినీ తెగ నవ్వించాడు. దీంతో పఠాన్ వేణు మాధవ్‌కు ఫ్యాన్ అయ్యాడంటూ కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే సన్‌రైజర్స్ తరుపున పఠాన్ ఆడుతుండటంతో వేణుమాధవ్ గురించి తెలిసుంటుందని మరికొందరు పేర్కొంటున్నారు. కాగా, అనారోగ్యంతో మృతిచెందిన వేణుమాధవ్ అంత్యక్రియలు గురువారం అభిమానుల అశ్రనయనాల మధ్య ముగిశాయి. వేణమాధవ్ మృతిపై టాలీవుడ్ లోకం దిగ్భ్రంతిని వ్యక్తం చేసింది. Shocking to hear the demise of Venu Madhav. He was one of the irreplaceable and finest comedians I've seen on the silver screen. Deep condolences to his family and friends. pic.twitter.com/qxPl63WpwH — Yusuf Pathan (@iamyusufpathan) September 26, 2019 -
వైఎస్ఆర్ లేని లోటు కనిపిస్తోంది
-
రాజీవ్‌గాంధీకి సోనియా, రాహుల్ ఘన నివాళి
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాందీ, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఘనంగా నివాళులర్పించారు. గురువారం ఉదయం రాజీవ్‌గాంధీ సమాధి వీరభూమి వద్దకు వారు చేరుకుని ఘన నివాళులర్పించారు. వారితో పాటు సోనియా కుమార్తె ప్రియాంక, అల్లుడు రాబర్ట్ వాద్రాలు రాజీవ్‌కు సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి అంజలి ఘటించారు. పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలతోపాటు అజయ్ మాకెన్, పీసీ చాకో, గాంధీ కుటుంబసభ్యులు రాజీవ్‌కు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. -
వైఎస్సార్ ఘాట్ వద్ద విజయమ్మ నివాళులు