Krishnam Raju Health: Krishnam Raju Undergoes Surgery, News Goes Viral - Sakshi
Sakshi News home page

‍Krishnam Raju : కృష్ణంరాజుకు ఆపరేషన్‌..

Published Wed, Mar 9 2022 9:48 AM | Last Updated on Wed, Mar 9 2022 11:07 AM

Krishnam Raju Undergoes Surgery, News Goes Viral - Sakshi

టాలీవుడ్‌ సీనియర్‌ హీరో, ప్రభాస్‌ పెదనాన్న కృష్ణంరాజు చిన్న ప్రమాదానికి గురయ్యారు. ఇటీవల ఆయన ఇంట్లో కాలు జారి కిందపడిపోయారట. దీంతో ఆయనకు ఆపరేషన్‌ జరిగిందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. సర్జరీలో భాగంగా ఆయన కాలి వేలుని తొలగించాల్సి వచ్చిందట. ఈ విషయం తెలిస్తే.. రెబల్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ కంగారు పడే అవకాశం ఉందని, రహస్యంగా ఉంచినట్లు సమాచారం.

 ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి మాట్లాడుతూ.. ఆయన ఇంట్లో జారిపడ్డారని చెప్పారు. కానీ ఆపరేషన్‌ జరిగిందనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. అభిమానులకు ఇబ్బంది కలిగించొద్దనే ఉద్దేశ్యంతోనే ఈ విషయాన్ని చెప్పలేదట. ఆపరేషన్‌ కారణంగానే ‘రాధేశ్యామ్‌’ప్రమోషన్స్‌లో ఆయన పాల్గొనలేకపోయాడట. మూవీ విడుదల తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

కాగా, ప్రభాస్‌ హీరోగా నటించిన రాధేశ్యామ్‌ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సినిమాలో ప్రభాస్ తన కెరీర్‌లోనే మొదటిసారి జ్యోతిష్కుడిగా నటించారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించారు. ఈ చిత్రంలో విక్రమాదిత్య(ప్రభాస్) గురువు పరమహంస పాత్రలో ఆయన కనిపించబోతున్నారు. గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement