సాక్షి, హైదరాబాద్: జైలు తనకేమీ కొత్త కాదని, సీఎం కేసీఆర్ కుటుంబానికే కొత్తని, జైలుకెళ్లేందుకు కేసీఆర్ కుటుంబం సిద్ధంగా ఉండాలని తీన్మార్ మల్లన్న ఆలియాస్ చింతపండు నవీన్ పేర్కొన్నారు. చర్లపల్లి జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయన మంగళవారం విడుదలయ్యారు. మల్లన్న అభిమానులు జైల్ వద్ద స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ తనపై ప్రభుత్వం మోపిన కేసులన్నీ దొమ్మీ కేసులేనని, అందుకే కోర్టు బెయిల్ మంజూరు చేసిందని తెలిపారు.
'తెలంగాణ నిర్మాణ పార్టీ' పేరుతో రాజకీయపార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో మేడ్చల్ అసెంబ్లీ స్థానం నుంచి తన పార్టీ తరఫున పోటీ చేస్తానని తెలిపారు. అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు ప్రజల మనోభావాలు గౌరవించేందుకు కాదని, మహారాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశం కోసమేనని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేది యువతేనని..రైట్ రీ కాల్ తీసుకొస్తామని స్పష్టం చేశారు.
చదవండి: ఒక్క గుంట భూమి ఎక్కువున్నా రాజీనామా చేస్తా.. పశువుల కొట్టాలు, కూలీల రేకుల షెడ్లు కూడా ఫాంహౌస్‌లేనా?
Comments
Please login to add a commentAdd a comment