
‘దిల్‌సుఖ్‌నగర్’ నిందితులకు భద్రత పెంపు
హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసు నిందితులు జైలు నుంచి పరారయ్యే అవకాశాలు ఉన్నాయని ఐబీ హెచ్చరికలతో ఎన్ఐఏ అధికారులు అప్రమత్తమయ్యారు. చర్లపల్లి జైల్లో ఉన్న నిందితులు పారిపోయే అవకాశం ఉందని ఐబీ సూచించడంతో.. జైల్లో భద్రత పెంచారు.
నిందితులు ఉంటున్న మంజీర బ్యారెక్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు.. 2 బెటాలియన్ల భద్రతా బలగాలను అదనంగా నియమించారు.