ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది సయ్యద్ ఎజాజ్
దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసులో ఇతగాడికీ మరణ శిక్ష
జామా మసీదు ‘ఉగ్ర మెయిల్స్’లోనూ నిందితుడు
ఆ కేసులో కీలక సాక్ష్యమైనసీసీ కెమెరాల ఫుటేజ్ సీడీ
హఠాత్తుగా అది కనిపించకపోవడంతో వీగిపోయిన కేసు
సాక్షి, హైదరాబాద్: అతడో కరుడుగట్టిన ఉగ్రవాది.. దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో మరణ శిక్ష పడిన వారిలో ఒకడు.. ఢిల్లీలోని జామా మసీదు వద్ద జరిగిన విధ్వంసం కేసులోనూ నిందితుడిగా ఉన్నాడు.. ఆ కేసులో కీలక సాక్ష్యంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌తో కూడిన సీడీ అక్కడి కోర్టుకు చేరలేదు.. పోలీసుల వద్దే మిస్ కావడంతో నిర్దోషిగా ప్రకటిస్తూ న్యాయస్థానం గత వారం తీర్పు ఇచ్చింది. ఐటీ ప్రొఫెషనల్ నుంచి ఉగ్రవాదిగా మారిన పుణేవాసి ఎజాజ్ సయీద్ షేక్ నేపథ్యమిది. మహారాష్ట్రలోని పుణేలో ఉన్న ఘోర్‌పేట్ పీఠ్‌కు చెందిన ఎజాజ్ షేక్ ప్రముఖ బీపీఓ సంస్థలో ఐటీ నిపుణుడిగా పని చేశాడు. ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకులు రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ ప్రధాన అనుచరుడు మోహిసిన్ చౌదరికి సమీప బంధువు. అతడి ద్వారానే ఉగ్రవాద బాటపట్టాడు. 2008లో ఢిల్లీలోని బాట్లాహౌస్ ఎన్‌కౌంటర్ తర్వాత పాకిస్థాన్‌కు పారిపోయిన మోహిసిన్ చౌదరితో సంప్రదింపులు జరుపుతూనే ఉండేవాడు.
ఇతడి ద్వారానే ఐంఎ మాస్టర్‌మైండ్ రియాజ్ భత్కల్‌కు దగ్గరయ్యాడు. బాంబు పేలుళ్లకు కొన్ని నిమిషాల ముందు మీడియా సంస్థకు ఈ–మెయిల్స్ పంపడానికి ఐఎం ఓ మీడియా సెల్‌నే ఏర్పాటు చేసుకుంది. దీనికి ఇన్‌చార్జ్‌గా ఉన్న పుణేవాసి మన్సూర్ అస్ఘర్ పీర్భాయ్ వ్యవహరించాడు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి, ఢిల్లీలోని జామా మసీదు, పుణేలోని జర్మన్ బేకరీ ఉదంతాలకు ముందూ ఇలాంటి ఈ–మెయిల్స్ మీడియాకు వచ్చాయి. వీటిపై సాంకేతికంగా దర్యాప్తు చేసిన ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారులు ఎజాజ్ పాత్రను గుర్తించారు. 2013 సెపె్టంబర్ 6న ఉత్తరప్రదేశ్‌లోని పశి్చమ ప్రాంతమైన సహరంగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఇతడిని పట్టుకున్నారు. దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లకు అవసరమైన నిధుల్ని పంపే బాధ్యతల్ని రియాజ్ భత్కల్ మహారాష్ట్రలోని పుణేలో ఉంటున్న ఎజాజ్‌కు అప్పగించాడు.
దీంతో ఎజాజ్ మంగుళూరులోని హంపన్‌కట్టలో ఉన్న వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్‌ఫర్ సంస్థ ఔట్‌లెట్ సుపమ ఫోరెన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు మంగుళూరులోని మార్కెట్ రోడ్డులో హవాలా వ్యాపారం నిర్వహించే డింగ్‌డాంగ్ దుకాణం యజమాని ద్వారా 2013 ఫిబ్రవరిలో రూ.6.8 లక్షలు పంపాడు. ఆ నగదుని వినియోగించే ఉగ్రవాదులు 2013 ఫిబ్రవరిలో దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ కేసులో మిగిలిన నిందితులతో పాటు ఎజాజ్‌కు 2016లో ప్రత్యేక కోర్టు ఉరి శిక్ష విధించింది. అప్పటి నుంచి ఎజాజ్ కొన్నాళ్లు చర్లపల్లి కేంద్ర కారాగారంలోనే ఉన్నాడు. ఢిల్లీ కోర్టులో ట్రయల్ నడుస్తున్న జామా మసీదు వద్ద విధ్వంసం కేసులో అక్కడి పోలీసులు తీసుకువెళ్లారు.
ఈ ఉదంతానికి ముందు ఈ–మెయిల్ పంపడానికి వినియోగించిన ఫోన్‌ను ఎజాజ్ ముంబైలోని మనీష్ మార్కెట్‌లో ఖరీదు చేశాడు. అప్పట్లో దర్యాప్తు అధికారులు దీనికి సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజ్‌ను సేకరించి సీడీలో భద్రపరిచారు. ఆ కేసులో ఎజాజ్ నేరం చేశాడని నిరూపించడానికి ఇదే కీలక ఆధారం. అయితే నాలుగున్నరేళ్ల క్రితం ఈ సీడీ పోలీసుల వద్ద నుంచి హఠాత్తుగా మిస్ అయింది. మరో కాపీ కూడా లేకపోవడంతో కోర్టులో దాఖలు చేయలేకపోయారు. దీంతో పాటు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకున్న ఢిల్లీ కోర్టు ఎజాజ్‌ను నిర్దోíÙగా ప్రకటించింది. దీంతో 2011లో ముంబైలో జరిగిన ట్రిపుల్ బ్లాస్ట్ కేసు విచారణ కోసం ఎజాజ్‌ను అక్కడకు తరలించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment