చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీ వద్ద సెల్‌ఫోన్ లభ్యం అయిన ఘటన కలకలం రేపింది.
హైదరాబాద్: చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీ వద్ద సెల్‌ఫోన్ లభ్యం అయిన ఘటన కలకలం రేపింది. మానస బ్లాక్‌లో రెండు నెలలుగా రిమాండ్ ఖైదీగా ఉంటున్న విదేశీయుడి వద్ద సోమవారం అధికారులు తనిఖీ చేసి సెల్‌ఫోన్ ఉన్నట్లు తేల్చారు.
దీని వెనుక జైలు సిబ్బంది హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సెల్‌ను స్వాధీనం చేసుకుని, ఖైదీని విచారిస్తున్నారు.