సామాజిక సేవకోసమే క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నామని సినీనటుడు శ్రీకాంత్ తెలిపారు. స్థానిక రాయల్ కౌంటీ రిసార్ట్స్ మైదానంలో ఆదివారం రాత్రి నిర్వహించిన 20-20 క్రికెట్ మ్యాచ్‌లో ఆడేందుకు ఆయన వచ్చారు.
ప్రొద్దుటూరు,న్యూస్‌లైన్: సామాజిక సేవకోసమే క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నామని సినీనటుడు శ్రీకాంత్ తెలిపారు. స్థానిక రాయల్ కౌంటీ రిసార్ట్స్ మైదానంలో ఆదివారం రాత్రి నిర్వహించిన 20-20 క్రికెట్ మ్యాచ్‌లో ఆడేందుకు ఆయన వచ్చారు.
జట్టు కెప్టెన్‌గా హాజరయిన ఆయన మాట్లాడుతూ టీజీఎస్‌ఎస్ సంస్థ సమాజసేవలో భాగంగా అనాథ బాలికల సంరక్షణ కోసం ఈ క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించిందన్నారు. సంస్థ ఇంకా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతోందన్నారు.టీజీఎస్‌ఎస్ కు వీహెచ్ 7, క్రియేటివ్ హెడ్ సంస్థలు తోడ్పాటునందిస్తున్నాయన్నారు. మాజీ ఎమ్యెల్యే లింగారెడ్డి మాట్లాడుతూ సామాజిక సేవ కార్యక్రమం కోసం నటులు ఇంతదూరం రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
శ్రీకాంత్, తరుణ్ జట్ల మధ్య మ్యాచ్
సినీనటులు శ్రీకాంత్, తరుణ్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. ముందుగా టాస్ గెలిచిన తరుణ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో శ్రీకాంత్ జట్లు బ్యాటింగ్‌కు దిగింది. శ్రీకాంత్ జట్టులో సినీనటులు అశ్విన్,తణీష్, సుధీర్, అల్లరి నరేష్, సామ్రాట్, ప్రభు, రవి ప్రకాష్, నవీన్ చంద్ర, ఖయ్యూం, ప్రిన్స్, ఆదర్స్, రఘులు ఉన్నారు.
తరుణ్ జట్టులో చరణ్, భూపాల్,నితిన్, నాని, అజయ్, రాజీవ్, అయ్యపు, కార్తీక్, తారక్,నందకిషోర్,విశ్వ తదితరులు ఉన్నారు. అలాగే నటీమణులు మధుశాలిని,మాధవీలత, వికితాషేరు,ప్రియాంక,స్వాతిరెడ్డి,విన్నీనాయుడు, మెరీనా తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో రాయల్ కౌంటీ రిసార్ట్ నిర్వాహకులు రఘునాథరెడ్డి, జంపాల మధుసూధనరెడ్డి, రాకేష్‌రెడ్డి, క్రికెట్ మ్యాచ్ నిర్వాహకులు సయ్యద్, విక్కీ, హరి,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ముందు జాగ్రత్త చర్యగా డిస్సీ శ్రీనివాసులరెడ్డి గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు.