
చెన్నై: క్రికెట్ మ్యాచ్ ఆడుతుండగా గొడవ జరగడంతో ఓ పదో తరగతి విద్యార్థి తోటి విద్యార్థిని కత్తెరతో పొడిచి హత్య చేశాడు. తమిళనాడు కోడైకెనాల్‌లోని ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మ్యాచ్ ఆడుతుండగా ఎస్ కపిల్ రాఘవేంద్ర అనే విద్యార్థికి, నిందితుడికి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆవేశానికి లోనైన అతను సోమవారం కపిల్ రాఘవేంద్రను కత్తెరతో పొడిచాడు. దీంతో గాయపడిన కపిల్‌ను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనతో స్కూల్ నుంచి పారిపోయిన జువెనైల్‌ను సమీపంలోని పరిసరాల్లో అనుమానాస్పదంగా తచ్చాడుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా తోటి విద్యార్థిని తానే చంపానని అంగీకరించాడు. జువెనైల్‌ను జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుచగా.. జువెనైల్ స్కూల్‌కు అతన్ని రిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment