ప్రయోగాలు చెయ్యం :కోహ్లీ
ప్రయోగాలు చెయ్యం :కోహ్లీ
Published Sat, Jan 14 2017 2:31 PM | Last Updated on Wed, May 29 2019 2:49 PM
ముంబై :
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పుణేలో జరిగే తొలి మ్యాచ్‌లో రేపు (ఆదివారం) భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. విరాట్ కోహ్లి పూర్తి స్థాయి వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆడుతున్న తొలి సిరీస్ ఇదే కావడం విశేషం. టెస్టుల్లో ఇంగ్లండ్‌ను చిత్తుచిత్తుగా ఓడించిన భారత్ వన్డేల్లోనూ అదే జోరును ప్రదర్శించాలని భావిస్తోంది. జట్టు సభ్యులంతా మంచి ఫామ్లో ఉన్నారు, ప్రస్తుత పరిస్థితుల్లో పెద్దగా ప్రయోగాలు చేయబోమని కోహ్లీ స్పష్టం చేశాడు.
మరోవైపు పరిమితి ఓవర్ల స్పెషలిస్ట్ ఆటగాళ్లతో భారత్‌కు వచ్చిన ఇంగ్లండ్ టెస్టు సిరీస్ ఫలితం పునరావృతం కారాదని పట్టుదలగా ఉంది. దాదాపు పదేళ్ల తర్వాత మరో కెప్టెన్ నాయకత్వంలో బరిలోకి దిగుతున్న ధోనితో పాటు పునరాగమనం చేసిన యువరాజ్‌పై ప్రధానంగా అందరి దృష్టీ నిలిచింది. జేసన్ రాయ్, హేల్స్, బట్లర్‌లాంటి హిట్టర్లతో ఇంగ్లండ్ కూడా మెరుగ్గా కనిపిస్తోంది.
Advertisement