ప్రయోగాల వేళ... | today india and newziland first one day match | Sakshi
Sakshi News home page

ప్రయోగాల వేళ...

Published Sun, Oct 16 2016 12:04 AM | Last Updated on Wed, May 29 2019 2:49 PM

ప్రయోగాల వేళ... - Sakshi

ప్రయోగాల వేళ...

భారత్, న్యూజిలాండ్ తొలి వన్డే నేడు
కొత్త కాంబినేషన్‌తో ధోనిసేన
పటిష్టంగా కివీస్ బృందం
భారత్‌కు ఇది 900వ వన్డే మ్యాచ్


వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో చాంపియన్‌‌స ట్రోఫీ జరుగనుంది. భారత్ జట్టు ఆ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగాల్సి ఉంది. అరుుతే ఆ టోర్నీలోపు భారత్ కేవలం ఎనిమిది వన్డేలు మాత్రమే ఆడుతుంది. ఇదే సమయంలో ఈ ఏడాది మొత్తం మీద ఇప్పటివరకూ ఒక్క ఆస్ట్రేలియాతో మాత్రమే మంచి సిరీస్ ఆడింది. జింబాబ్వేలో ద్వితీయశ్రేణి ఆటగాళ్లు ఆడారు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచి ఆడబోయే ప్రతి మ్యాచ్‌లోనూ భారత్ ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో కూడా భిన్నమైన కూర్పుతో ధోనిసేన బరిలోకి దిగుతోంది.


అటు న్యూజిలాండ్ కూడా వన్డేలు ఆడి దాదాపు ఎనిమిది నెలలైంది. బ్రెండన్ మెకల్లమ్ రిటైర్మెంట్ తర్వాత ఆ జట్టు ఆడబోతున్న తొలి వన్డే ఇది. చాంపియన్‌‌స ట్రోఫీకి ముందు ఆ జట్టు కూడా ప్రయోగాలు చేయాల్సి ఉంది. అరుుతే భారత్‌తో మూడు టెస్టుల సిరీస్‌ను దారుణంగా కోల్పోరుున నేపథ్యంలో ఇప్పుడు మాత్రం పూర్తిస్థారుు జట్టుతోనే బరిలోకి దిగుతోంది. సీనియర్ ఆటగాళ్లంతా అందుబాటులో ఉండటంతో ఆ జట్టు బలంగా కనిపిస్తోంది. 


ధర్మశాల: భారత క్రికెట్ చరిత్రలో మరో మైలురారుు. ఇటీవల న్యూజిలాండ్‌తో సిరీస్ ద్వారా 500వ టెస్టు, స్వదేశంలో 250వ టెస్టు మ్యాచ్ ల్యాండ్ మార్క్‌లను చేరుకున్న భారత్... ఈసారి న్యూజిలాండ్‌తో తొలి వన్డే ద్వారా తమ చరిత్రలో 900వ వన్డే మ్యాచ్ ఆడబోతోంది. కాబట్టి విజయంతో దీనిని చిరస్మరణీయం చేసుకోవాలని భారత్ జట్టు ఆశించడం సహజం. మరోవైపు న్యూజిలాండ్ టెస్టుల్లో ఘోరంగా విఫలమైనా... వన్డేల్లో ఆ జట్టు చాలా ప్రమాదకరం. ఈ నేపథ్యంలో నేడు (ఆదివారం) జరిగే తొలి వన్డే హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఓ వైపు హిమాలయాల ఆహ్లాదం, మరోవైపు పరుగుల వినోదంతో మరోసారి ధర్మశాల సందడిగా మారనుంది.

 
ధోనిపైనే దృష్టి

భారత వన్డే కెప్టెన్ ధోని ఓ మంచి ఇన్నింగ్‌‌స ఆడి చాలా కాలమైంది. కోహ్లిని అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయాలనే డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో మరోసారి తనని తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌లో ధోని బ్యాటింగ్ ఆర్డర్‌లో కాస్త ముందుకు వచ్చి ఐదో స్థానంలో ఆడే అవకాశం ఉంది. గాయాలు, విశ్రాంతి కారణంగా పలువురు సీనియర్ క్రికెటర్లు అందుబాటులో లేనందున ఈసారి జట్టు కూర్పు కూడా కాస్త భిన్నంగా ఉండబోతోంది. రోహిత్, రహానే కలిసి ఓపెనింగ్ చేస్తారు. కోహ్లి, మనీశ్ పాండే తర్వాతి రెండు స్థానాల్లో ఆడతారు. రైనా అందుబాటులో లేనందున తొలి వన్డేలో కేదార్ జాదవ్ తుది జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఆల్‌రౌండర్ స్లాట్‌లో హార్దిక్ పాండ్యాకు అవకాశం లభించవచ్చు. ఆఫ్ స్పిన్నర్ జయంత్ యాదవ్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నా... అక్షర్ పటేల్, అమిత్ మిశ్రాలలో ఒకరిని ఆపడం కష్టం. ఇక పేస్ విభాగంలో బుమ్రాతో పాటు ధావల్ కులకర్ణి, ఉమేశ్ యాదవ్‌లలో ఒకరు తుది జట్టులో ఉంటారు. పిచ్ స్వభావం దృష్టిలో పెట్టుకొని ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లను ఆడించాలని భావిస్తే పాండ్యా లేదా మిశ్రాలలో ఒకరు బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. కోహ్లి, రహానే, రోహిత్‌ల ఫామ్‌తో భారత బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కనిపిస్తోంది. 

 
ఆ ఇద్దరూ ఏం చేస్తారో..?

మార్టిన్ గప్టిల్, రాస్ టేలర్... న్యూజిలాండ్ క్రికెట్‌లో చాలా సీనియర్ ఆటగాళ్లు. టెస్టు సిరీస్‌లో ఈ ఇద్దరూ విఫలమయ్యారు. అరుుతే వన్డేల్లో ఇద్దరికీ మంచి రికార్డు ఉంది. ఈ ఇద్దరూ కుదురుకోవడంపై ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ ఫలితాలు ఆధారపడి ఉంటారుు. కెప్టెన్ విలియమ్సన్, లాథమ్ ఫామ్‌లో ఉన్నారు. ఆల్‌రౌండర్లు నీషమ్, సాన్‌ట్నర్ ఇద్దరూ వైవిధ్యంగా ఆడే ఆటగాళ్లు. సౌతీ తిరిగి రావడంతో పేస్ విభాగం కూడా పటిష్టంగా కనిపిస్తోంది. బౌల్ట్, హెన్రీలలో ఒక్కరు తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. కోరీ అండర్సన్ జట్టులోకి తిరిగి వచ్చినా గాయం కారణంగా తను కేవలం బ్యాటింగ్‌కే పరిమితం కానున్నాడు. టి20 ప్రపంచకప్‌లో ముగ్గురు స్పిన్నర్లతో భారత్‌ను ఓడించిన న్యూజిలాండ్... తొలి వన్డేలో పిచ్ స్వభావం దృష్టా ్య ఇద్దరు స్పిన్నర్లకు పరిమితం కానుంది. ఏమైనా... న్యూజిలాండ్ జట్టు పటిష్టంగా కనిపిస్తోంది.

 

 జట్లు(అంచనా)

 భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, రహానే, కోహ్లి, మనీశ్ పాండే, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, బుమ్రా, ధావల్/ఉమేశ్.
న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), గప్టిల్, లాథమ్, టేలర్, అండర్సన్, రోంచీ, నీషమ్, సాన్‌ట్నర్, సౌతీ, బౌల్ట్/హెన్రీ, సోధి.

 

పిచ్, వాతావరణం
ప్రస్తుతం ధర్మశాలలో పగలు చాలా వేడిగా, సాయంత్రం విపరీతమైన చలి ఉంటోంది. ఆదివారం కూడా ఇదే తరహా వాతావరణం ఉండొచ్చు. సాయంత్రం పూట మంచు కురుస్తుంది కాబట్టి... టాస్ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్ చేసే అవకాశం ఉంది. ఇక పిచ్ మీద పచ్చికను దాదాపుగా తీసేసినా... పిచ్ మీద బౌన్‌‌స బాగా ఉండే అవకాశం ఉంది. పేస్ బౌలర్లు కీలకం కావచ్చు.

 

‘జట్టులో కెప్టెన్ అరుునా వైస్ కెప్టెన్ అరుునా యువ క్రికెటర్లకు మార్గదర్శనం చేయడం ముఖ్యం. ఐదు, ఆరు స్థానాల్లో మంచి ఫినిషర్ ఎప్పుడూ జట్టులో ఉండాలి. దీనిపై మాకు భవిష్యత్ కోసం ప్రణాళికలు ఉన్నారుు. సీజన్‌లో చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కాబట్టి సీనియర్ క్రికెటర్లకు విశ్రాంతి అవసరం. దీనివల్ల కొత్త ఆటగాళ్లను పరీక్షించడానికి కూడా అవకాశం ఉంటుంది. అరుుతే విజయాలు కూడా ముఖ్యమే. అందుకే రొటేషన్ పద్ధతిలో విశ్రాంతి ఇవ్వడం మేలు. టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి సలహాలను ఇప్పటికే వన్డేలలోనూ తీసుకుంటున్నాను.’      - ధోని

 

భారత్‌లో న్యూజిలాండ్ ద్వైపాక్షిక సిరీస్‌ను ఎప్పుడూ గెలవలేదు.
భారత్, న్యూజిలాండ్‌ల మధ్య ఇప్పటివరకూ 93 వన్డేలు జరగగా... భారత్ 46, న్యూజిలాండ్ 41 గెలిచారుు. ఐదు మ్యాచ్‌లు రద్దు కాగా, ఒక మ్యాచ్ టైగా ముగిసింది.
వన్డే చరిత్రలో భారత్ ఇప్పటివరకూ 899 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 454 గెలిచి, 399 ఓడిపోరుుంది. 7 మ్యాచ్‌లు టై కాగా... 39 మ్యాచ్‌లలో ఫలితం రాలేదు.
 

 మ. గం. 1.30 నుంచి స్టార్ స్పోర్‌‌ట్స-1లో ప్రత్యక్ష ప్రసారం

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement