Brendan mekallam
-
4 సిక్సర్లు... 444 పరుగులు
అంతర్జాతీయ క్రికెట్లో అద్భుత ఘట్టాలు ఏడాది మొదలవగానే బెన్ స్టోక్స్ తన భీకర బ్యాటింగ్‌తో విరుచుకుపడితే... నా పేరు లేకుండా ‘ఫాస్టెస్ట్’ జాబితా ఎలా ఉంటుంది అన్నట్లుగా వెళుతూ వెళుతూ బ్రెండన్ మెకల్లమ్ పెను దాడికి పాల్పడ్డాడు... ‘ప్రపంచ’ హీరోగా మారేందుకు టన్నుల కొద్దీ పరుగులే చేయాలా, నాలుగు బంతులు చాలవా అనుకొని కార్లోస్ బ్రాత్‌వైట్ విధ్వంసం సృష్టిస్తే... మేమూ మారుతున్నాం అంటూ వరల్డ్ రికార్డు కొట్టి మరీ ఇంగ్లండ్ ప్రకటించుకుంది... పాక్ పుష్ అప్లు, ఆసీస్ పతనం కూడా గత పన్నెండు నెలలలో అందరికీ గుర్తుండిపోయాయి. టెస్టులు, టి20లలో అత్యధిక విజయాలతో ప్రపంచ క్రికెట్‌ను భారత జట్టు శాసించినా... మన టీమ్ భాగం కాని అనేక చిరస్మరణీయ క్షణాలు 2016లో ఉన్నాయి. ఈ సంవత్సర కాలంలో క్రికెట్ అభిమానుల మనసులో నిలిచిపోయిన కొన్ని ఘట్టాలను చూస్తే... స్టోక్స్ ‘డబుల్’ స్ట్రోక్ కొత్త సంవత్సరంలో మూడో రోజే ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ బెన్ స్టోక్స్ సంచలన బ్యాటింగ్ ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించింది. దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో జరిగిన రెండో టెస్టులో స్టోక్స్ 163 బంతుల్లోనే ‘డబుల్ సెంచరీ’ సాధించి టెస్టు చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీని నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను మొత్తం 198 బంతుల్లో 30 ఫోర్లు, 11 సిక్సర్లతో 258 పరుగులు చేశాడు. మరోవైపు ఇదే ఏడాది టెస్టుల్లో 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ ఈ ఘనతను తక్కువ టెస్టుల్లో సాధించిన క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. ఇటీవలే అతని 11 వేల పరుగులు కూడా పూర్తయ్యాయి. మెకల్లమ్ ‘ఫినిషింగ్ టచ్’ విధ్వంసకర ఆటగాడిగా తనకున్న గుర్తింపును బ్రెండన్ మెకల్లమ్ తన కెరీర్ చివరి మ్యాచ్‌లోనూ నిలబెట్టుకున్నాడు. క్రైస్ట్‌చర్చ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో మెకల్లమ్ 54 బంతుల్లోనే సెంచరీ సాధించి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. గతంలో 56 బంతుల్లో సెంచరీ చేసిన వివియన్ రిచర్డ్స్, మిస్బా రికార్డును అతను సవరించాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 79 బంతుల్లో 21 ఫోర్లు, 6 సిక్సర్లతో 145 పరుగులు సాధించాడు. మరోవైపు శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్‌లో కివీస్ క్రికెటర్ కొలిన్ మున్రో 14 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసి రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు నెలకొల్పాడు. వెస్టిండీస్ మహిళలకే పట్టం వెస్టిండీస్ పురుషుల జట్టు విజేత కావడానికి కొద్దిసేపు ముందే విండీస్ మహిళల టీమ్ కూడా తొలిసారి టి20 ప్రపంచకప్‌లో చాంపియన్‌గా నిలిచింది. తుది పోరులో ఆ జట్టు 8 వికెట్లతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. బెంబేలెత్తించిన బ్రాత్‌వైట్ వెస్టిండీస్ జట్టు రెండోసారి టి20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన ఫైనల్లో విండీస్ 4 వికెట్లతో ఇంగ్లండ్‌ను ఓడించింది. అయితే ఫైనల్లో కార్లోస్ బ్రాత్‌వైట్ కురిపించిన సిక్సర్ల వర్షం ఈ టోర్నీని చిరస్మరణీయం చేసింది. గెలుపు కోసం చివరి ఓవర్లో విండీస్ 19 పరుగులు చేయాల్సి ఉండగా, స్టోక్స్ బౌలింగ్‌లో బ్రాత్‌వైట్ తొలి నాలుగు బంతుల్లో వరుసగా 6, 6, 6, 6 బాది తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఫైనల్ ముగిసిన తర్వాత కెప్టెన్ స్యామీ చేసిన ఉద్వేగభరిత ప్రసంగం కూడా అదే స్థాయిలో హైలైట్‌గా నిలిచింది. విండీస్ కుర్రాళ్లూ కొట్టేశారు అండర్–19 ప్రపంచ కప్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచి జోరు మీదున్న భారత్‌కు ఫైనల్లో వెస్టిండీస్ యువ సేన షాక్ ఇచ్చింది. ఢాకాలో జరిగిన ఫైనల్లో విండీస్ 5 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. పాకిస్తాన్ ‘పుష్ అప్స్’ ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్ 75 పరుగుల తేడాతో విజయం సాధించింది. సెంచరీ సాధించిన అనంతరం పాక్ కెప్టెన్ మిస్బావుల్ హక్ ‘సెల్యూట్’... మ్యాచ్ గెలిచాక జట్టు మొత్తం కలిసి చేసిన ‘పుష్ అప్స్’ ఈ ఏడాది మేటి చిత్రాల్లో నిలిచాయి. ఈ సిరీస్ తర్వాత పాకిస్తాన్ తొలిసారి ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానానికి చేరింది. మరోవైపు 2010లో ఇదే మైదానంలో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధం, జైలు శిక్షకు గురైన మొహమ్మద్ ఆమిర్ పునరాగమనం తర్వాత అదే లార్డ్స్‌లో తన తొలి టెస్టు ఆడటం యాదృచ్ఛికం. ఫిక్సింగ్‌లో అతని సహ నిందితులైన మొహమ్మద్ ఆసిఫ్, సల్మాన్ బట్ కూడా ఇటీవలే అధికారికంగా దేశవాళీ క్రికెట్లోకి మళ్లీ అడుగు పెట్టారు. వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో అజహర్ అలీ తొలి ‘ట్రిపుల్ సెంచరీ’ నమోదు చేయడం పాక్ క్రికెట్‌కు సంబంధించి మరో విశేషం. సూపర్ ఛేజింగ్ టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. ముందుగా దక్షిణాఫ్రికా 229 పరుగులు చేయగా, ఆ తర్వాత ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 230 పరుగులు సాధించింది. టి20 ప్రపంచ కప్‌లో ఛేజింగ్‌లో ఇదే రికార్డు కాగా, ఓవరాల్‌గా అంతర్జాతీయ టి20ల్లో రెండో అత్యుత్తమ లక్ష్య ఛేదన. ఈ మ్యాచ్‌లో రూట్ 44 బంతుల్లో 83 పరుగులు, జేసన్ రాయ్ 16 బంతుల్లో 43 పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ను వణికించిన పులులు బంగ్లాదేశ్ జట్టు తమ టెస్టు చరిత్రలోనే అత్యుత్తమ విజయాన్ని అందుకుంది. తొలి టెస్టులో విజయానికి చేరువగా వచ్చి అనూహ్యంగా ఓడిన బంగ్లాదేశ్, రెండో టెస్టులో 108 పరుగులతో తొలిసారిగా ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. 2000లో టెస్టు హోదా పొందిన తర్వాత ఆడిన 95 మ్యాచ్‌లలో ఆ జట్టుకు ఇది ఎనిమిదో విజయం మాత్రమే. విండీస్, జింబాబ్వే తర్వాత బంగ్లా చేతిలో ఓడిన మూడో జట్టు ఇంగ్లండ్. రెండు టెస్టుల ఈ సిరీస్‌లో బంగ్లాదేశ్ యువ స్పిన్నర్ మెహదీ హసన్ విశేషంగా రాణించి అందరి దృష్టిని ఆకర్షించాడు. తొలి టెస్టులో 7 వికెట్లు, రెండో టెస్టులో 12 వికెట్లు తీసిన 19 ఏళ్ల హసన్ మొత్తం 19 వికెట్లతో ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారాన్ని అందుకున్నాడు. ఇంగ్లండ్ వన్డే వెలుగులు క్రికెట్ పుట్టిల్లు ఇంగ్లండ్ జట్టు తొలి వన్డే ఆడి 45 ఏళ్లు అయినా, మూడు ప్రపంచకప్‌లలో ఫైనల్ చేరినా... కొన్నేళ్లుగా వన్డేల్లో ఆ జట్టు ఆటతీరు నామమాత్రమే. చిన్నజట్లు కూడా దూసుకుపోగా ఇంగ్లండ్ పాతతరంలోనే ఆగిపోయింది. కానీ ఇప్పుడిప్పుడే మార్పు చూపిస్తున్న ఆ జట్టు 2016లో గొప్ప మైలురాయిని చేరింది. పాకిస్తాన్‌తో నాటింగ్‌హామ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 3 వికెట్లకు 444 పరుగుల స్కోరు సాధించింది. వన్డేల చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో 122 బంతుల్లో 22 ఫోర్లు, 4 సిక్సర్లతో 171 పరుగులు చేసిన అలెక్స్ హేల్స్ ఆ జట్టు తరఫున వన్డేల్లో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఆస్ట్రేలియా చిత్తు చిత్తుగా... 30 ఏళ్లలో ఆస్ట్రేలియాతో జరిగిన 11 సిరీస్‌లలో ఒకే ఒక మ్యాచ్ గెలిచిన శ్రీలంక తమ సొంతగడ్డపై సత్తా చాటింది. కంగారూలతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ ఏడాది ఆసీస్ పతనం ఇక్కడితో ఆగలేదు. దక్షిణాఫ్రికాకు వెళ్లి తమ చరిత్రలో తొలిసారి 0–5తో ఘోరంగా వన్డే సిరీస్‌ను కోల్పోయింది. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా దక్షిణాఫ్రికాకు 1–2తో టెస్టు సిరీస్‌ను అప్పగించింది. హోబర్డ్‌లో జరిగిన రెండో టెస్టులో స్మిత్ సారథ్యంలోని ఆస్ట్రేలియా 85 పరుగులకే కుప్పకూలి సొంతగడ్డపై 32 ఏళ్లలో అతి చెత్త రికార్డును నమోదు చేసింది. 2016లో టాపర్స్ ► టెస్టుల్లో అత్యధిక పరుగులు: జో రూట్ (1477) ► అత్యధిక వికెట్లు: రవిచంద్రన్ అశ్విన్ (72) ► వన్డేల్లో అత్యధిక పరుగులు: వార్నర్ (1388) ► అత్యధిక వికెట్లు: ఆడమ్ జంపా (30) ► టి20ల్లో అత్యధిక పరుగులు: కోహ్లి (641) ► అత్యధిక వికెట్లు: జస్ప్రీత్ బుమ్రా (28) -
భారత్, న్యూజిలాండ్ తొలి వన్డే నేడు
-
ప్రయోగాల వేళ...
భారత్, న్యూజిలాండ్ తొలి వన్డే నేడు కొత్త కాంబినేషన్‌తో ధోనిసేన పటిష్టంగా కివీస్ బృందం భారత్‌కు ఇది 900వ వన్డే మ్యాచ్ వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో చాంపియన్స ట్రోఫీ జరుగనుంది. భారత్ జట్టు ఆ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగాల్సి ఉంది. అరుుతే ఆ టోర్నీలోపు భారత్ కేవలం ఎనిమిది వన్డేలు మాత్రమే ఆడుతుంది. ఇదే సమయంలో ఈ ఏడాది మొత్తం మీద ఇప్పటివరకూ ఒక్క ఆస్ట్రేలియాతో మాత్రమే మంచి సిరీస్ ఆడింది. జింబాబ్వేలో ద్వితీయశ్రేణి ఆటగాళ్లు ఆడారు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచి ఆడబోయే ప్రతి మ్యాచ్‌లోనూ భారత్ ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో కూడా భిన్నమైన కూర్పుతో ధోనిసేన బరిలోకి దిగుతోంది. అటు న్యూజిలాండ్ కూడా వన్డేలు ఆడి దాదాపు ఎనిమిది నెలలైంది. బ్రెండన్ మెకల్లమ్ రిటైర్మెంట్ తర్వాత ఆ జట్టు ఆడబోతున్న తొలి వన్డే ఇది. చాంపియన్స ట్రోఫీకి ముందు ఆ జట్టు కూడా ప్రయోగాలు చేయాల్సి ఉంది. అరుుతే భారత్‌తో మూడు టెస్టుల సిరీస్‌ను దారుణంగా కోల్పోరుున నేపథ్యంలో ఇప్పుడు మాత్రం పూర్తిస్థారుు జట్టుతోనే బరిలోకి దిగుతోంది. సీనియర్ ఆటగాళ్లంతా అందుబాటులో ఉండటంతో ఆ జట్టు బలంగా కనిపిస్తోంది. ధర్మశాల: భారత క్రికెట్ చరిత్రలో మరో మైలురారుు. ఇటీవల న్యూజిలాండ్‌తో సిరీస్ ద్వారా 500వ టెస్టు, స్వదేశంలో 250వ టెస్టు మ్యాచ్ ల్యాండ్ మార్క్‌లను చేరుకున్న భారత్... ఈసారి న్యూజిలాండ్‌తో తొలి వన్డే ద్వారా తమ చరిత్రలో 900వ వన్డే మ్యాచ్ ఆడబోతోంది. కాబట్టి విజయంతో దీనిని చిరస్మరణీయం చేసుకోవాలని భారత్ జట్టు ఆశించడం సహజం. మరోవైపు న్యూజిలాండ్ టెస్టుల్లో ఘోరంగా విఫలమైనా... వన్డేల్లో ఆ జట్టు చాలా ప్రమాదకరం. ఈ నేపథ్యంలో నేడు (ఆదివారం) జరిగే తొలి వన్డే హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఓ వైపు హిమాలయాల ఆహ్లాదం, మరోవైపు పరుగుల వినోదంతో మరోసారి ధర్మశాల సందడిగా మారనుంది. ధోనిపైనే దృష్టి భారత వన్డే కెప్టెన్ ధోని ఓ మంచి ఇన్నింగ్స ఆడి చాలా కాలమైంది. కోహ్లిని అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయాలనే డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో మరోసారి తనని తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌లో ధోని బ్యాటింగ్ ఆర్డర్లో కాస్త ముందుకు వచ్చి ఐదో స్థానంలో ఆడే అవకాశం ఉంది. గాయాలు, విశ్రాంతి కారణంగా పలువురు సీనియర్ క్రికెటర్లు అందుబాటులో లేనందున ఈసారి జట్టు కూర్పు కూడా కాస్త భిన్నంగా ఉండబోతోంది. రోహిత్, రహానే కలిసి ఓపెనింగ్ చేస్తారు. కోహ్లి, మనీశ్ పాండే తర్వాతి రెండు స్థానాల్లో ఆడతారు. రైనా అందుబాటులో లేనందున తొలి వన్డేలో కేదార్ జాదవ్ తుది జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఆల్‌రౌండర్ స్లాట్‌లో హార్దిక్ పాండ్యాకు అవకాశం లభించవచ్చు. ఆఫ్ స్పిన్నర్ జయంత్ యాదవ్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నా... అక్షర్ పటేల్, అమిత్ మిశ్రాలలో ఒకరిని ఆపడం కష్టం. ఇక పేస్ విభాగంలో బుమ్రాతో పాటు ధావల్ కులకర్ణి, ఉమేశ్ యాదవ్‌లలో ఒకరు తుది జట్టులో ఉంటారు. పిచ్ స్వభావం దృష్టిలో పెట్టుకొని ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లను ఆడించాలని భావిస్తే పాండ్యా లేదా మిశ్రాలలో ఒకరు బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. కోహ్లి, రహానే, రోహిత్‌ల ఫామ్‌తో భారత బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కనిపిస్తోంది. ఆ ఇద్దరూ ఏం చేస్తారో..? మార్టిన్ గప్టిల్, రాస్ టేలర్... న్యూజిలాండ్ క్రికెట్లో చాలా సీనియర్ ఆటగాళ్లు. టెస్టు సిరీస్‌లో ఈ ఇద్దరూ విఫలమయ్యారు. అరుుతే వన్డేల్లో ఇద్దరికీ మంచి రికార్డు ఉంది. ఈ ఇద్దరూ కుదురుకోవడంపై ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ ఫలితాలు ఆధారపడి ఉంటారుు. కెప్టెన్ విలియమ్సన్, లాథమ్ ఫామ్‌లో ఉన్నారు. ఆల్‌రౌండర్లు నీషమ్, సాన్‌ట్నర్ ఇద్దరూ వైవిధ్యంగా ఆడే ఆటగాళ్లు. సౌతీ తిరిగి రావడంతో పేస్ విభాగం కూడా పటిష్టంగా కనిపిస్తోంది. బౌల్ట్, హెన్రీలలో ఒక్కరు తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. కోరీ అండర్సన్ జట్టులోకి తిరిగి వచ్చినా గాయం కారణంగా తను కేవలం బ్యాటింగ్‌కే పరిమితం కానున్నాడు. టి20 ప్రపంచకప్‌లో ముగ్గురు స్పిన్నర్లతో భారత్‌ను ఓడించిన న్యూజిలాండ్... తొలి వన్డేలో పిచ్ స్వభావం దృష్టా ్య ఇద్దరు స్పిన్నర్లకు పరిమితం కానుంది. ఏమైనా... న్యూజిలాండ్ జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. జట్లు(అంచనా) భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, రహానే, కోహ్లి, మనీశ్ పాండే, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, బుమ్రా, ధావల్/ఉమేశ్. న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), గప్టిల్, లాథమ్, టేలర్, అండర్సన్, రోంచీ, నీషమ్, సాన్‌ట్నర్, సౌతీ, బౌల్ట్/హెన్రీ, సోధి. పిచ్, వాతావరణం ప్రస్తుతం ధర్మశాలలో పగలు చాలా వేడిగా, సాయంత్రం విపరీతమైన చలి ఉంటోంది. ఆదివారం కూడా ఇదే తరహా వాతావరణం ఉండొచ్చు. సాయంత్రం పూట మంచు కురుస్తుంది కాబట్టి... టాస్ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్ చేసే అవకాశం ఉంది. ఇక పిచ్ మీద పచ్చికను దాదాపుగా తీసేసినా... పిచ్ మీద బౌన్స బాగా ఉండే అవకాశం ఉంది. పేస్ బౌలర్లు కీలకం కావచ్చు. ‘జట్టులో కెప్టెన్ అరుునా వైస్ కెప్టెన్ అరుునా యువ క్రికెటర్లకు మార్గదర్శనం చేయడం ముఖ్యం. ఐదు, ఆరు స్థానాల్లో మంచి ఫినిషర్ ఎప్పుడూ జట్టులో ఉండాలి. దీనిపై మాకు భవిష్యత్ కోసం ప్రణాళికలు ఉన్నారుు. సీజన్లో చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కాబట్టి సీనియర్ క్రికెటర్లకు విశ్రాంతి అవసరం. దీనివల్ల కొత్త ఆటగాళ్లను పరీక్షించడానికి కూడా అవకాశం ఉంటుంది. అరుుతే విజయాలు కూడా ముఖ్యమే. అందుకే రొటేషన్ పద్ధతిలో విశ్రాంతి ఇవ్వడం మేలు. టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి సలహాలను ఇప్పటికే వన్డేలలోనూ తీసుకుంటున్నాను.’ - ధోని ►భారత్‌లో న్యూజిలాండ్ ద్వైపాక్షిక సిరీస్‌ను ఎప్పుడూ గెలవలేదు. ►భారత్, న్యూజిలాండ్‌ల మధ్య ఇప్పటివరకూ 93 వన్డేలు జరగగా... భారత్ 46, న్యూజిలాండ్ 41 గెలిచారుు. ఐదు మ్యాచ్‌లు రద్దు కాగా, ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ►వన్డే చరిత్రలో భారత్ ఇప్పటివరకూ 899 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 454 గెలిచి, 399 ఓడిపోరుుంది. 7 మ్యాచ్‌లు టై కాగా... 39 మ్యాచ్‌లలో ఫలితం రాలేదు. మ. గం. 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స-1లో ప్రత్యక్ష ప్రసారం -
సాక్ష్యాల సేకరణ ఇంత నిర్లక్ష్యంగానా?
* ఐసీసీ ఏసీయూపై మెకల్లమ్ ధ్వజం * ఎంసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్లో ఉపన్యాసం లండన్: మ్యాచ్ ఫిక్సింగ్ విచారణలో భాగంగా సేకరించే సాక్ష్యాలపై ఐసీసీ ఏమాత్రం భద్రత, ప్రొఫెషనలిజం లేకుండా వ్యవహరిస్తోందని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ ధ్వజమెత్తారు. సోమవారం ‘ఎంసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్’ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2008లో మ్యాచ్‌ను ఫిక్స్ చేసేందుకు కివీస్ మాజీ కెప్టెన్ క్రిస్ కెయిర్న్స్ పలుమార్లు తనను సంప్రదించారని ఐసీసీ అవినీతి వ్యతిరేక యూనిట్ (ఏసీయూ)కు మెకల్లమ్ సాక్ష్యమిచ్చారు. అయితే మెకల్లమ్ చెప్పిన విషయాలు విచారణ జరుగుతుండగానే 2014లో డెయిలీ మెయిల్ పత్రికలో దర్శనమిచ్చాయి. ‘నేను ఆరోజు ఐసీసీ ఏసీయూకు చెప్పిన విషయాలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. అయితే ఐసీసీ అధికారులు మాత్రం సాక్ష్యాల సేకరణలో ఏమాత్రం జాగ్రత్త లేకుండా యథాలాపంగా వ్యవహరించారు. పూర్తిగా ప్రొఫెషనలిజం కొరవడింది. నా మాటలన్నీ మీడియాలో రావడం నన్ను షాక్‌కు గురి చేసింది. ఇప్పటికీ అది ఎలా లీక్ అయ్యిందో ఐసీసీ నాకు చెప్పలేదు. ఎవర్నీ నమ్మలేకుండా ఉన్నాం. ఇలా అయితే మున్ముందు ఏ ఆటగాడు ధైర్యంగా మీకు సాక్ష్యమిస్తాడు? క్రికెట్ అత్యున్నత బాడీపైనే ఆటగాళ్లకు విశ్వాసం సన్నగిల్లితే పరిస్థితేమిటి? నిజంగానే మీకు ఫిక్సింగ్ జాడ్యాన్ని తరిమికొట్టాలనుకుంటే బలమైన నిర్మాణం గల బాడీ అవసరం’ అని మెకల్లమ్ తేల్చి చెప్పారు. ఆటగాళ్ల నమ్మకాన్ని చూరగొంటాం: ఐసీసీ న్యూఢిల్లీ: ఫిక్సింగ్‌కు వ్యతిరేకంగా మెకల్లమ్ చొరవ అభినందనీయమని ఐసీసీ కొనియాడింది. అలాగే భవిష్యత్‌లో సాక్ష్యాల సేకరణలో ఆటగాళ్ల నమ్మకాన్ని చూరగొంటామని పేర్కొంది. అయితే మెకల్లమ్ సాక్ష్యాలను లీక్ చేసింది ఐసీసీలోని అధికారులు కాదని, బయటివారైనా కనుగొనడం కష్టసాధ్యమేనని అంగీకరించింది. మున్ముందు ఏసీయూను మరింత పకడ్బందీగా తయారుచేస్తామని తెలిపింది. -
టి20ల్లో ఉత్తమ ఇన్నింగ్స్ రోహిత్‌దే...
ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో అవార్డులు న్యూఢిల్లీ: భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ వరుసగా మూడోసారి ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో అవార్డును సాధించాడు. 2013, 2014ల్లో వన్డేల్లో చేసిన డ బుల్ శతకాలు ఆ ఫార్మాట్లో ఉత్తమ ఇన్నింగ్స్‌గా నిలిచాయి. ఈసారి దక్షిణాఫ్రికాతో జరిగిన టి20లో తను సెంచరీ (106) చేయడంతో పొట్టి ఫార్మాట్లో ఉత్తమ ఇన్నింగ్స్ అవార్డును దక్కించుకున్నాడు. ఇయాన్ చాపెల్, వాల్ష్, జాన్ రైట్, జయవర్ధనే, అగార్కర్, మంజ్రేకర్, రస్సెల్ ఆర్నాల్డ్, మార్క్ నికోలస్‌లతో కూడిన ప్యానెల్ క్రిక్ఇన్ఫో అవార్డులను ప్రకటించింది. న్యూజిలాండ్‌ను ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్‌కు చేర్చిన మాజీ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్‌కు ‘కెప్టెన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు దక్కింది. ఈ విభాగంలో అవార్డును ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. అలాగే ‘ఉత్తమ టెస్టు బౌలింగ్’ స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్), ‘ఉత్తమ టెస్టు ఇన్నింగ్స్’ కేన్ విలియమ్సన్ (కివీస్), ‘ఉత్తమ వన్డే ఇన్నింగ్స్’ డి విలియర్స్ (దక్షిణాఫ్రికా), ‘ఉత్తమ వన్డే బౌలింగ్’ టిమ్ సౌతీ (కివీస్), ‘ఉత్తమ టి20 బౌలింగ్’ డేవిడ్ వీస్ (దక్షిణాఫ్రికా), ‘ఉత్తమ అరంగేట్రం’ ముస్తాఫిజుర్ రహమాన్ (బంగ్లాదేశ్)లకు దక్కాయి. -
కుప్పకూలిన కివీస్
తొలి ఇన్నింగ్స్‌లో 183 ఆలౌట్ మెకల్లమ్ డకౌట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 147/3 కుప్పకూలిన కివీస్ వెల్లింగ్టన్: న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో బౌలర్లు చెలరేగడంతో ఆస్ట్రేలియా మొదటి రోజే పూర్తి ఆధిక్యం ప్రదర్శించింది. పేసర్లు హాజెల్‌వుడ్ (4/42), సిడిల్ (3/37)తో పాటు స్పిన్నర్ లియోన్ (3/32) కలిసి కివీస్ వెన్ను విరిచారు. దీంతో శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్టులో న్యూజిలాండ్ 48 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కెరీర్లో వందో టెస్టు ఆడుతున్న బ్రెండన్ మెకల్లమ్ పరుగులేమీ చేయకుండానే నిష్ర్కమించాడు. కోరె అండర్సన్ (87 బంతుల్లో 38; 6 ఫోర్లు), మార్క్ క్రెయిగ్ (57 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు), బౌల్ట్ (22 బంతుల్లో 24; 3 సిక్సర్లు) రాణించారు. ఓవరాల్‌గా 97 పరుగులకే జట్టు ఏడు వికెట్లు కోల్పోగా చివరి మూడు వికెట్లకు 86 పరుగులు రావడం విశేషం. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఆసీస్... రోజు ముగిసే సమయానికి 40 ఓవర్లలో మూడు వికెట్లకు 147 పరుగులు చేసింది. ఐదు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయినా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (112 బంతుల్లో 71; 10 ఫోర్లు; 1 సిక్స్), ఉస్మాన్ ఖవాజా (96 బంతుల్లో 57 బ్యాటింగ్; 11 ఫోర్లు) జోడి ఆదుకుంది. వీరిద్దరి మధ్య మూడో వికెట్‌కు 126 పరుగులు వచ్చాయి. క్రీజులో ఖవాజాతో పాటు వోజెస్ (7 బ్యాటింగ్) ఉన్నాడు. -
‘బ్రెండన్’ బాదుడుకు బ్రేక్!
►ఆఖరి సిరీస్ ఆడనున్న మెకల్లమ్ ►కెరీర్లో 100వ టెస్టుకు రెడీ ►వరుసగా వంద మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్ ‘క్రికెట్ చరిత్రలో గొప్ప ఆటగాళ్ల జాబితాలో నేను ఉండకపోవచ్చు. అయితే నా దేశం తరఫున ఎంతో కొంత సాధించిన, ఎందరికో స్ఫూర్తినిచ్చినవారిగా అందరికీ గుర్తుండిపోతాను. బ్యాటింగ్‌లో నా శైలితో నాదైన ముద్ర చూపించాననే నమ్ముతున్నా’...ఆఖరి సిరీస్‌కు ముందు తన గురించి బ్రెండన్ మెకల్లమ్ చెప్పుకున్న మాట ఇది. నిజమే... క్రికెట్‌పై ‘బాజ్’ సంతకం మరచిపోలేనిది. అతని సునామీ ఇన్నింగ్స్ ప్రత్యర్థుల గుండెల్లో కల్లోలం రేపాయి. వన్డేల్లో దూకుడు, టి20ల్లో విధ్వంసం కామన్ కావచ్చు... కానీ టెస్టుల్లోనూ ఆ బ్యాట్ పదునేంటో భారత జట్టుకే అందరికంటే బాగా తెలుసు. నాలుగు డబుల్ సెంచరీలు చేస్తే అందులో మూడు భారత్‌పైనే వచ్చాయి. దాదాపు రెండేళ్ల క్రితం ధోని సేన గెలవాల్సిన మ్యాచ్‌ను అద్భుతమైన ట్రిపుల్ సెంచరీతో (302) రక్షించుకున్న ఇన్నింగ్స్ అజరామరం. గత సోమవారం వన్డేలకు విజయంతో గుడ్‌బై చెప్పిన మెకల్లమ్ ఇప్పుడు ఆఖరిసారిగా టెస్టు సిరీస్ బరిలోకి దిగుతున్నాడు. ఆస్ట్రేలియాతో శుక్రవారంనుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్ అతని అంతర్జాతీయ కెరీర్లో ఆఖరిది. వెల్లింగ్టన్లో నేటినుంచి జరిగే తొలి టెస్టు మెకల్లమ్ కెరీర్లో 100వది కావడం విశేషం. అరంగేట్రం చేసిననాటినుంచి విరామం లేకుండా వరుసగా వంద టెస్టులు ఆడిన తొలి క్రికెటర్‌గా బ్రెండన్ మరో ఘనతను తన పేరిట లిఖిస్తున్నాడు. గ్రేట్ జెంటిల్మన్... విధ్వంసకర బ్యాట్స్‌మన్‌గా మెకల్లమ్‌కు కొత్తగా పరిచయం అవసరం లేదు. 155 కిలోమీటర్ల వేగంతో వచ్చిన బంతులను కూడా స్కూప్ షాట్ ఆడుతూ 50 బంతుల్లో చేసిన టి20 సెంచరీనుంచి... టెస్టుల్లో పాకిస్తాన్‌పై మెరుపు వేగంతో డబుల్ సెంచరీ చేయడం వరకు అతని దూకుడుకు ఉదాహరణలు ఎన్నో. ఇక వన్డేల్లో మెరుపు ఆరంభాలతో మ్యాచ్ దిశ మార్చిన ఇన్నింగ్స్‌కు లెక్కే లేదు. కానీ ఇదంతా ఆటలోనే. ప్రత్యర్థిని ఒక్క మాట అన్నదీ లేదు. ఆవేశంతో నోరు జారినదీ లేదు! అసలు సిసలైన జెంటిల్మన్లా వ్యవహరించిన అతను కెప్టెన్‌గా అదే తన జట్టుకు నేర్పాడు. మెకల్లమ్ సారథ్యంలో కొత్త బ్రాండింగ్‌తో కనిపించిన కివీస్ తమ దేశ చరిత్రలో గతంలో సాధ్యం కాని వరుస విజయాలు అందుకుంది. వన్డే వరల్డ్ కప్‌లో తొలిసారి ఫైనల్ చేరడమే కాకుండా సొంతగడ్డపై వరుసగా 13 టెస్టుల పాటు పరాజయమన్నదే లేకుండా కొనసాగుతోంది. ఐపీఎల్లో అతని బ్యాటింగ్ చూసే అవకాశాలు ఉన్నా...అంతర్జాతీయ క్రికెట్‌కు సంబంధించి మరో రెండు మ్యాచ్‌లే మెకలమ్ మెరుపులకు వేదికగా నిలవనున్నాయి. గత 15-20 టెస్టులు నా జీవితంలో గొప్పగా సాగాయి. ప్రతిభ గల కొంతమందితో కలిసి అద్భుతాలు చేయగలిగాం. నేను సాధించినదాని పట్ల గర్వంగా ఉన్నా. గాయాలను అధిగమించి వరుసగా 100 టెస్టులు ఆడటం నిజంగా మధురానుభూతి. భారత్‌పై చేసిన ట్రిపుల్ సెంచరీతోనే మా జట్టు పోరాటపటిమ ప్రపంచానికి తెలిసింది. కాబట్టి అదే నా అత్యుత్తమం. వెనక్కి తిరిగి చూసుకుంటే నేను పడిన కఠోర శ్రమ, ఆ తర్వాతి విజయాలు గుర్తుకొచ్చాయి. నా జీవితానికి ఈ జ్ఞాపకాలు చాలు’ -బ్రెండన్ మెకల్లమ్ -
విజయంతో వీడ్కోలు
వన్డే కెరీర్‌ను ముగించిన మెకల్లమ్ఆసీస్తో చివరి మ్యాచ్‌లో కివీస్ గెలుపు 2-1తో సిరీస్ కైవసం హామిల్టన్: న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ బ్రెండన్ మెకల్లమ్‌కు వన్డేల్లో ఘనమైన వీడ్కోలు లభించింది. సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో న్యూజిలాండ్ జట్టు 55 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను కివీస్ 2-1తో దక్కించుకుంది. ఎనిమిదేళ్ల అనంతరం ఆసీస్‌పై కివీస్ సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. మరోవైపు ఈ మ్యాచ్ మెకల్లమ్‌కు ఆఖరి అంతర్జాతీయ వన్డే కావడం విశేషం. 12 నుంచి వెల్లింగ్టన్లో జరగబోయే రెండు టెస్టుల అనంతరం తను అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకోనున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఎప్పటిలాగే తన సహజశైలిలోనే చెలరేగిన మెకల్లమ్ 27 బంతుల్లోనే 47 పరుగులు సాధించాడు. ఇందులో 6 ఫోర్లు; 3 సిక్సర్లున్నాయి. అలాగే వన్డేల్లో 200 సిక్సర్లు పూర్తి చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. తొలిస్థానంలో ఆఫ్రిది (351) ఉన్నాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్ అయ్యింది. గప్టిల్ (61 బంతుల్లో 59; 4 ఫోర్లు; 3 సిక్సర్లు), ఎలియట్ (62 బంతుల్లో 50; 1 ఫోర్; 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. మిషెల్ మార్ష్‌కు మూడు.. హాజెల్‌వుడ్, హేస్టింగ్స్, బోలండ్లకు రెండేసి వికెట్లు దక్కాయి. బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో ఆసీస్ 43.4 ఓవర్లలో 191 పరుగులకే కుప్పకూలింది. ఖవాజా (36 బంతుల్లో 44; 4 ఫోర్లు; 2 సిక్సర్లు), మార్ష్ (42 బంతుల్లో 41; 4 ఫోర్లు; 1 సిక్స్) మాత్రమే ఆడగలిగారు. హెన్రీకి మూడు.. అండర్సన్, సోధి రెండేసి వికెట్లు తీశారు. మెకల్లమ్ వన్డే కెరీర్ మ్యాచ్‌లు : 260 పరుగులు : 6,083 అర్ధసెంచరీలు : 32 సెంచరీలు : 5 క్యాచ్‌లు : 262 సగటు : 30.41