తొలి ఇన్నింగ్స్‌లో 183 ఆలౌట్ మెకల్లమ్ డకౌట్
తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 147/3
కుప్పకూలిన కివీస్
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో బౌలర్లు చెలరేగడంతో ఆస్ట్రేలియా మొదటి రోజే పూర్తి ఆధిక్యం ప్రదర్శించింది. పేసర్లు హాజెల్‌వుడ్ (4/42), సిడిల్ (3/37)తో పాటు స్పిన్నర్ లియోన్ (3/32) కలిసి కివీస్ వెన్ను విరిచారు. దీంతో శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్టులో న్యూజిలాండ్ 48 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కెరీర్‌లో వందో టెస్టు ఆడుతున్న బ్రెండన్ మెకల్లమ్ పరుగులేమీ చేయకుండానే నిష్ర్కమించాడు. కోరె అండర్సన్ (87 బంతుల్లో 38; 6 ఫోర్లు), మార్క్ క్రెయిగ్ (57 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు), బౌల్ట్ (22 బంతుల్లో 24; 3 సిక్సర్లు) రాణించారు. ఓవరాల్‌గా 97 పరుగులకే జట్టు ఏడు వికెట్లు కోల్పోగా చివరి మూడు వికెట్లకు 86 పరుగులు రావడం విశేషం.
అనంతరం తమ తొలి ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఆసీస్... రోజు ముగిసే సమయానికి 40 ఓవర్లలో మూడు వికెట్లకు 147 పరుగులు చేసింది. ఐదు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయినా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (112 బంతుల్లో 71; 10 ఫోర్లు; 1 సిక్స్), ఉస్మాన్ ఖవాజా (96 బంతుల్లో 57 బ్యాటింగ్; 11 ఫోర్లు) జోడి ఆదుకుంది. వీరిద్దరి మధ్య మూడో వికెట్‌కు 126 పరుగులు వచ్చాయి. క్రీజులో ఖవాజాతో పాటు వోజెస్ (7 బ్యాటింగ్) ఉన్నాడు.
కుప్పకూలిన కివీస్
Published Sat, Feb 13 2016 12:21 AM | Last Updated on Sun, Sep 3 2017 5:31 PM
Advertisement
Advertisement