ప్రతీకాత్మక చిత్రం
లక్నో : మందులేని మహమ్మారి కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి లాక్‌డౌన్ పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విజ‍్క్షప్తి చేస్తున్నా పలువురు మాత్రం యధేచ్చగా లాక్‌డౌన్ ఆంక్షలను ఉల్లంఘిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించి క్రికెట్ మ్యాచ్ నిర్వహించిన ఓ బీజేపీ నేతపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. యూపీలోని బారాబంకి జిల్లా ఎస్పీ అవరింద్ చతుర్వేదీ తెలిపిన వివరాల ప్రకారం. జిల్లాలో లాక్‌డౌన్ అమలవుతున్నప్పటికీ స్థానిక బీజేపీ నేత సుధీర్‌సింగ్ బుధవారం క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించారు. పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందటడంతో ఎస్పీ అదేశాల మేరకు అక్కడి చేరుకున్నారు. (‘వుహాన్’ డైరీలో నమ్మలేని నిజాలు)
ఆంక్షలను ఉల్లంఘించి మ్యాచ్ నిర్వహించినందుకు సుధీర్ సింగ్‌తో పాటు మరో 19మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా యూపీలోని మొత్తం జిల్లాల్లో బారాబంకితో పాటు మరో 11 జిల్లాల్లో కరోనా ఫ్రీ జిల్లాలుగా గుర్తించారు. అయినప్పటికీ వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు అధికారలు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగానే లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment