
వేదం..విజయవిహారం
భారత్–వెస్టిండీస్ మహిళా జట్ల మధ్య మూలపాడులో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళా జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. మొదటి రెండు వన్డేల్లో బారత జట్టు మంచి విజయం సాధించింది. బుధవారం జరిగిన చివరి వన్డేలో చక్కటి బౌలింగ్, ఫీల్డింగ్‌తో విండీస్ జట్టును కట్టడిచేసి 15 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. నిలకడైన బ్యాట్స్ ఉమెన్ వేద కృష్ణమూర్తి బ్యాటింగ్‌కు ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. చివరి వన్డే అనంతరం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కోశాధికారి ఎంఏ రహీం, సెంట్రల్ జోన్ కార్యదర్శి కోకా రమేష్ భారత స్కిపర్‌కు ట్రోఫీ అందజేశారు. వరుసగా మూడు వన్డేల్లో ఓటమి చెందినా విండీస్ స్కిప్పర్ సిఫాన్ టేలర్ మూలపాడు గ్రౌండ్‌కు మొదటి ర్యాంకే ఇచ్చింది. ఇక్కడి ప్రేక్షకులు కూడా భారత జట్టుకు సమానంగా ఆ«దరించారని సంతోషం వ్యక్తం చేసింది. ఈనెల 18న టీ20 తొలిమ్యాచ్ ఈ స్టేడియంలోనే జరగనుంది. మ్యాచ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది.
- విజయవాడ స్పోర్ట్స్