విజయం విండీస్‌దే..
సొంతగ్రౌండ్‌లో తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిన స్థానిక క్రికెటర్ సబ్బినేని మేఘన ప్రేక్షకులను నిరాశపరిచింది. మూలపాడులో వెస్టిండీస్ మహిళ జట్టుతో ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో తనదైన శైలిలో దూకుడుగా ఆడి 17 పరుగులకే విండీస్ బౌలిర్ మ్యాథ్యూస్ చేతిలో ఎల్బీగా చిక్కి పెవిలిన్ పట్టింది. మంధన, మేఘన ఇద్దరూ ఓపెనింగ్‌కు దిగగా, విండీస్ బౌలర్ల ధాటికి తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. విండీస్ జట్టు మూడింటిలో వరుసగా రెండు టీ20 మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం కావడంతో ప్రేక్షకులు భారీగా వచ్చారు. మేఘన ఆట కోసం స్కూల్ బ్యాండ్‌తో సహా పెద్ద సంఖ్యలో విద్యార్థులు మ్యాచ్‌ను తిలకించేందుకు వచ్చారు. ప్లకార్డులు పట్టుకుని జేజేలు పలికారు. విండీస్ స్కిప్పర్ స్టెఫాన్ టేలర్ రెండో మ్యాచ్‌లో కూడా రాణించి జట్టును విజయంపథం వైపు మళ్లించింది. మొదటి నుంచీ నిలకడగా రాణిస్తూ స్థానిక ప్రేక్షకుల మనసు దోచుకున్న వేద కృష్ణమూర్తి ఐదు పరుగులకే పెవిలియన్ పట్టడంతో మ్యాచ్‌పై ఆశలు ఆవిరయ్యాయి. భారత జట్టులో స్కిపర్ హర్మన్ ప్రీత్‌కౌర్ కాస్త రాణించినా మిగిలిన వారంతా కూలబడటంతో స్వల్ప లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. మంగళవారం చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. - విజయవాడ స్పోర్ట్స్