
భారత్‌లో క్రికెట్‌కు ఎంత ఆదరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆదివారం వచ్చిందంటే చాలు ఏ గల్లీ చూసినా చిన్నపిల్లాడి నుంచి పెద్దవాళ్ల దాకా బ్యాట్ పట్టుడు.. బంతి కొట్టుడు అన్న తరహాలో ఉంటారు. ఇక చిన్న ఖాళీ ప్రదేశం కనబడితే చాలు ఆరోజుకు అది మాదే అనేలా జెండా పాతేస్తారు. ఇక అది ఏ గ్రౌండ్ అయినా కానీయండి క్రికెట్ మా కింకర్తవ్యం అన్నట్లుగా ఆడేస్తుంటారు. మరి ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో క్రికెట్ ఆడితే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూడండి.
విషయంలోకి వెళితే.. ఎక్కడో తెలియదు కానీ కొంతమంది గ్రూప్ కలిసి ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో క్రికెట్ ఆడారు. బౌలర్ వేసిన బంతిని షాట్ ఆడి పరుగు తీసే ప్రయత్నం చేశాడు. అయితే బంతిని మాత్రమే గమనించిన బ్యాటర్ ఎదురుగా ఉన్న గోల్‌పోస్ట్‌ను గమనించలేదు. ఇంకేముంది నేరుగా వెళ్లి గోల్‌పోస్ట్‌కు గుద్దుకున్నాడు. పాపం దెబ్బ గట్టిగా తగలడంతో అక్కడే పడిపోయాడు.
తోటివాళ్లు వచ్చి అతన్ని పక్కకు తీసుకెళ్లారు. అయితే దెబ్బ తాకిన వ్యక్తి నొప్పితో విలవిల్లాలాడుతుంటే మిగతావాళ్లు నవ్వుకోవడం కనిపించింది. ఎంతైనా ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో క్రికెట్ ఆడడమే తప్పు.. పైగా గోల్‌పోస్ట్ పక్కనుంచి వికెట్ పెట్టడం ఇంకా పెద్ద తప్పు. ఏదైనా ఈ వీడియో చూస్తే మాత్రం నవ్వు రాకుండా మాత్రం ఉండదు. వీలైతే ఒక లుక్కేయండి.
— Out Of Context Cricket (@GemsOfCricket) June 24, 2023
చదవండి: డేంజర్ జోన్‌లో విండీస్.. వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అవుతుందా?
Comments
Please login to add a commentAdd a comment