Goal post
-
'అయ్యో శివుడా ఏమాయే'.. ఫుట్‌బాల్ గ్రౌండ్లో క్రికెట్ ఆడితే!
భారత్‌లో క్రికెట్‌కు ఎంత ఆదరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆదివారం వచ్చిందంటే చాలు ఏ గల్లీ చూసినా చిన్నపిల్లాడి నుంచి పెద్దవాళ్ల దాకా బ్యాట్ పట్టుడు.. బంతి కొట్టుడు అన్న తరహాలో ఉంటారు. ఇక చిన్న ఖాళీ ప్రదేశం కనబడితే చాలు ఆరోజుకు అది మాదే అనేలా జెండా పాతేస్తారు. ఇక అది ఏ గ్రౌండ్ అయినా కానీయండి క్రికెట్ మా కింకర్తవ్యం అన్నట్లుగా ఆడేస్తుంటారు. మరి ఫుట్‌బాల్ గ్రౌండ్లో క్రికెట్ ఆడితే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూడండి. విషయంలోకి వెళితే.. ఎక్కడో తెలియదు కానీ కొంతమంది గ్రూప్ కలిసి ఫుట్‌బాల్ గ్రౌండ్లో క్రికెట్ ఆడారు. బౌలర్ వేసిన బంతిని షాట్ ఆడి పరుగు తీసే ప్రయత్నం చేశాడు. అయితే బంతిని మాత్రమే గమనించిన బ్యాటర్ ఎదురుగా ఉన్న గోల్‌పోస్ట్‌ను గమనించలేదు. ఇంకేముంది నేరుగా వెళ్లి గోల్‌పోస్ట్‌కు గుద్దుకున్నాడు. పాపం దెబ్బ గట్టిగా తగలడంతో అక్కడే పడిపోయాడు. తోటివాళ్లు వచ్చి అతన్ని పక్కకు తీసుకెళ్లారు. అయితే దెబ్బ తాకిన వ్యక్తి నొప్పితో విలవిల్లాలాడుతుంటే మిగతావాళ్లు నవ్వుకోవడం కనిపించింది. ఎంతైనా ఫుట్‌బాల్ గ్రౌండ్లో క్రికెట్ ఆడడమే తప్పు.. పైగా గోల్‌పోస్ట్ పక్కనుంచి వికెట్ పెట్టడం ఇంకా పెద్ద తప్పు. ఏదైనా ఈ వీడియో చూస్తే మాత్రం నవ్వు రాకుండా మాత్రం ఉండదు. వీలైతే ఒక లుక్కేయండి. pic.twitter.com/x6nZCTyulh — Out Of Context Cricket (@GemsOfCricket) June 24, 2023 చదవండి: డేంజర్ జోన్లో విండీస్.. వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అవుతుందా? అధికారుల కన్నెర్ర.. నెయ్మర్కు దెబ్బ మీద దెబ్బ -
పోర్చుగల్ తడబాటు
ఆస్ట్రియాతో మ్యాచ్ కూడా ‘డ్రా’ పెనాల్టీ కిక్‌ను వృథా చేసిన రొనాల్డో యూరో కప్ పారిస్: వచ్చిన ఒకటి, రెండు అవకాశాలనూ ఒడిసి పట్టుకోలేకపోయిన పోర్చుగల్... యూరోపియన్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో వరుసగా రెండో ‘డ్రా’తో సరిపెట్టుకుంది. ఐస్లాండ్లాంటి పసికూన జట్టుతో తొలి మ్యాచ్‌ను 1-1తో ‘డ్రా’ చేసుకున్న పోర్చుగల్... రెండో మ్యాచ్‌లోనూ విజయం రుచి చూడలేకపోయింది. ఆరంభం నుంచే ఎదురుదాడులకు దిగినా... అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయింది. దీంతో గ్రూప్ ‘ఎఫ్’లో శనివారం ఆస్ట్రియాతో జరిగిన లీగ్ మ్యాచ్‌ను పోర్చుగల్ 0-0తో ‘డ్రా’ చేసుకుంది. రెండో అర్ధభాగంలో వచ్చిన ఓ అద్భుత అవకాశాన్ని స్టార్ స్ట్రయికర్, కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో చేజేతులా జారవిడవడంతో పోర్చుగల్ గెలుపు బోణీ చేయలేకపోయింది. దీంతో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగి పోర్చుగల్... ప్రస్తుతం నాకౌట్ అవకాశాలను కాస్త క్లిష్టం చేసుకుంది. 79వ నిమిషంలో పెనాల్టీ ఏరియాలో మార్టిన్ హింటెర్జర్.. రొనాల్డోను మొరటుగా అడ్డుకోవడంతో పోర్చుగల్‌కు ‘పెనాల్టీ కిక్’ను ఇచ్చారు. అయితే 12 గజాల దూరం నుంచి రొనాల్డో కొట్టిన బంతి ఎడమవైపు గోల్‌పోస్ట్‌ను తాకి బయటకు వెళ్లిపోయింది. ఈ సమయంలో ఆస్ట్రియా గోల్ కీపర్ రొబెర్ట్ అల్మెరో కుడి వైపునకు డైవ్ చేయడం గమనార్హం. కెరీర్ మొత్తంలో రొనాల్డో కొట్టిన 110 పెనాల్టీల్లో కేవలం 19 మాత్రమే వృథా కావడం విశేషం. ఈ ఏడాది మాత్రం ఇదే మొదటిది. నిమిషం తర్వాత మరో అవకాశం వచ్చినా... రొనాల్డో కొట్టిన బంతి ఆఫ్‌సైడ్‌గా వెళ్లింది. ఇక తొలి అర్ధభాగంలో ఇరుజట్లు గోల్స్ కోసం హోరాహోరీగా పోటీపడ్డాయి. నాని, రొనాల్డో కలిసి ఆస్ట్రియా డిఫెన్స్‌ను ఛేదించే ప్రయత్నం చేసినా పెద్దగా సఫలం కాలేకపోయారు. కొత్త రికార్డు...: ఈ మ్యాచ్ ద్వారా రొనాల్డో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. పోర్చుగల్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా (128) రికార్డు సృష్టించాడు. గతంలో లూయిస్ ఫిగో (127) పేరిట ఉన్న రికార్డు ఈ సందర్భంగా బద్దలైంది. అలాగే ఈ మ్యాచ్‌లో ఒక్క గోల్ చేసినా... నాలుగు యూరో కప్ ఫైనల్స్ టోర్నీలో గోల్స్ చేసిన తొలి ఆటగాడిగా అరుదైన రికార్డు సొంతమయ్యేది. ‘యూరో’లో నేడు గ్రూప్ ‘బి’ చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌లు రష్యా ్ఠ వేల్స్ రాత్రి గం. 12.30 నుంచి సోనీ ఈఎస్‌పీఎన్‌లో ప్రత్యక్ష ప్రసారం ఇంగ్లండ్ ్ఠ స్లొవేకియా రాత్రి గం. 12.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
సూపర్ ‘సబ్స్’
► వేల్స్‌పై ఇంగ్లండ్ గెలుపు ► యూరో కప్ లెన్స్ (ఫ్రాన్స్): తొలి మ్యాచ్ డ్రాతో నాకౌట్ అవకాశాలను కాస్త క్లిష్టం చేసుకున్న ఇంగ్లండ్ కీలక మ్యాచ్‌లో మాత్రం చెలరేగిపోయింది. వేల్స్తోనూ కష్టమే అనుకుంటున్న సమయంలో సబ్‌స్టిట్యూట్స్‌గా వచ్చిన ఇద్దరు ఆటగాళ్లు వార్డీ, స్టూరిడ్జ్ అద్భుతమైన గోల్స్‌తో ఇంగ్లండ్‌ను గట్టెక్కించారు. యూరో కప్‌లో భాగంగా గురువారం జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో ఇంగ్లండ్ 2-1తో వేల్స్‌పై నెగ్గింది. ఇంగ్లండ్ తరఫున జెమీ వార్డీ (56వ ని.), స్టూరిడ్జ్ (90+2) గోల్స్ చేయగా, గ్యారెత్ బేల్ (42వ ని.) వేల్స్‌కు ఏకైక గోల్ అందించాడు. ఇప్పటి వరకు ఇరుజట్ల మధ్య 102 మ్యాచ్‌లు జరిగినా... పెద్ద టోర్నీలో ఆడటం మాత్రం ఇదే తొలిసారి. ఆరంభంలో ఇంగ్లిష్ ఆటగాళ్లు కాస్త తడబడినా... కీలక సమయంలో మాత్రం సమష్టిగా చెలరేగారు. 42వ నిమిషంలో 25 అడుగుల దూరం నుంచి గ్యారెత్ బేల్ కొట్టిన ఫ్రీకిక్ గాల్లో గింగరాలు తిరుగుతూ ఇంగ్లండ్ గోల్ కీపర్ చేతులను తాకుతూ నెట్లోకి వెళ్లడంతో వేల్స్ ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ పరిణామం నుంచి తొందరగానే తేరుకున్న ఇంగ్లండ్ 14 నిమిషాల్లోనే స్కోరు సమం చేసింది. లెఫ్ట్ ఫ్లాంక్ నుంచి స్టూరిడ్జ్ ఇచ్చిన క్రాస్ పాస్‌ను గోల్ పోస్ట్ ముందర మరో ఆటగాడు హెడ్‌తో టచ్ చేయగా... అక్కడే ఉన్న వార్డీ బంతిని నేర్పుగా డబుల్ బౌండ్ చేస్తూ నెట్లోకి పంపాడు. దీంతో స్కోరు 1-1తో సమమైంది. ఇక తర్వాతి సమయం మొత్తం ఇరుజట్లు గోల్స్ కోసం తీవ్రంగా శ్రమించినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. అయితే ఇంజ్యూరీ టైమ్‌లో స్టూరిడ్జ్... సూపర్ గోల్‌తో ఇంగ్లండ్ సంబపడింది. నార్తర్న్ ఐర్లాండ్ విజయం లియోన్: గ్రూప్-సిలో జరిగిన మ్యాచ్‌లో నార్తర్న్ ఐర్లాండ్ 2-0 తేడాతో ఉక్రెయిన్‌పై గెలిచింది. డిఫెండర్ మెక్ఆలే (49వ ని.), మెక్గిన్ (90+6) రెండు గోల్స్ చేశారు. యూరోలో ఈ జట్టుకు ఇదే తొలి విజయం. -
భారత్-పాకిస్థాన్ సిరీస్ సమం
* రెండో మ్యాచ్‌లో పాక్ విజయం * ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ బెంగళూరు: భారత్, పాకిస్థాన్ మధ్య ఫుట్‌బాల్ ఫ్రెండ్లీ సిరీస్ 1-1తో సమంగా ముగిసింది. బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్ 2-0 గోల్స్ తేడాతో భారత్‌ను ఓడించింది. పాక్ జట్టు తరఫున 39వ నిమిషంలో కెప్టెన్ కలీముల్లా, 90వ నిమిషంలో సద్దాం హుస్సేన్ గోల్స్ చేశారు. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ నెగ్గిన సంగతి తెలిసిందే. వచ్చే నెలలో ఇంచియాన్‌లో జరిగే ఆసియా క్రీడలకు సన్నాహకంగా ఇరు జట్ల మధ్య ఈ సిరీస్‌ను నిర్వహించారు. అవకాశాలు వృథా... ఈ మ్యాచ్ కోసం భారత జట్టు నాలుగు మార్పులు చేసింది. ఆట ఆరంభమైన తొలి 14 నిమిషాల్లో ఇరు జట్ల కెప్టెన్లకు గోల్ చేసే అవకాశం దక్కింది. భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి కొట్టిన కిక్‌ను పాక్ గోల్ కీపర్ అడ్డుకోగా... కలీముల్లా కొట్టిన షాట్ పోస్ట్ పైనుంచి వెళ్లిపోయింది. కొద్ది సేపటి వరకు భారత ఆటగాళ్లు ప్రయత్నించిన లాంగ్ పాస్‌లు ఒక్కసారి కూడా ప్రత్యర్థి గోల్ పోస్ట్ సమీపానికి కూడా వెళ్లలేకపోయాయి. అయితే ఆ తర్వాత 37వ నిమిషంలో హోవోకిప్ కొట్టిన షాట్, 47వ నిమిషంలో, 71వ నిమిషంలో ఛెత్రి, 87వ నిమిషంలో లౌరెన్సో గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా ప్రత్యర్థి ఆటగాళ్లు సమర్థంగా అడ్డుకోగలిగారు. దాంతో చివరికంటా పాక్ ఆధిక్యం నిలబెట్టుకోగలిగింది. ఆట ఆఖరి నిమిషంలోనూ తమకు దక్కిన అవకాశాన్ని ఉపయోగించుకున్న సద్దాం మరో గోల్‌తో పాక్ విజయాన్ని ఖాయం చేశాడు. -
‘గోల్’ కనిపిస్తుంది...
బంతి ఆకారాన్ని ఊహించుకోవడం తప్ప.. ఎలా ఉంటుందో తెలియదు. మైదానాన్ని చూడలేరు.. గోల్ పోస్ట్‌లు ఎక్కడున్నాయో గుర్తించలేరు. కానీ, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడుతున్నారు. అంధులే అయినా.. బంతి గమనాన్ని పసిగడుతున్నారు. అద్భుత రీతిలో గోల్స్ నమోదు చేస్తున్నారు. ప్రపంచాన్ని ఉర్రూతలూగించే ఫుట్బాల్నూ అలవోకగా ఆడేస్తూ.. తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. వారి కోసమే ప్రత్యేకంగా రూపొందిన ఫార్మాట్లో ప్రపంచ చాంపియన్‌షిప్, పారాఒలింపిక్స్ స్థాయిలో అదరగొడుతున్నారు అంధ ఫుట్‌బాల్ వీరులు. బ్లైండ్ ఫుట్‌బాల్‌కు దాదాపుగా 35 ఏళ్ల చరిత్ర ఉంది. 1980లో దక్షిణ అమెరికాలోని బ్రెజిల్లో చూపులేనివాళ్లు ఈ తరహా ఫుట్‌బాల్ ఆడేవారు. అయితే బ్లైండ్ ఫుట్‌బాల్ 5-ఎ-సైడ్ ఫుట్‌బాల్‌గా స్పెయిన్‌లో మెరుగులు దిద్దుకుంది. 1986లో స్పానిష్ జాతీయ 5-ఎ-సైడ్ ఫుట్‌బాల్ టోర్నీని నిర్వహించారు. 1998 నుంచి ప్రపంచ చాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తున్నారు. రెండేళ్లకోసారి నిర్వహించే ఈ మెగా టోర్నీలో బ్రెజిల్ మూడుసార్లు విజేతగా నిలిచింది. ప్రస్తుతం ఈ బ్లైండ్ ఫుట్‌బాల్ పారా ఒలింపిక్స్‌లో క్రీడాంశంగా ఉంది. 2004లో ఇది పారా ఒలింపిక్స్‌లో భాగమైంది. బ్లైండ్ సాకర్‌లో మెగా టోర్నీగా భావించే పారా ఒలింపిక్స్‌లో ఇప్పటిదాకా మూడుసార్లు బ్రెజిలే చాంపియన్‌గా నిలిచింది. ఈ ఫుట్‌బాల్‌లో యూరోప్, అమెరికా ఖండాలకు చెందిన జట్లు తరుచుగా తలపడతాయి. ఆసియా దేశాలకు చెందిన కొన్ని జట్లు కూడా తమ సత్తా చాటుతున్నాయి. సాకర్ ఆడేదిలా.. చూపులేని వాళ్లు ఫుట్‌బాల్ ఆడటమంటే మాటలు కాదు.. అందుకే ఫిఫా నిబంధనల్ని సవరించి, ఆట స్వరూపాన్ని మార్చేసి 5-ఎ-సైడ్ బ్లైండ్ ఫుట్‌బాల్‌గా నామకరణం చేశారు. ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్(ఐబీఎస్ఎఫ్) ఆధ్వర్యంలో 5-ఎ-సైడ్ బ్లైండ్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక మ్యాచ్‌లో బరిలోకి దిగే ప్రతీ జట్టులో ఐదుగురు ఆటగాళ్లు ఉంటారు. గోల్‌కీపర్ కూడా వీరిలో ఒకడు. మ్యాచ్‌ల్లో చూపున్న గోల్కీపర్ను బరిలోకి దించవచ్చు. ఇక వీళ్లు ఎలా ముందుకు వెళ్లాలో చెప్పేందుకు ఓ గైడ్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే అతను మైదానం బయట ఉండేందుకు మాత్రమే అనుమతిస్తారు. ఈ ఫుట్‌బాల్‌లో బంతి పరిమాణాన్ని తగ్గించి.. అది ఎటువెళుతోందో ఆటగాళ్లకు వినపడేందుకు కొన్ని చప్పుడు గుళికలను బంతిలో ఉంచుతారు. ఇక ఆట 50 నిమిషాల పాటు కొనసాగుతుంది.