
కాజీపేటలో కిషన్‌రెడ్డికి ఘనస్వాగతం
పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం కో సం ఢిల్లీకి వెళ్లిన బీజేపీ నాయకులు.. బిల్లు ఆమోదం తర్వాత రైళ్లో శనివారం కాజీపేటకు చేరుకున్నారు.
కాజీపేట రూరల్, న్యూస్‌లైన్ పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం కో సం ఢిల్లీకి వెళ్లిన బీజేపీ నాయకులు.. బిల్లు ఆమోదం తర్వాత రైళ్లో శనివారం కాజీపేటకు చేరుకున్నారు. ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, రావు పద్మ, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి కాజీపేట జం క్షన్‌కు చేరుకున్నారు. వారికి జిల్లా నాయకులు ఘనస్వాగతం పలికారు.
మహిళామోర్చా నాయకులు మంగళహారతి తో స్వాగతం పలికారు. అనంతరం రైళ్లో నుంచి కిషన్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ తెలంగాణ వాదుల 60ఏళ్ల సాకారం నెరవేరిందని, నాలుగున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజల బాధలను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తీర్చనుందని అన్నా రు. అనంతరం రైళ్లో కిషన్‌రెడ్డి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. రైలు దిగిన మార్తినేని ధర్మారావు, రావు పద్మ, గుజ్జుల ప్రేపేందర్‌రెడ్డిలను నాయకులు జంక్షన్ ముందు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనం లో ఊరేగింపుగా అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ గా తీసుకు వచ్చారు.
ర్యాలీలో నిజామాబాద్ ఎమ్మె ల్యే లక్ష్మినారాయణ, చందుపట్ల జంగారెడ్డి, వన్నాల శ్రీరాములు, మందాటి సత్యనారాయణ రెడ్డి, రామగళ్ల పరమేశ్వర్, ఎడ్ల అశోక్‌రెడ్డి, బొడిగె గట్టయ్యగౌడ్, నార్లగిరి రమేష్, చింతాకుల సునీల్, డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు, రావు అమరేందర్‌రెడ్డి, న్యాయవాదుల జేఏపీ నాయకులు కొత్త రవి, దయాల్, చాంద్‌పాషా, అంకేశ్వరపు కుమార్, భగవాన్ ఉపాద్యాయ, మనోహర్‌రావు, మహిళ నాయకలు పాల్గొన్నారు.