సాక్షి,కాజీపేట: ఏ పని చేయకుండా తల్లిపై ఆధారపడడం సరికాదని, కుటుంబ పోషణకు ఏదో పనిలో కుదురుకోవాలని నచ్చచెప్పేందుకు యత్నించిన మహిళ తీరు ఆమె భర్తకు నచ్చలేదు. దీంతో కోపం పెంచుకున్న ఆయన భార్య గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు. ఫలితంగా వారి ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులకు దూరం కావాలి్సన పరిస్థితి నెలకొంది. కాజీపేటలోని రైల్వే క్వార్టర్స్‌లో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
కాజీపేటలోని రైల్వే క్వార్టర్స్‌లో తల్లితో కలిసి ఉండే మేకల శ్రీనివాస్‌కు ఎనిమిదేళ్ల క్రితం ధర్మసాగర్ మండలం మల్లక్‌పెల్లి గ్రామానికి చెందిన రమాదేవి(28)తో వివాహం జరిగింది. తల్లి రైల్వే ఉద్యోగి కావడంతో ఆమె సంపాదనపైనే ఆధారపడిన శ్రీనివాస్ ఏ పని చేయడం లేదు. ఇద్దరు పిల్లలు పెరుగుతున్నందున పని చేయకపోతే ఎలా అని భార్య, తల్లి అడిగినప్పుడు రెండు రోజులు ఆటో నడపడం మళ్లీ యథావిధిగా మద్యం మత్తులో తూలుతుండడం పరిపాటిగా మారింది. నిత్యం తల్లిని బెదిరిస్తూ డబ్బు తీసుకుని తాగి వచ్చి భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో బుధవారం శ్రీనివాస్ తల్లి విధులకు వెళ్లాక ఇంటికి వచ్చిన శ్రీనివాస్ పిల్లలను ట్యూషన్‌కు పంపించాడు.
ఆ తర్వాత మళ్లీ భార్యతో గొడవ జరగగా ఆవేశానికి లోనైన శ్రీనివాస్ తన వద్ద ఉన్న కత్తితో రమాదేవి గొంతు కోశాడు. తప్పించుకునే క్రమంలో ఆమె కేకలు వేస్తూ ఇంటి బయటకు పరుగెత్తుతూ వచ్చి పడిపోయింది. స్థానికులు చేరుకునే లోగా బాగా రక్తస్రావం కావడంతో రమాదేవి మృతి చెందింది. ఆ తర్వాత నిందితుడు శ్రీనివాస్ పారిపోగా, డీసీపీ పుష్ప, ఏసీపీ జితేందర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ సీఐ రావుల నరేందర్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. కాగా, తల్లి రక్తపు మడుగులో పడి ఉండడం, తండ్రి కానరాకుండా పోవడంతో ఏడు, ఐదేళ్ల వారి కుమారులు సాత్విక్, రిత్విక్ రోదిస్తున్నతీరు స్థానికులను కంట తడి పెట్టించింది.
Comments
Please login to add a commentAdd a comment