
సాక్షి, వరంగల్ : తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో గత నెల 15న చోటు చేసుకున్న బోటు ప్రమాదంలో ఆదివారం మరో తల లేని మృతదేహం లభ్యమైనట్లు సమాచారం. ఆ మృతదేహానికి రాజమండ్రిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో డీఎన్‌ఏ పరీక్షలను నిర్వహించి బంధువులకు అప్పగించనున్నట్లు తెలిసింది. అయితే కాజీపేట మండలం కడిపికొండ గ్రామానికి చెందిన 14 మంది గత నెల 14న పాపికొండల టూర్ నిమిత్తం బయలుదేరి 15న జరిగిన బోటు ప్రమాదంలో చిక్కుకున్న విషయం విధితమే. ఘటనలో ఆరుగురి మృతదేహాలు లభ్యం కాగా, ముగ్గురి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. ఐదుగురు సురక్షితంగా స్వగ్రామానికి చేరుకున్నారు. ఆదివారం లభించిన తల లేని మొండెం ఎవరిదనే ఉత్కంఠ కడిపికొండకు చెందిన ఆచూకి లభించని మూడు కుటుంబాల్లో నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment