
కాజీపేట అర్బన్ : వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోల్‌కతాకు చెందిన బిలబ్ పాండే రెండో కుమారుడు కౌశిక్ పాండే ఫస్టియర్‌లో 9.5 జీపీఏతో టాపర్‌గా నిలిచాడు. సెకండియర్‌లో సీఎస్‌ఈ విభాగంలో చేరాడు. సోమవారం తరగతులు పునఃప్రారంభం కావడంతో తండ్రి బిలబ్ పాండే కౌశిక్‌ను వెంట తీసుకొచ్చాడు.
తండ్రి బుధవారం ఉదయం స్వగ్రామానికి వెళ్లిపోతున్నట్లు మంగళవారంరాత్రి కౌశిక్‌తో చెప్పాడు. కాజీపేట రైల్వేస్టేషన్‌లో రైలు టికెట్ తీసుకోవడానికి వచ్చిన బిలబ్ పాండే కౌశిక్‌తో మాట్లాడటానికి ఫోన్ చేయగా సమాధానం రాలేదు. అనుమానంతో హాస్టల్ గదికి వచ్చి కిటికీలో నుంచి చూడగా కౌశిక్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. చదువులో వెనుకబడి తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు బిలబ్ పాండే ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ అజయ్ తెలిపారు. .
Comments
Please login to add a commentAdd a comment