National Institute of Technology Warangal
-
వైరస్‌కు శక్తి పెరిగింది.. ఎయిర్ బోర్న్‌గా రూపాంతరం చెందింది
సాక్షి, కాజీపేట అర్బన్: కోవిడ్–19పై వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో చేపట్టిన పరిశోధనలు ఏడాది పూర్తి చేసుకున్నాయి. నిట్‌లోని డీబీటీ (డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ) ద్వారా రూ.రెండు కోట్ల నిధులతో కరోనా వైరస్‌పై మూడేళ్ల కాలపరిమితితో పరిశోధనలు చేపట్టారు. గతేడాది మేలో శ్రీకారం చుట్టారు. బయోటెక్నాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ పెరుగు శ్యాం, గిరీష్ ఈ పరిశోధనల్లో పాలు పంచుకుంటున్నారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ కరోనా వైరస్ ఎయిర్ బోర్న్‌గా రూపాంతరం చెందిందని తెలిపారు. వ్యక్తులు తుమ్మినా, దగ్గినా తుంపరలు గాలిలో కలసిపోయి ఆరు మీటర్ల పరిధి వరకు వెళ్లే శక్తి వైరస్‌కు పెరిగినట్లు చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ నుంచి థర్డ్ వేవ్‌ను అందుకునే దిశగా పయనిస్తోందని తెలిపారు. రెండేళ్లలో కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్‌పై పరిశోధనలు చేస్తున్నామని శ్యాం, గిరీష్ వివరించారు. చదవండి: (తెలంగాణలో రెండు వారాల్లో లక్ష కేసులు) -
సంస్కరించేలా శిక్షలుండాలి
సాక్షి, హైదరాబాద్: పిల్లలు తప్పు చేస్తే వారిని సంస్కరించే దిశగా క్షమాగుణంతో చర్యలు, శిక్షలు ఉండాలని వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)కు హైకోర్టు హితవు చెప్పింది. తప్పు చేసిన విద్యార్థుల్లో మార్పు వచ్చేలా వారికి శిక్షలు ఉండాలని సూచన చేసింది. ఓ విద్యార్థిని సస్పెండ్ చేసిన వ్యవహారంపై హైకోర్టు స్పందిస్తూ.. సెనేట్ నిర్ణయం తీసుకునే వరకూ ఆ విద్యార్థిని తరగతులకు హాజరయ్యేందుకు అనుమతిచ్చే విషయంలో నిట్ తన వైఖరిని తెలియజేయాలని ధర్మాసనం ఆదేశించింది. విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం పేర్కొంది. నిట్ తొలి ఏడాది విద్యార్థి గంజాయి వినియోగిస్తూ పట్టుబడటంతో ఆ విద్యార్థిని పరీక్షలకు అనుమతించకపోవడటంతోపాటుగా ఆ ఏడాదికి సస్పెండ్ చేస్తూ 2019 నవంబర్ 22న నిట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ విద్యార్థి హైకోర్టును ఆశ్రయించగా..ఈ విషయం సెనేట్ ముందు పెండింగ్‌లో ఉన్నందున మూడు వారాల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని గతంలో సింగిల్ జడ్జి ఉత్తర్వులిచ్చారు. సెనేట్ నిర్ణయం వెలువడే వరకూ తరగతులకు అనుమతించేలా ఉత్తర్వులివ్వాలని విద్యార్థి చేసిన అప్పీల్ పిటిషన్‌ను ధర్మాసనం మంగళవారం విచారించింది. వాదనల అనంతరం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. -
‘నిట్’ విద్యార్థి ఆత్మహత్య
కాజీపేట అర్బన్ : వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోల్‌కతాకు చెందిన బిలబ్ పాండే రెండో కుమారుడు కౌశిక్ పాండే ఫస్టియర్‌లో 9.5 జీపీఏతో టాపర్‌గా నిలిచాడు. సెకండియర్‌లో సీఎస్ఈ విభాగంలో చేరాడు. సోమవారం తరగతులు పునఃప్రారంభం కావడంతో తండ్రి బిలబ్ పాండే కౌశిక్‌ను వెంట తీసుకొచ్చాడు. తండ్రి బుధవారం ఉదయం స్వగ్రామానికి వెళ్లిపోతున్నట్లు మంగళవారంరాత్రి కౌశిక్‌తో చెప్పాడు. కాజీపేట రైల్వేస్టేషన్లో రైలు టికెట్ తీసుకోవడానికి వచ్చిన బిలబ్ పాండే కౌశిక్‌తో మాట్లాడటానికి ఫోన్ చేయగా సమాధానం రాలేదు. అనుమానంతో హాస్టల్ గదికి వచ్చి కిటికీలో నుంచి చూడగా కౌశిక్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. చదువులో వెనుకబడి తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు బిలబ్ పాండే ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ అజయ్ తెలిపారు. . -
జాతీయ సమైక్యతకు నిదర్శనం: డీజీపీ
కాజీపేట అర్బన్: వరంగల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో విద్యనభ్యసించడం ద్వారా ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం లభిస్తుందని.. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. కాజీపేటలోని నేషనల్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) వార్షికోత్సవాల ను మంగళవారం అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన డీజీపీ మాట్లాడుతూ.. వివిధ దేశాల విద్యార్థులు చదువు కోసం ఇక్కడకు వస్తుండటంతో జాతీయ సమైక్యతకు నిదర్శనంగా నిలుస్తోందని చెప్పారు. తాను నాటి ఆర్ఈసీ.. నేటి నిట్‌లో 1990లో సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో చేరానని డీజీపీ గుర్తు చేసుకున్నారు. ఆనాటి ప్రిన్సిపాల్ కోటేశ్వర్రావు ప్రోత్సాహంతో పాటు అధ్యాపకులు మానవీయ విలువలతో కూడిన విద్యనందిం చడం ద్వారానే తాను ఈ స్థాయికి ఎదిగానన్నా రు. అప్పట్లో తనకు తెలుగు మాత్రమే వచ్చని పేర్కొన్నారు. ఆర్ఈసీ తనకు ఎంతో నేర్పించి సమాజానికి సేవ చేసే ఉద్యోగమైన డీజీపీ స్థాయికి చేరడానికి దోహదపడిందని తెలిపారు. ప్రపంచంలోనే నిట్ వరంగల్ ప్రత్యేకం ప్రపంచంలోనే నిట్ వరంగల్‌కు ప్రత్యేక గుర్తిం పు ఉందని నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు తెలిపారు. నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు నాంది పలుకుతున్న నిట్‌లో ఏటా ఉత్తమ ప్రతి భ కనబరుస్తున్న విద్యార్ధులకు గోల్డ్ మెడల్స్, క్యాష్ ప్రైజ్ అందించి ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. అనంతరం 27 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, 78 మంది విద్యార్ధులకు క్యాష్ ప్రైజ్, ప్రశంసా పత్రాలను డీజీపీ చేతుల మీదుగా అందజేశారు. అలాగే, డీజీపీ మహేం దర్‌రెడ్డిని నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు ఘనంగా సన్మానించారు. -
గ్రాఫిక్స్ సినిమాలంటే బోర్
మానవీయ కథనాలతో సినిమాలు చేస్తా నిట్‌లో ప్రీ స్ప్రింగ్ స్ప్రీలో {పముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల విద్యార్థులతో మాటామంతి కాజీపేట రూరల్ :గ్రాఫిక్స్ సినిమాలు చేయడమంటే బోరుఅని, మానవీయ కథనా లతో సినిమాలు చేయడమే ఇష్టమని ప్రముఖ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో మార్చి 11, 12, 13 తేదీల్లో జరిగే స్ప్రింగ్ స్ప్రీ-16 ఈవెంట్‌ను పురస్కరించుకొని శుక్రవారం నిట్ ఆడిటోరియంలో ప్రీ స్ప్రింగ్ స్ప్రీ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యూరు. నిట్ డైరక్టర్ టి.శ్రీనివాసరావు శేఖర్ కమ్ములకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతించారు. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల మాట్లాడుతూ నిట్ స్ప్రింగ్ స్ప్రీకి అంబాసిడార్‌గా వ్యవహరిస్తున్నాని చెప్పారు. తాను హైదరాబాద్‌లో సీబీఐటీలో చదివిన జ్ఞాపకాలను గుర్తు చేస్తూ.. కంప్యూటర్ సైన్స్ చదివి జీవితంలో ఉద్యోగం దొరికితే చాలు అనుకుంటే మెకానిక్ ఇంజనీరింగ్‌లో సీటు వచ్చిందన్నారు. అమెరికాలో ఏపీఎన్టీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరి అమెరికాలో ఉంటున్నప్పుడు తన రూమ్మేట్స్ సూచన మేరకు విజన్ మీడియాలో చేరానని తెలిపారు. ఆ తర్వాత చిత్ర పరిశ్రమలోకి వ చ్చినట్లు వెల్లడించారు. తెలుగు భాషలో సినిమాలు చేయాలంటే తెలుగు భాషపై పట్టు ఉండాలన్నారు. లీడర్-2 చిత్రం త్వరలోనే వస్తుందని, అందులో హీరో రాణానే ఉంటాడని తెలిపారు. ఈ సందర్భంగా శేఖర్ కమ్ములతో నిట్ విద్యార్థులు వేదికపై సమావేశమై మాటామంతి జరిపారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. శేఖర్ కమ్ముల హీరోగా సినిమా తీస్తే చూడాలని ఉందని నిట్ విద్యార్థులు అన్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన చిత్రాల్లోని పాటలు పాడి నృత్యాలు చేసిన నిట్ విద్యార్థులను శేఖర్ అభినందించారు. కార్యక్రమంలో నిట్ డైరక్టర్ శ్రీనివాస్‌రావు, డీన్ రమణారెడ్డి, ఫ్యాకల్టీ అడ్వయిజర్ కాశీవిశ్వనాథం, నిట్ స్ప్రింగ్ స్ప్రీ విద్యార్థుల బృందం పాల్గొన్నారు. -
అదుర్స్
పారంభమైన టెక్నోజియాన్ ఈవెంట్లు నిట్‌కు తరలివచ్చిన వివిధ రాష్ట్రాల విద్యార్థులు అలరించిన ప్రదర్శనలు ఆకట్టుకున్న రోబో {Mికెట్ ఈవెంట్లు కాజీపేట రూరల్ :వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో టెక్నోజియాన్-15 ఫెస్ట్ శుక్రవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు కొనసాగే ఈ సాంకేతిక సంబురానికి తొలిరోజు నాగపూర్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి సుమారు 2 వేల మంది విద్యార్థులు హాజరై 30 రకాల ఈవెంట్లను ప్రదర్శించారు. మరికొందరు విద్యార్థులు శనివారం నాటి ఈవెంట్ల తయూరీలో నిమగ్నమయ్యూరు. మొత్తంగా నిట్ ప్రాంగణం విద్యార్థుల సందడితో హోరెత్తింది. ఏవీఎన్-ఈ విమానం షో, నిట్ అడ్మినిస్ట్రేషన్ భవనం ముందు విజయవాడ ఆర్జీసీకేటీ నూజివీడు కళాశాల విద్యార్థులు రోబో చేత గోల్ఫ్ ఆడించడం, వరంగల్ నిట్ విద్యార్దుల ఎలక్ట్రానిక్ క్రికెట్ రోబో ప్రదర్శనలు అలరించారుు. పార్కింగ్ షెడ్ వద్ద నేషనల్ రోబోటిక్ చాంపియన్‌షిప్‌లో భాగంగా మొబైల్ కంట్రోల్ రోబోస్, రోబో వార్స్, లైన్ ఫలోవర్ ఈవెంట్ల తయారీలో విద్యార్థులు నిమగ్నమయ్యూరు. నిట్‌లో జరిగే టెక్నోజియాన్‌ను తిలకించడానికి జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు తరలి వచ్చారు. ఏవిఎన్-ఇ షోకు 10 బృందాలు... మొదటి రోజు జరిగిన ఏవిఎన్-ఇ పోటీల్లో బెంగళూర్ నుంచి 8, తమిళనాడు, హైదరాబాద్ నుంచి ఒక్కో బృందం వచ్చారుు. మొదటి దశలో విమానం చెక్క బ్యాటరీ ఇతర పరికరాలతో తయారు చేయడం. రెండవ దశలో రౌండ్ మ్యాప్, మూడవ దశలో విమానం స్టంట్స్లు జరిగాయి. లాస్ట్ రౌండ్లో స్టంట్స్ సెలక్ట్ చేసి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రదానం చేస్తారు. ఉనికి చర్ల విద్యార్థుల ప్రతిభ ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల జడ్పీఎస్ఎస్ 10వ తరగతి విద్యార్థులు డి.రంజిత్, జి.కరుణాకర్, ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు ఎస్.వీరయ్య ఆధ్వర్యంలో మొబైల్ కంట్రోల్‌తో రోబో నడిచే ఎలక్ట్రానిక్ ఈవెంట్‌ను తయారు చేసి ప్రదర్శించారు. వికలాంగుల ఈవెంట్ల ప్రదర్శన.. మానసిక వికలాంగులు తయారు చేసిన వస్తువులను వరంగల్ నిట్ విద్యార్థులు టెక్నోజియాన్‌లో ప్రదర్శించారు. ఆయూ కార్యక్రమాలలో డీన్ ఆఫైర్స్ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రావు, ఫ్యాకల్టీ అడ్వైజర్ లక్ష్మారెడ్డి, టెక్నోజియాన్ కో ఆర్డినేటర్ క్రాంతికిరణ్, ప్రెసిడెంట్ అరవింద్, పబ్లిసిటీ ఇన్చార్జీలు సందీప్, వినయ్, మనోజ్, వంశీకృష్ణ పాల్గొన్నారు.