అదుర్స్
పారంభమైన టెక్నోజియాన్ ఈవెంట్లు
నిట్‌కు తరలివచ్చిన వివిధ రాష్ట్రాల విద్యార్థులు
అలరించిన ప్రదర్శనలు ఆకట్టుకున్న రోబో
{Mికెట్ ఈవెంట్లు
కాజీపేట రూరల్ :వరంగల్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో టెక్నోజియాన్-15 ఫెస్ట్ శుక్రవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు కొనసాగే ఈ సాంకేతిక సంబురానికి తొలిరోజు నాగపూర్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి సుమారు 2 వేల మంది విద్యార్థులు హాజరై 30 రకాల ఈవెంట్లను ప్రదర్శించారు. మరికొందరు విద్యార్థులు శనివారం నాటి ఈవెంట్ల తయూరీలో నిమగ్నమయ్యూరు. మొత్తంగా నిట్ ప్రాంగణం విద్యార్థుల సందడితో హోరెత్తింది. ఏవీఎన్-ఈ విమానం షో, నిట్ అడ్మినిస్ట్రేషన్ భవనం ముందు విజయవాడ ఆర్‌జీసీకేటీ నూజివీడు కళాశాల విద్యార్థులు రోబో చేత గోల్ఫ్ ఆడించడం, వరంగల్ నిట్ విద్యార్దుల ఎలక్ట్రానిక్ క్రికెట్ రోబో ప్రదర్శనలు అలరించారుు. పార్కింగ్ షెడ్ వద్ద నేషనల్ రోబోటిక్ చాంపియన్‌షిప్‌లో భాగంగా మొబైల్ కంట్రోల్ రోబోస్, రోబో వార్స్, లైన్ ఫలోవర్ ఈవెంట్ల తయారీలో విద్యార్థులు నిమగ్నమయ్యూరు. నిట్‌లో జరిగే టెక్నోజియాన్‌ను తిలకించడానికి జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు తరలి వచ్చారు.
ఏవిఎన్-ఇ షోకు 10 బృందాలు...
మొదటి రోజు జరిగిన ఏవిఎన్-ఇ పోటీల్లో బెంగళూర్ నుంచి 8, తమిళనాడు, హైదరాబాద్ నుంచి ఒక్కో బృందం వచ్చారుు. మొదటి దశలో విమానం చెక్క బ్యాటరీ ఇతర పరికరాలతో తయారు చేయడం. రెండవ దశలో రౌండ్ మ్యాప్, మూడవ దశలో విమానం స్టంట్స్‌లు జరిగాయి. లాస్ట్ రౌండ్‌లో స్టంట్స్ సెలక్ట్ చేసి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రదానం చేస్తారు.
ఉనికి చర్ల విద్యార్థుల ప్రతిభ
ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల జడ్పీఎస్‌ఎస్ 10వ తరగతి విద్యార్థులు డి.రంజిత్, జి.కరుణాకర్, ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు ఎస్.వీరయ్య ఆధ్వర్యంలో మొబైల్ కంట్రోల్‌తో రోబో నడిచే ఎలక్ట్రానిక్ ఈవెంట్‌ను తయారు చేసి ప్రదర్శించారు.
వికలాంగుల ఈవెంట్ల ప్రదర్శన..
మానసిక వికలాంగులు తయారు చేసిన వస్తువులను వరంగల్ నిట్ విద్యార్థులు టెక్నోజియాన్‌లో ప్రదర్శించారు. ఆయూ కార్యక్రమాలలో డీన్ ఆఫైర్స్ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రావు, ఫ్యాకల్టీ అడ్వైజర్ లక్ష్మారెడ్డి, టెక్నోజియాన్ కో ఆర్డినేటర్ క్రాంతికిరణ్, ప్రెసిడెంట్ అరవింద్, పబ్లిసిటీ ఇన్‌చార్జీలు సందీప్, వినయ్, మనోజ్, వంశీకృష్ణ పాల్గొన్నారు.