గ్రాఫిక్స్ సినిమాలంటే బోర్
మానవీయ కథనాలతో సినిమాలు చేస్తా
నిట్‌లో ప్రీ స్ప్రింగ్ స్ప్రీలో {పముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల
విద్యార్థులతో మాటామంతి
కాజీపేట రూరల్ :గ్రాఫిక్స్ సినిమాలు చేయడమంటే బోరుఅని, మానవీయ కథనా లతో సినిమాలు చేయడమే ఇష్టమని ప్రముఖ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో మార్చి 11, 12, 13 తేదీల్లో జరిగే స్ప్రింగ్ స్ప్రీ-16 ఈవెంట్‌ను పురస్కరించుకొని శుక్రవారం నిట్ ఆడిటోరియంలో ప్రీ స్ప్రింగ్ స్ప్రీ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యూరు. నిట్ డైరక్టర్ టి.శ్రీనివాసరావు శేఖర్ కమ్ములకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతించారు. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల మాట్లాడుతూ నిట్ స్ప్రింగ్ స్ప్రీకి అంబాసిడార్‌గా వ్యవహరిస్తున్నాని చెప్పారు. తాను హైదరాబాద్‌లో సీబీఐటీలో చదివిన జ్ఞాపకాలను గుర్తు చేస్తూ.. కంప్యూటర్ సైన్స్ చదివి జీవితంలో ఉద్యోగం దొరికితే చాలు అనుకుంటే మెకానిక్ ఇంజనీరింగ్‌లో సీటు వచ్చిందన్నారు. అమెరికాలో ఏపీఎన్‌టీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా చేరి అమెరికాలో ఉంటున్నప్పుడు తన రూమ్మేట్స్ సూచన మేరకు విజన్ మీడియాలో చేరానని తెలిపారు.
ఆ తర్వాత చిత్ర పరిశ్రమలోకి వ చ్చినట్లు వెల్లడించారు. తెలుగు భాషలో సినిమాలు చేయాలంటే తెలుగు భాషపై పట్టు ఉండాలన్నారు. లీడర్-2 చిత్రం త్వరలోనే వస్తుందని, అందులో హీరో రాణానే ఉంటాడని తెలిపారు. ఈ సందర్భంగా శేఖర్ కమ్ములతో నిట్ విద్యార్థులు వేదికపై సమావేశమై మాటామంతి జరిపారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. శేఖర్ కమ్ముల హీరోగా సినిమా తీస్తే చూడాలని ఉందని నిట్ విద్యార్థులు అన్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన చిత్రాల్లోని పాటలు పాడి నృత్యాలు చేసిన నిట్ విద్యార్థులను శేఖర్ అభినందించారు. కార్యక్రమంలో నిట్ డైరక్టర్ శ్రీనివాస్‌రావు, డీన్ రమణారెడ్డి, ఫ్యాకల్టీ అడ్వయిజర్ కాశీవిశ్వనాథం, నిట్ స్ప్రింగ్ స్ప్రీ విద్యార్థుల బృందం పాల్గొన్నారు.