సాక్షి, హైదరాబాద్: కాజీపేట్ రైల్వే బైపాస్ లైన్ ఆధునికీకరణ పనుల దృష్ట్యా ఈ నెల 26 నుంచి 28 వరకు పలు రైళ్లు పూర్తిగాను, మరి కొన్ని పాక్షికంగాను రద్దు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె. సాంబశివరావు శనివారం తెలిపారు. మరి కొన్నింటిని దారి మళ్లించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ నెల 27, 28 తేదీలలో సిర్పూర్‌కాగజ్‌నగర్-కాజీపేట్ రామగిరి ప్యాసింజర్, విజయవాడ-కాజీపేట్, కాజీపేట్-అజ్నీ , కాజీపేట్-మణుగూర్, డోర్నకల్-కాజీపేట్, భద్రాచలంరోడ్డు-సిర్పూర్ ప్యాసింజర్, బల్లార్ష-భద్రాచలంరోడ్డు, పెద్దపల్లి-విజయవాడ ప్యాసింజర్ రైళ్లు పూర్తిగా రద్దు కానున్నాయి.
పాక్షిక రద్దు : ఈ నెల 27, 28 తేదీలలో హైదరాబాద్-వరంగల్ ప్యాసింజర్ ట్రైన్ కాజీపేట్ వరకే నడుస్తుంది. సికింద్రాబాద్-మణుగూర్ ఫాస్ట్ ప్యాసింజర్ సికింద్రాబాద్ నుంచి కాజీపేట్ వరకు పరిమితమవుతుంది.
బల్లార్ష-కాజీపేట్-డోర్నకల్ సెక్షన్‌ల మధ్య నడిచే రైళ్లు 15 నిమిషాల నుంచి గంటన్నర వరకు ఆలస్యంగా నడుస్తాయి.
26, 27 తేదీలలో ఆలస్యంగా...
సికింద్రాబాద్-పాట్నా ఎక్స్‌ప్రెస్, యశ్వంత్‌పూర్-గోరక్‌పూర్, సిర్పూర్‌కాగజ్‌నగర్-సికింద్రాబాద్, షిర్డీసాయినగర్-కాకినాడ, హైదరాబాద్-హౌరా ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్, కాజీపేట్-మణుగూర్ ప్యాసింజర్, హైదరాబాద్-వరంగల్, తిరువనంతపురం-న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్, గోరక్‌పూర్-తిరువనంతపురం, సికింద్రాబాద్- శాతవాహన, పాట్నా-సికింద్రాబాద్, గుంటూరు-సికింద్రాబాద్ ఇంటర్‌సిటీ, జమ్ముతావి-మంగళూర్, న్యూఢిల్లీ-చెన్నై తమిళనాడు ఎక్స్‌ప్రెస్, చెన్నై-లక్నో ఎక్స్‌ప్రెస్ తదితర ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు ఆలస్యంగా నడవనున్నాయి.
పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు
Published Sun, Sep 21 2014 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 PM
Advertisement
Advertisement