కాజీపేట రూరల్, న్యూస్‌లైన్ : దేశానికి కాబోయే ప్రధానమంత్రి నరేంద్రమోడీయేనని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మూడు రోజులపాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ కౌన్సిల్ సమావేశాల్లో పాల్గొనేందుకు పార్టీకి చెందిన జిల్లా నాయకులు తరలివెళ్లిన విషయం తెలిసిందే. సమావేశాలు ముగియడంతో మంగళవారం రాత్రి వారు ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో కాజీపేట జంక్షన్‌కు చేరుకున్నారు.
రైల్వే స్టేషన్‌లోని వీఐపీ లాంజ్‌లో బీజేపీ అర్భన్ అధ్యక్షుడు చింతాకుల సునీల్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో అశోక్‌రెడ్డి మాట్లాడారు. ఢిల్లీలో జరిగిన జాతీయ సమావేశాల్లో ‘ఏక్‌భారత్... శ్రేష్ట్ భారత్’ అంశంపై రాను న్న వంద రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్‌ను గద్దె దింపాలని, బీజేపీకి పట్టం కట్టేలా ప్రతి నాయకుడు సైనికుడిలా పనిచేయాలని తీర్మానించినట్లు తెలిపారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రావు పద్మ మాట్లాడుతూ యూవత్ దేశప్రజలు నరేంద్రమోడీని ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని, కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యదర్శి చాడా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని కాపాడేపనిలో ఆ పార్టీకి చెందిన నాయకులు ఉండగా... మరో వైపు యువత, శ్రామికులు, బడుగు బలహీన వర్గాల వారు నరేంద్రమోడీ పాలన కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఢిల్లీ జాతీయ సమావేశాలు పార్టీకి స్ఫూర్తినిచ్చాయని... బుధవారం జిల్లాలో జరిగే సమావేశాలకు బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రానున్నారని వెలల్డించారు.
రావు అమరేందర్‌రెడ్డి మాట్లాడుతూ జాతీయ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం ఆవశ్యకతపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వివరించారన్నారు. సమావేశంలో బీజేపీ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ రాంచందర్‌రెడ్డి, కన్వీనర్ తిరపతి రెడ్డి, జిల్లా కార్యదర్శి కేవీఎల్‌ఎన్.రెడ్డి, గాదె రాంబాబు, ప్రచార కార్యదర్శి తిలక్, మల్లాది తిరుపతి, బన్న ప్రభాకర్, రాంచందర్, తాళ్లపెల్లి కుమారస్వామి, మారెపెల్లి రాంచంద్రారెడ్డి, గురుమూర్తి, ఉడుగు శ్రీనివాస్, గడప శివశంకర్, స్వామి, సుక్కయ్య పాల్గొన్నారు.
కాబోయే ప్రధాని నరేంద్రమోడీయే..
Published Wed, Jan 22 2014 4:25 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
Advertisement
Advertisement