67 కిలోల వెండి నగలు స్వాధీనం | 67 kg silver jewelry seized | Sakshi
Sakshi News home page

Sep 27 2017 3:38 AM | Updated on Sep 27 2017 3:38 AM

67 kg silver jewelry seized

కాజీపేట: అక్రమంగా తరలిస్తున్న రూ.35 లక్షల విలువ చేసే 67 కిలోల వెండి ఆభరణాలను వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేట పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు సేలం ప్రాంతానికి చెందిన ఈశ్వర్‌ సతీశ్, సుబ్రహ్మణ్యం సత్తివేలు వెండినగల వ్యాపారులు. వీరు మంగళవారం కాజీపేట టౌన్‌ రైల్వే స్టేషన్‌లో కోర్బా ఎక్స్‌ప్రెస్‌ నుంచి దిగారు. వీరిని పోలీసులు తనిఖీ చేయగా, ఎటువంటి బిల్లులు లేకుండా వెండి ఆభరణాలు ఉన్నాయి. ఈ నగలను జగిత్యాల జిల్లా మెట్‌పల్లి, కోరుట్ల ప్రాంతాలకు తరలిస్తున్నట్లు నిందితులు చెప్పారు. స్వాధీనం చేసుకున్న నగలను ఐటీ శాఖకు అప్పగించనున్నట్లు ఏసీపీ బి. జనార్దన్‌ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement