ఖాజీపేట, న్యూస్‌లైన్ : ‘మీ గ్రామానికి జిల్లా అధికారులమంతా వచ్చాం. మీ సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. వాటిని ఇక్కడే, ఇప్పుడే పరిష్కరిస్తాం’ అని కలెక్టర్ కోన శశిదర్ అన్నారు. ఖాజీపేట మండలం కొమ్మలూరు దళితవాడలో గురువారం నిర్వహించిన ‘పల్లె పిలుపు’ కార్యక్రమాన్నుద్దేశించి ఆయన మాట్లాడారు.
18 శాఖల పని తీరుపై గ్రామస్తులతో చర్చించారు. చౌక ధాన్యపు డిపో డీలర్ తమకు సక్రమంగా సరుకులు ఇవ్వడం లేదని, రెండు, మూడు నెలలకోసారి మాత్రమే ఇస్తున్నాడని స్థానికులు ఆరోపించారు. తూకాలు కూడా తక్కువగా ఇస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ సిబ్బందిపైనా వారు ఆరోపణలు చేశారు. పశు వైద్యాధికారి అందుబాటులో లేడని, ఉపాధి సిబ్బందిపైనా గ్రామస్తులు అనేక ఆరోపణలు చేశారు. వీటిపై కలెక్టర్ స్పందిస్తూ... వెంటనే డీలర్‌ను తొలగించాలని తహశీల్దార్‌ను ఆదేశించారు.
అతని నుంచి సక్రమంగా సరుకులు ఇవ్వని నెలలకు సంబంధించి రికవరీ చేయాలని చెప్పారు. ప్రజలు చైతన్యవంతులై లింగ నిర్ధరణ చేసే వైద్యులను పట్టించాలని కలెక్టర్ కోరారు. జాయింట్ కలెక్టర్ నిర్మల, స్పెషల్ ఆఫీసర్ సూర్యప్రకాశ్‌రావు, సర్పంచ్ మేరి, హౌసింగ్ పీడీ సాయినాథ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ వినయ్‌కుమార్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ప్రభుదాస్, డీఆర్‌డీఏ పీడీ వెంకట సుబ్బయ్య, డీఈఓ అంజయ్య, ఐసీడీఎస్ పీడీ లీలావతి, మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ ఖాదర్‌బాషా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
సమస్యలుంటే మా దృష్టికి తెండి: కలెక్టర్
Published Fri, Jan 3 2014 2:35 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM
Advertisement
Advertisement