ఫాతిమామాతను స్మరించాలి | Phatimamatanu remembrance | Sakshi
Sakshi News home page

ఫాతిమామాతను స్మరించాలి

Published Fri, Mar 14 2014 6:42 AM | Last Updated on Sat, Sep 2 2017 4:42 AM

Phatimamatanu remembrance

  •      పీఠాధిపతి ఉడుముల బాల
  •      ముగిసిన నవదిన ఉత్సవాలు
  •   కాజీపేట, న్యూస్‌లైన్ : లోక రక్షకుడు యేసు ప్రభువుకు జన్మనిచ్చిన ఫాతిమామాతను దైవజనులందరూ స్మరించాలని కథోలిక మేత్రాసనం పీఠాధిపతి ఉడుముల బాల అన్నారు. కాజీపేట పట్టణంలోని కెథడ్రల్ చర్చి ఆవరణలో జరుగుతున్న నవది న ఫాతిమామాత ఉత్సవాలు గురువారం రాత్రి ముగిశా యి. అంతకుముందు చర్చిలో పీఠాధిపతి ఉడుముల బాల దివ్యబలిపూజ, స్వస్థత ప్రార్థనలు నిర్వహించారు.

    ఈ సందర్భంగా పెద్దపాటల పూజకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులనుద్దేశించి ఉడుముల బాల మా ట్లాడారు. కలియుగం ఉన్నంతవరకు ఫాతిమామాత పేరు చిరస్మరణీయంగా ఉంటుందన్నారు. కథోలిక కుటుంబీకులు తమ ఇంట్లో జరిగే శుభకార్యాల్లో ముందుగా యేసుప్రభువుతోపాటు ఫాతిమామాతను స్మరిస్తే ఎలాంటి విఘూ్నలు కలుగవన్నారు. ఆదర్శవంతమైన సమాజ నిర్మాణానికి కథోలిక భక్తులు కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ఉత్సవాలకు హాజరైన భక్తులందరికి పీఠాధిపతి ఆశీస్సులు అందజేశారు.

     పీఠాధిపతి బాలకు ఘనస్వాగతం..

     ఉత్సవాల ముగింపు కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరైన బిషప్ బాలకు కథోలిక ప్రజలు ఘనస్వాగతం పలి కారు. స్థానిక ఫాతిమానగర్ క్రాస్‌రోడ్డు నుంచి వేలాది మం ది భక్తులు పీఠాధిపతికి ఎదురేగి మంగళహారతులు పట్టారు. అనంతరం బ్యాండ్‌మేళాలతో ఆయనను ఊరేగింపుగా తీసుకెళ్లారు. జనసంద్రంగా మారిన కథోలిక కుటుంబీకులను చూ సిన ఉడుముల బాల ఆనందంతో అభివాదం చేశారు. కాగా, ఫాతిమామాత దర్శిని పత్రికను విచారణ గురువులు ఆవిష్కరించి భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. అలాగే జూబెరి యన్ పీఠాధిపతులకు ఘనంగా సన్మానించారు. కాగా, బిషప్ బాలను క్రైస్తవులు, గురువులు, మతకన్యలు పూలమాలలు, శాలువలు, మెమొంటోలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అరుణోదయ యువతా కేంద్రం డెరైక్టర్ ఫాదర్ వినోద్, జోసెఫ్, రాయప్ప, ఫాదర్ జ్యోతిష్, తది తరులు  పాల్గొన్నారు.

     ఉడుముల బాలకు నాయకుల అభినందనలు..

     మూడు దశాబ్దాలుగా వివిధ హోదాల్లో కథోలికుల అభివృద్ధి, సంక్షేమం కోసం పీఠాధిపతిగా శ్రమిస్తున్న బిషప్ బాలకు వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, స్టేషన్‌ఘన్‌పూర్, వరంగ ల్ పశ్చిమ ఎమ్మెల్యేలు డాక్టర్ తాటికొండ రాజయ్య, దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఘంటా నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రాజారపు ప్రతాప్, గంగారపు అమృతరావు, మాజీ కార్పొరేటర్ అబూబక్కర్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి కాయిత రాజ్‌కుమార్‌యాదవ్ అభినందనలు తెలి పి ఆశీస్సులు తీసుకున్నారు.

     ఆడిపాడిన చిన్నారులు..

     కాగా, ఫాతిమామాత ముగింపు ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్నారులు ఆడిపాడా రు. యేసుప్రభువు పుట్టుకను వివరిస్తూ పిల్లల ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అహూతులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా, ఉత్సవాల్లో చెవిటి, మూగ విద్యార్థులు ప్రదర్శించిన స్వాగత నృత్యం ప్రతి ఒక్కరిని విశేషంగా ఆకట్టుకుంది.

     భారీగా మొక్కులు..

     పట్టణంలో జరుగుతున్న ఫాతిమామాత ఉత్సవాలు గురువా రం రాత్రి ముగిశాయి. ఉత్సవాలను పురస్కరించుకుని దా దాపు లక్ష మందికి పైగా భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. కాగా, ఉత్సవాల్లో బిషప్ బాల, 120మం ది గురువులు, 150 మంది సిస్టర్లు భాగస్వాములయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులందరికి నిర్వాహకులు ఉచితభోజన, వసతి సౌకర్యాలు కల్పించారు. ఉత్సవాల్లో కాజీపేట సీఐ పురుషోత్తం, ఎస్సైలు వెంకట్రావు, రామారా వు ఆధ్వర్యంలో సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement