healing prayers
-
Divine Space: శ్వాసపై ధ్యాస
రోజుకు ఉన్నది ఇరవై నాలుగ్గంటలు. పాతిక గంటలు చేసినా తరగనన్ని పనులు. ఇదీ నేటి ఫాస్ట్ లైఫ్... బతుకు చిత్రం. ప్రతి ఒక్కరికీ ఒత్తిడి పెరుగుతోంది. మెదడు తన వంతుగా హెచ్చరిక చేస్తుంది. గమనించే తీరిక ఉండదు మనిషికి. ఊపిరి సలపనివ్వనన్ని పనులు. ఆరోగ్యాన్ని హరిస్తున్న బిజీ లైఫ్‌లో ధ్యాసతో ఊపిరి పీల్చమంటున్నారు అర్పిత. మోడరన్ లైఫ్‌లో మనిషి జీవితం... మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నట్లు కూడా గమనించలేని స్థితిలోనే ఎక్కువ భాగం గడిచిపోతోంది. కొన్నిసార్లు సమస్య మానసికమైనదా, శారీరకమైనదా అనే స్పష్టత కూడా ఉండదు. డాక్టర్ దగ్గరకు వెళ్లి టెస్టులు చేయించుకుని మందులతో నయం చేసుకోవాల్సిన అనారోగ్యం కూడా చాలా సందర్భాల్లో ఉండదు. అలాగని మనశ్శాంతి కోసం ధార్మిక సత్సంగాలతో కాలం గడిపే విశ్రాంత జీవనమూ కాదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పరుగులు తీయక తప్పదు. ఈ పరిస్థితికి సమాధానం డివైన్ స్పేస్‌లో దొరుకుతోంది. ఒత్తిడుల మధ్య జీవిస్తూనే తేలికగా జీవించగలగడం ఎలాగో తెలిపే ఒక వేదిక ఇది... అంటున్నారు అర్పితా గుప్తా. విభిన్నమైన రంగాన్ని ఎంచుకుని సమాజహితం కోసం పని చేస్తున్న అర్పితా గుప్తా పరిచయం. గాలి పీల్చడం తెలియాలి! ‘‘సైకాలజీ, ఫిలాసఫీ, స్పిరిచువాలిటీ కలగలిసిన వేదిక ఇది. కెరీర్లో కొనసాగుతూనే వారానికో గంట సమయం కేటాయించుకోవడం అన్నమాట. మా నాన్న డాక్టర్, అమ్మ టీచర్. మా ఇంట్లో ఎవరూ ఈ ఫీల్డ్‌లో లేరు. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించడం అలవాటైంది నాకు. మొదటి నుంచి అలాగే ఉండేదాన్ని. పుట్టింది పెరిగింది హైదరాబాద్‌లోనే. ఇంటర్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ కొంతమంది పార్ట్‌టైమ్ జాబ్‌లు చేయడం చూసి నేను కూడా ఒక ఇరిగేషన్ కంపెనీలో చేరాను. డిగ్రీ వరకు అంతే... చదువు ఉద్యోగం రెండూ. పెళ్లి తర్వాత చదువు, ఉద్యోగం రెండూ మానేసి ఇంట్లో ఉన్నాను. నాకు అది ఒక టర్నింగ్ పాయింట్. 1998–99 సంవత్సరాల్లో రేఖీ సాధన ట్రెండింగ్‌లో ఉండేది. పక్కింటి ఆవిడ వెళ్తూ నన్ను పిలిచింది. ఆ ప్రాక్టీస్‌తో నా ఆలోచనా ధోరణి మారిపోయింది. త్రీ లెవెల్స్ వరకు ప్రాక్టీస్ చేసి మానేశాను. ఓ ఏడాదిపాటు మళ్లీ గృహిణిగా, పిల్లల్ని పెంచుకుంటూ రొటీన్ లైఫ్. అయితే ఆ గ్యాప్‌లో ఫ్రెండ్స్, బంధువులు తలనొప్పి, మైగ్రేన్, డయాబెటిక్, ఎసిడిటీ వంటి సమస్యలకు రెమిడీ అడిగేవారు. శ్వాస తీసుకోవడం కరెక్ట్‌గా వస్తే జీవక్రియలన్నీ సక్రమంగా ఉంటాయి. గంట నుంచి ఒకటిన్నర గంట హీలింగ్ సెషన్ లో శ్వాస సాధన చేయించడమే వైద్యం. ఇంట్లో మూడు వారాలు ప్రాక్టీస్ చేస్తే ఇక అదే అలవాటయిపోతుంది. ఇలా మొదలైన సర్వీస్ ఆ తర్వాత చారిటబుల్ ట్రస్ట్‌గా రూపాంతరం చెందింది. అవి బంధాలే– బంధనాలు కాదు! ఇటీవల అమ్మాయిల్లో చాలా మంది పెళ్లంటే భయపడుతున్నారు. పెళ్లి చేసుకున్నప్పటికీ భర్తతో అన్యోన్యంగా ఉండలేకపోతున్నారు. బాల్యంలో సెక్యువల్ అబ్యూస్‌కి గురి కావడమే ప్రధాన కారణం అయి ఉంటుంది. మగవాళ్ల మీద ఏహ్యభావం పేరుకుపోయి ఉంటుంది. భర్తతో సరిగ్గా మెలగలేకపోతుంటారు. ఈ పరిస్థితులు అనేక అపార్థాలకు, విడాకులకు దారి తీస్తున్నాయి. ఆ అమ్మాయి ఓపెన్ అయ్యే వరకు ఆమెకు ఆలంబనగా నిలవాలి. మొదట తన దేహాన్ని తాను ప్రేమించుకునేటట్లు కౌన్సెలింగ్ ఇవ్వాలి. వైవాహిక జీవితాన్ని స్వాగతించడానికి మానసికంగా సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇక మధ్య వయసు గృహిణుల్లో... ఎంప్టీనెస్ట్ సిండ్రోమ్ చాలా పెద్ద సమస్య. ఆర్థిక సమస్యలు ఉండవు, ఆరోగ్య సమస్యలూ ఉండవు. ఏమీ తోచని స్థితి నుంచి దేహంలో ఏదో ఒక అనారోగ్యం ఉన్నట్లు భావిస్తుంటారు. పిల్లలు పెద్దయి చదువు, ఉద్యోగాలతో వేరే ప్రదేశాలకు వెళ్లిపోయిన తర్వాత ఇంట్లో భార్యాభర్తలు మాత్రమే మిగులుతారు. మగవాళ్లు దాదాపుగా రోజంతా బయట పనుల్లో నిమగ్నమై ఉంటారు. ఆడవాళ్లు ఇంట్లో రోజంతా ఒంటరిగా గడపలేక ఏదో కోల్పోయినట్లవుతారు. అలాంటి వాళ్లను ‘మీకు ఏ కూర ఇష్టం’ అంటే వెంటనే సమాధానం చెప్పలేరు. భర్త ఇష్టాలు, పిల్లల ఇష్టాలను టక్కున చెప్పేస్తుంటారు. తమకంటూ జీవితం ఉందనే వాస్తవాన్ని కూడా గ్రహించకుండా యాభైఏళ్లపాటు జీవించేసి ఉంటారు. సెల్ఫ్ లవ్ అనే భావనే ఉండదు వాళ్ల మనసులో. మన సమాజం ఆడవాళ్లను అలా పెంచేసింది మరి. అలాగే ఆఫీసుల్లో ఆడవాళ్లకు ఎమోషనల్ అబ్యూజ్ మరో రకమైన సమస్య. ఇవన్నీ ఇలా ఉంటే... అత్తగారి హోదా వచ్చేటప్పటికి విచిత్రంగా మారిపోతుంటారు. ‘మేము వీకెండ్ సినిమాకు వెళ్తే మా అత్తగారు ఒప్పుకునే వారు కాదు. ఎంత బాధగా అనిపించేదో’ అని గుర్తు చేసుకుంటూ తాను మాత్రం కోడలి విషయంలో అలా ఉండకూడదు... అని నిర్ధారించేసుకుంటారు. ఇక కోడలితో ‘సండే సినిమాకు వెళ్లండి’ అని పదే పదే చెబుతుంటారు. సినిమాకు వెళ్లాలని ఆ కోడలికి ఉందా లేదా అనే ఆలోచన ఉండదు. ఇలాంటి ఎన్నో సున్నితమైన సమస్యలకు పరిష్కారం తమంతట తాముగా తెలుసుకోగలిగినట్లు చేయడమే నా సర్వీస్. నేనిచ్చే పాతిక ప్రశ్నలకు సమాధానాలు నిజాయితీగా రాసుకుంటే చాలు... బంధాలు అనుబంధాలుగా ఉండాలి తప్ప బంధనాలుగా ఉండకూడదని వాళ్లే తెలుసుకుంటారు. కుటుంబ బంధాలు బలపడతాయి’’ అని చెప్పారు అర్పితా గుప్తా. భయం కాదు... భరోసానివ్వాలి! కొంతమందికి క్లోజ్డ్ లిఫ్ట్ అంటే భయం. బలవంతంగా తీసుకువెళ్లినా కూడా ఊపిరాడనట్లు సతమతమవుతారు. ఇంట్లో వాళ్లు జాగ్రత్త కొద్దీ ‘లిఫ్ట్‌లోకి వెళ్లకు, నీకు ఊపిరాడదు’ అని భయపెడుతుంటారు. లిఫ్ట్‌లో ఏ ప్రమాదమూ రాదని ధైర్యం చెప్పాలి. వారిలో ఆ భయాన్ని పోగొట్టాలంటే ఆత్మీయంగా మాట్లాడాలి. మాటల్లో మాటలుగా ఎప్పటికో అసలు విషయం బయటపడుతుంది. చిన్నప్పుడు ఎప్పుడో తలుపులు, కిటికీలు మూసి ఉన్న గదిలో బంధీ అయి ఉక్కిరి బిక్కిరి కావడం వంటివేవో కారణాలు ఉంటాయి. ఒక పేషెంట్ కోసం గంట– రెండు గంటలు కేటాయించడం డాక్టర్లకు సాధ్యం అయ్యేపని కాదు, అంతేకాదు, ఇలాంటి ఫోబియాలున్న వాళ్లలో చాలామంది పేషెంట్ అనిపించుకోవడం ఇష్టంలేక డాక్టర్ దగ్గరకు వెళ్లరు. ఒక స్నేహితురాలిగా వాళ్లకు ఇష్టమైన టాపిక్ మాట్లాడుతూ వాళ్లంతట వాళ్లే ఓపెన్ అయ్యేలా చూడాలన్నమాట. – అర్పితా కె గుప్తా, చైర్ పర్సన్, డివైన్ స్పేస్ చారిటబుల్ ట్రస్ట్, సైనిక్‌పురి, సికింద్రాబాద్ – వాకా మంజులారెడ్డి – ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
ఫాతిమామాతను స్మరించాలి
పీఠాధిపతి ఉడుముల బాల ముగిసిన నవదిన ఉత్సవాలు కాజీపేట, న్యూస్‌లైన్ : లోక రక్షకుడు యేసు ప్రభువుకు జన్మనిచ్చిన ఫాతిమామాతను దైవజనులందరూ స్మరించాలని కథోలిక మేత్రాసనం పీఠాధిపతి ఉడుముల బాల అన్నారు. కాజీపేట పట్టణంలోని కెథడ్రల్ చర్చి ఆవరణలో జరుగుతున్న నవది న ఫాతిమామాత ఉత్సవాలు గురువారం రాత్రి ముగిశా యి. అంతకుముందు చర్చిలో పీఠాధిపతి ఉడుముల బాల దివ్యబలిపూజ, స్వస్థత ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపాటల పూజకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులనుద్దేశించి ఉడుముల బాల మా ట్లాడారు. కలియుగం ఉన్నంతవరకు ఫాతిమామాత పేరు చిరస్మరణీయంగా ఉంటుందన్నారు. కథోలిక కుటుంబీకులు తమ ఇంట్లో జరిగే శుభకార్యాల్లో ముందుగా యేసుప్రభువుతోపాటు ఫాతిమామాతను స్మరిస్తే ఎలాంటి విఘూ్నలు కలుగవన్నారు. ఆదర్శవంతమైన సమాజ నిర్మాణానికి కథోలిక భక్తులు కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ఉత్సవాలకు హాజరైన భక్తులందరికి పీఠాధిపతి ఆశీస్సులు అందజేశారు. పీఠాధిపతి బాలకు ఘనస్వాగతం.. ఉత్సవాల ముగింపు కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరైన బిషప్ బాలకు కథోలిక ప్రజలు ఘనస్వాగతం పలి కారు. స్థానిక ఫాతిమానగర్ క్రాస్‌రోడ్డు నుంచి వేలాది మం ది భక్తులు పీఠాధిపతికి ఎదురేగి మంగళహారతులు పట్టారు. అనంతరం బ్యాండ్‌మేళాలతో ఆయనను ఊరేగింపుగా తీసుకెళ్లారు. జనసంద్రంగా మారిన కథోలిక కుటుంబీకులను చూ సిన ఉడుముల బాల ఆనందంతో అభివాదం చేశారు. కాగా, ఫాతిమామాత దర్శిని పత్రికను విచారణ గురువులు ఆవిష్కరించి భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. అలాగే జూబెరి యన్ పీఠాధిపతులకు ఘనంగా సన్మానించారు. కాగా, బిషప్ బాలను క్రైస్తవులు, గురువులు, మతకన్యలు పూలమాలలు, శాలువలు, మెమొంటోలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అరుణోదయ యువతా కేంద్రం డెరైక్టర్ ఫాదర్ వినోద్, జోసెఫ్, రాయప్ప, ఫాదర్ జ్యోతిష్, తది తరులు పాల్గొన్నారు. ఉడుముల బాలకు నాయకుల అభినందనలు.. మూడు దశాబ్దాలుగా వివిధ హోదాల్లో కథోలికుల అభివృద్ధి, సంక్షేమం కోసం పీఠాధిపతిగా శ్రమిస్తున్న బిషప్ బాలకు వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, స్టేషన్‌ఘన్‌పూర్, వరంగ ల్ పశ్చిమ ఎమ్మెల్యేలు డాక్టర్ తాటికొండ రాజయ్య, దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఘంటా నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రాజారపు ప్రతాప్, గంగారపు అమృతరావు, మాజీ కార్పొరేటర్ అబూబక్కర్, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి కాయిత రాజ్కుమార్యాదవ్ అభినందనలు తెలి పి ఆశీస్సులు తీసుకున్నారు. ఆడిపాడిన చిన్నారులు.. కాగా, ఫాతిమామాత ముగింపు ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్నారులు ఆడిపాడా రు. యేసుప్రభువు పుట్టుకను వివరిస్తూ పిల్లల ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అహూతులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా, ఉత్సవాల్లో చెవిటి, మూగ విద్యార్థులు ప్రదర్శించిన స్వాగత నృత్యం ప్రతి ఒక్కరిని విశేషంగా ఆకట్టుకుంది. భారీగా మొక్కులు.. పట్టణంలో జరుగుతున్న ఫాతిమామాత ఉత్సవాలు గురువా రం రాత్రి ముగిశాయి. ఉత్సవాలను పురస్కరించుకుని దా దాపు లక్ష మందికి పైగా భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. కాగా, ఉత్సవాల్లో బిషప్ బాల, 120మం ది గురువులు, 150 మంది సిస్టర్లు భాగస్వాములయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులందరికి నిర్వాహకులు ఉచితభోజన, వసతి సౌకర్యాలు కల్పించారు. ఉత్సవాల్లో కాజీపేట సీఐ పురుషోత్తం, ఎస్సైలు వెంకట్రావు, రామారా వు ఆధ్వర్యంలో సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.