సాక్షి, హన్మకొండ: వీధి కుక్కలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఏ వీధిలో చూసిన గుంపులు గుంపులుగా తిరుగుతూ రోడ్లపై వెళ్తున్న పాదచారులు, వాహనాదారుల వెంటపడి తీవ్రంగా కరుస్తున్నాయి. ఇటీవల కాలంలో కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రతిరోజు ఏదో ఒక చోట వరుస ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా చిన్నారులపై విచక్షణారహితంగా దాడి చేసి వారి ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నాయి.
తాజాగా హన్మకొండ జిల్లా కాజీపేటలో వీధికుక్కలు మరో బాలుడి ప్రాణాలు తీశాయి. వీధికుక్కలు దాడి చేయడంతో ఎనిమిదేళ్ల బాలుడు మృత్యువాతపడ్డాడు. రైల్వే క్వార్టర్స్‌లోని చిల్డ్రన్స్ పార్క్ వద్ద ఆడుకుంటుండగా మల్కాన్ సింగ్, సునీత దంపతుల కుమారుడు చోటు అనే చిన్నారిపై కుక్కలు దాడి చేశాయి. దీంతో తీవ్ర గాయాలపాలైన బాలుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించారు.
కాగా పని కోసం మల్కాన్ సింగ్ కుటుంబం గురువారమే యూపీ నుంచి ఖాజీపేటకు వలస వచ్చారు. వీరు నగరంలో ఉంగరాలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. పొట్ట కూటికోసం వస్తే.. మరుసటి రోజే కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఎమ్మెల్యే పరామర్శ
కాజీపేటలో కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాలుడి కుటుంబాన్ని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి పరామర్శించారు. మృతుడి కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. మృతదేహాన్ని స్వంత ఖర్చులతో యూపీకి తరలించారు. నగరంలో ఒక్కో వాడలో 200 వరకు కుక్కలు ఉన్నాయని, కుక్కలను చంపడం నేరం కావడంతో వాటి సంతతిని కంట్రోల్ చేసే చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు.
కుక్కలకు కేర్ సెంటర్ ఏర్పాటు చేసి వాటికి వ్యాధులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కుక్కల దాడుల నివారణ కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాన్ని రప్పిస్తామన్నారు ఇదిలా ఉంటే గడిచిన 20 రోజుల్లో వరంగల్ జిల్లాలో ఇద్దరు కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోవడం, పలువురు గాయపడ్డడం కలకలం సృష్టిస్తుంది.
చదవండి: పైళ్లెన వారం రోజులకే విషాదం నింపిన క్షణికావేశం
Comments
Please login to add a commentAdd a comment