childrens park
-
కాజీపేటలో దారుణం.. వీధికుక్కల దాడిలో బాలుడి మృతి
సాక్షి, హన్మకొండ: వీధి కుక్కలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఏ వీధిలో చూసిన గుంపులు గుంపులుగా తిరుగుతూ రోడ్లపై వెళ్తున్న పాదచారులు, వాహనాదారుల వెంటపడి తీవ్రంగా కరుస్తున్నాయి. ఇటీవల కాలంలో కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రతిరోజు ఏదో ఒక చోట వరుస ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా చిన్నారులపై విచక్షణారహితంగా దాడి చేసి వారి ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నాయి. తాజాగా హన్మకొండ జిల్లా కాజీపేటలో వీధికుక్కలు మరో బాలుడి ప్రాణాలు తీశాయి. వీధికుక్కలు దాడి చేయడంతో ఎనిమిదేళ్ల బాలుడు మృత్యువాతపడ్డాడు. రైల్వే క్వార్టర్స్‌లోని చిల్డ్రన్స్ పార్క్ వద్ద ఆడుకుంటుండగా మల్కాన్ సింగ్, సునీత దంపతుల కుమారుడు చోటు అనే చిన్నారిపై కుక్కలు దాడి చేశాయి. దీంతో తీవ్ర గాయాలపాలైన బాలుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించారు. కాగా పని కోసం మల్కాన్ సింగ్ కుటుంబం గురువారమే యూపీ నుంచి ఖాజీపేటకు వలస వచ్చారు. వీరు నగరంలో ఉంగరాలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. పొట్ట కూటికోసం వస్తే.. మరుసటి రోజే కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎమ్మెల్యే పరామర్శ కాజీపేటలో కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాలుడి కుటుంబాన్ని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి పరామర్శించారు. మృతుడి కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. మృతదేహాన్ని స్వంత ఖర్చులతో యూపీకి తరలించారు. నగరంలో ఒక్కో వాడలో 200 వరకు కుక్కలు ఉన్నాయని, కుక్కలను చంపడం నేరం కావడంతో వాటి సంతతిని కంట్రోల్ చేసే చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. కుక్కలకు కేర్ సెంటర్ ఏర్పాటు చేసి వాటికి వ్యాధులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కుక్కల దాడుల నివారణ కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాన్ని రప్పిస్తామన్నారు ఇదిలా ఉంటే గడిచిన 20 రోజుల్లో వరంగల్ జిల్లాలో ఇద్దరు కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోవడం, పలువురు గాయపడ్డడం కలకలం సృష్టిస్తుంది. చదవండి: పైళ్లెన వారం రోజులకే విషాదం నింపిన క్షణికావేశం -
బీచ్‌రోడ్‌లో స్కూల్ బస్ బీభత్సం
► జనాలపైకి దూసుకెళ్లిన బస్సు ► ఒకరు మృతి, 8 మందికి గాయాలు ► ముగ్గురు పరిస్థితి విషమం సమయం.. రాత్రి 8 గంటలు.. వేసవి సెలవులు, ఆపై ఆదివారం.. ఉదయం నుంచి భానుడు భగ్గుమనడంతో సేద తీరేందుకు పెద్దసంఖ్యలో జనం సాగరతీరానికి చేరుకున్నారు. అంతా ఉత్సాహంతో కేరింతలు కొడుతున్నారు. చిల్డ్రన్ పార్క్ ఎదురుగా బీచ్‌రోడ్డు గోడపై కూర్చొని కబుర్లు చెప్పుకొంటున్నారు. ఇంతలో.. నోవాటెల్ డౌన్ నుంచి ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు మృత్యుశకటంలా దూసుకొచ్చింది. ఎదురుగా ఉన్న వారిని ఢీకొట్టింది.. కేరింతలు కాస్తా.. హాహాకారాలుగా మారిపోయాయి. బీచ్ రోడ్డు భీతావహంగా మారిపోయింది. సాగరతీరం కన్నీటి సంద్రమైంది. ప్రమాదానికి కారణమైన బస్సు ఒకరిని పొట్టన పెట్టుకోగా, ముగ్గురు మృత్యువుతో పోరాడుతున్నారు. మరో ఐదుగురు గాయపడ్డారు. విశాఖ సిటీ/బీచ్‌రోడ్/జగదాంబ : బీచ్‌రోడ్డులో ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఘోర ప్రమాదం సంభవించింది. శ్రీ ప్రకాష్ విద్యాసంస్థకు చెందిన బస్సు నోవాటెల్ డౌన్ నుంచి వేగంగా దూసుకొచ్చి బీచ్ రోడ్డు గట్టుపై కూర్చొన్న వారిపైకి వెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులకు కేజీహెచ్‌లో చికిత్స అందిస్తుండగా, పరిస్థితి విషమంగా ఉన్నవారిని మెరుగైన వైద్యం కోసం సెవెన్‌హిల్స్ ఆస్పత్రికి తరలించారు. మరణించిన వ్యక్తి విజయవాడ అదనపు ఎస్పీ దూసి నందకిశోర్ తండ్రి దూసి ధర్మారావు(85)గా గుర్తించారు. నందకిశోర్ గృహప్రవేశం కావడంతో కుటుంబమంతా విశాఖ వచ్చారు. బంధువులతో కలసి సాయంత్రం అంతా బీచ్‌కు రాగా ఈ దుర్ఘటన సంభవించింది. గాయపడిన వారిలో ఏడీఎస్పీ నందకిశోర్ సహా, ఆయన కుమారుడు దేవగురు, కుమార్తె మంజీర కూడా ఉన్నారు. వీరిలో కుమారుడు దేవగురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. గాయపడిన వారిలో విజయవాడకు చెందిన దేవరగట్టు పద్మావతి, దేవరగట్టు ప్రసాదరావు, ఒకే కుటుంబానికి చెందిన పైడిపాల వెంకట్, పైడిపాల సునీత, పైడిపాల వేణుగోపాల్, అన్నపూర్ణ ఉన్నారు. వీరితో సహా గాజువాకు చెందిన తీడ శ్రీకర్ అనే తొమ్మిదో తరగతి విద్యార్థికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ పల్లి కృష్ణారావు, కింజరాపు కేశవకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రత ధాటికి బీచ్ గోడ ధ్వంసం కాగా.. అక్కడే పార్క్ చేసి ఉన్న నాలుగు ద్విచక్ర వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. రచయితను కోల్పోయిన ఉత్తరాంధ్ర విశాఖ సిటీ : బీచ్‌రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన దూసి ధర్మారావు ప్రముఖ రచయిత. శ్రీకాకుళం జిల్లా దూసి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఇంగ్లిష్ అధ్యాపకుడు ధర్మారావు. ప్రస్తుతం జిల్లాలో ఇంటాక్ శ్రీకాకుళం ఛాప్టర్ కన్వీనర్‌గా పని చేస్తూ జిల్లాలోని ప్రాచీన సాహితీ, సాంస్కృతిక పరిరక్షణకు సేవలు అందిస్తున్నారు. ఇటీవల ఆయన రచించిన ‘సామ్రాట్ చోడ గాంగ’ చారిత్రాత్మక నాటకం ఆకాశవాణి నాటకోత్సవాల్లో మార్చి 23వ తేదీన ఉదయం 9.30 గంటలకు ప్రసారమైంది. ఆయన తాళపత్ర గ్రంథాల సేకరణకు చాలా కృషి చేశారు. సుమారు 15 వరకూ రచనలు చేశారు. శ్రీకాకుళం జిల్లా విశేషాలు, సామాజిక వ్యవహారాలు, చరిత్ర పై ధర్మారావు రాసిన పుస్తకాలు ప్రశంసలు అందుకున్నాయి. ఈయన మృతితో ఉత్తరాంధ్ర కలం మూగబోయింది. కుమారుడి గృహప్రవేశానికి వచ్చి.. మృత్యుఒడి చేరిన దూసి ధర్మారావు కొద్దిగంటల క్రితం వరకు మామిడి తోరణాలతో కళకళలాడిన ఆ ఇల్లు శోకనిలయమైంది. కుమారుడి గృహప్రవేశానికి ఎంతో ఆనందంగా వచ్చిన ఆ తండ్రి మృత్యుశకటానికి బలయ్యారు. రెప్పపాటులో జరిగిన ప్రమాదం ఆ ఇంటి పెద్దను మృత్యుఒడికి చేర్చింది. బంధువులతో కలసి సరదాగా సాగరతీరానికి వెళ్లిన శ్రీకాకుళానికి చెందిన ప్రముఖ కవి, రచయిత దూసి ధర్మారావు (85) తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ధర్మారావు కోరికపైనే.. విజయవాడలో అదనపు ఎస్పీగా పని చేస్తున్న నంద కిశోర్ మధురవాడలో కొత్త ఫ్లాట్ కొనుగోలు చేశారు. శనివారం గృహప్రవేశం చేశారు. బంధువులంతా ఉండడంతో బీచ్‌కు వెళ్దామని ధర్మారావే కోరారు. దీంతో కుటుంబ సభ్యులంతా బీచ్‌కు వచ్చారు. మొదట వేరే స్థలంలో కూర్చున్న కుటుంబసభ్యులు వారి పక్కన నీరు ఉందని, అక్కడి నుంచి గోడ వద్దకు వచ్చి కూర్చున్నారు. చిన్నాన్న బతికించాడు వేసవి సెలవులకు శ్రీకర్ ఇక్కడికి వచ్చాడు. సోమవారం విజయనగరం వెళ్లవలసి ఉంది. బీచ్‌కు వెళ్దామని కోరడంతో గాజువాక నుంచి మేం కుటుంబం అంతా కలసి బీచ్‌కు వచ్చాం. బస్సు దూసుకు వస్తున్న సమయంలో శ్రీకర్ చిన్నాన్న చూసి వెంటనే అతన్ని పక్కకి లాగటంతో తీవ్ర గాయాలైనా, బతికి బయటపడ్డాడు. – జి.సత్యవతి, టి.శ్రీకర్ బంధువు పరిశీలించిన కమిషనర్ ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే నగర పోలీస్ కమిషనర్ æయోగానంద్ ఘటనా స్థలిని పరిశీలించారు. ఆదివారం కావడంతో బీచ్ రోడ్డులో పోలీస్ బందోబస్తు ఎక్కువగా ఉండటంతో, ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు స్పందించి క్షతగాత్రులను హుటాహుటిన 108 వాహనంలో ఆస్పత్రికి తరలించగలిగారు. ప్రమాద తీవ్రతను పరిశీలించిన సీపీ, బస్సు కండిషన్‌ను పరిశీలించాలని రవాణాశాఖ అధికారులకు సూచించారు. రవాణాశాఖ అధికారులు బస్సుని పరిశీలించారు. -
తిరుమలలో కొండచిలువ కలకలం
తిరమల: తిరుమలలో మంగళవారం ఓ కొండచిలువ స్థానికులను హడలెత్తించింది. 8 అడుగుల కొండచిలువ కనిపించడం కలకలం సృష్టించింది. స్థానిక చిల్డ్రన్స్ పార్క్ వద్ద స్థానికులు కొండచిలువను గమనించారు. వెంటనే టీటీడీ అధికారులకు సమాచారం అందించడంతో వారు అప్రమత్తమై పాములను పట్టేవ్యక్తికి సమాచారం అందించారు. అతను చాకచక్యంగా కొండచిలువను పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
నేటి నుంచి ‘ఇంటింటికీ యోగా’
►11 ఏరియాల్లో 30వ తేదీ వరకు ► బెంగళూరు నుంచి యోగాచార్యుల రాక ► ఉదయం, సాయంత్రం శిక్షణ కొత్తగూడెం(ఖమ్మం) : సింగరేణి యూజమాన్యం కార్మిక సంక్షేమానికి చేపట్టిన ‘మీకోసం -మీ ఆరోగ్యం కోసం’లో భాగంగా ఆదివారం నుంచి ఈనెల 30 వరకు కార్మికవాడల్లో ‘ఇంటింటికీ యోగా’ కార్యక్రమం నిర్వహిస్తోం ది. కంపెనీ వ్యాప్తంగా 11 ఏరియూల్లో వారం రోజుల పాటు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో కార్మికులు, వారి కుటుంబ సభ్యుల కు యోగా శిక్షణ ఉంటుంది. బెంగళూరుకు చెందిన శ్రీవివేకానంద యోగా యూనివర్సిటీ యోగాచార్యులు, పతంజలి యోగా సమితి, అరుణ యోగా సంస్థలకు చెందినవారు శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం నాలుగు రోజు లుగా సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిం చారు. అధికారులు, సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేయడం, మైకు ద్వారా ప్రచారం చేయడంతోపాటు గనుల వద్ద సమావేశాలు నిర్వహించారు. కొత్తగూడెంలో.. కొత్తగూడెం కార్పొరేట్ పరిధిలోని బాబుక్యాం పు పార్కులో ఉదయం 5.30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు, సాయంత్రం బస్టాండ్ వద్దగల చిల్డ్రన్స్‌పార్కు వద్ద 6 నుంచి 7 గంట ల వరకు, ఏరియా పరిధిలోని ప్రగతివనం పా ర్కులో శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. -
చోరోంకా.. షోరూం!
ఇక్కడ కనిపిస్తున్న బైక్‌లను చూసి షోరూంలో ప్రదర్శనకు పెట్టారనుకుంటే పప్పులే కాలేసినట్టే. నెల్లూరుకు చెందిన ఇద్దరు యువకులు అపహరించిన బైక్‌లు ఇవి. దొంగతనాలు పెరిగిపోయిన నేపథ్యంలో పోలీసులు నిఘా పెట్టడంతో వీరు దొరికిపోయారు. బేల్దారి పనివారైన వీరు 27 బైక్‌లు చోరీ చేయడంతో పోలీసులు కూడా అవాక్కయ్యారు. నెల్లూరు (క్రైమ్) : బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని నగరంలోని చిల్డ్రన్స్‌పార్క్ వద్ద బాలాజీనగర్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ పరేడ్ మై దానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో పోలీసు అధికారులు నిందితుల వివరాలను వెల్లడించారు. దుత్తలూరు మండలం బ్రహ్మేశ్వరాకి చెందిన సూరే మహదేవ్ అలియాస్ మాధవ్ బేల్దారి పనులు చేసుకుంటూ ఉపాధి నిమిత్తం నాలుగేళ్ల కిందట నగరంలోని జాకీర్ హుస్సేన్‌నగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. వెంకటేశ్వపురానికి చెందిన పుట్టాల శ్రీని వాసులు అలియాస్ చిన్న బేల్దారి (కప్బోర్డు) పను లు చేస్తున్నాడు. పనుల వద్ద వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. కొద్దికాలంలోనే జల్సాలకు అలవాటు పడ్డారు. సులభ మార్గంలో డబ్బులు సంపాదించాలని బైక్ దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. నగరంలోని బాలాజీనగర్, ఒకటి, రెండు, మూడో నగర పోలీసుస్టేషన్ పరిధిలో రోడ్లపై నిలి పి ఉంచిన బైక్‌లను తస్కరించి నెల్లూరు, ప్రకాశం జిల్లాలో అమ్మివేసి వచ్చిన డబ్బుతో జల్సాగా విలాసవంతమైన జీవనం సాగిస్తున్నారు. ఇటీవల నగరంలో బైక్ దొంగతనాలు జరుగుతుండటంతో పోలీసులు అప్రమత్తమైయ్యారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. శుక్రవారం చిల్డ్రన్స్‌పార్క్ వద్ద నిందితులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ జి. మంగారావు, తన సిబ్బందితో కలి సి అదుపులోకి తీసుకుని విచారించగా 27 బైక్‌లను దొంగలించినట్లు అంగీకరించారు. ఆ బైక్‌లను స్వాధీ నం చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. బైక్‌ల విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుంది. సిబ్బందికి రివార్డులు : నిందితులను అరెస్ట్ చేసి చోరీ సొత్తు రికవరీ చేయడానికి కృషి చేసిన బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ జి. మంగారావు, ఎస్ఐలు డి. జగన్మోహన్రావు, ఎ. నాగేశ్వరరావు, సిబ్బందిని ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్ అభినందించి రివార్డులు ప్రకటించారు. సమావేశంలో ఏఎస్పీ రెడ్డి గంగాధర్‌రావు, నగర డీఎస్పీ పి. వెంకటనాథ్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.