Published
Tue, Sep 13 2016 11:41 AM
| Last Updated on Mon, Sep 4 2017 1:21 PM
తిరుమలలో కొండచిలువ కలకలం
తిరమల: తిరుమలలో మంగళవారం ఓ కొండచిలువ స్థానికులను హడలెత్తించింది. 8 అడుగుల కొండచిలువ కనిపించడం కలకలం సృష్టించింది. స్థానిక చిల్డ్రన్స్ పార్క్ వద్ద స్థానికులు కొండచిలువను గమనించారు. వెంటనే టీటీడీ అధికారులకు సమాచారం అందించడంతో వారు అప్రమత్తమై పాములను పట్టేవ్యక్తికి సమాచారం అందించారు. అతను చాకచక్యంగా కొండచిలువను పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.