వెంకన్న సన్నిధిలో గురువారం కొండచిలువ హల్‌చల్ చేసింది. పాపవినాశం వెళ్తున్న భక్తులు కొండ చిలువను చూసి భయాందోళనలకు గురయ్యారు. సుమారు పది అడుగుల పొడవు ఉన్న కొండ చిలువను చూసిన జనం పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న వెంటనే స్పందించిన అధికారులు పాముని పట్ట్టి అడవిలో వదిలేశారు. నిన్న నడక దారిలో నాగుపాము కలకలం రేపడం.. ఈ రోజు కొండచిలువ కనిపించడంతో.. భక్తులు ఆందోళనకు గురవుతున్నారు.
తిరుమలలో కొండచిలువ హల్‌చల్
Published Thu, Jun 23 2016 2:28 PM | Last Updated on Mon, Sep 4 2017 3:13 AM
Advertisement
Advertisement