చోరోంకా.. షోరూం!
ఇక్కడ కనిపిస్తున్న బైక్‌లను చూసి షోరూంలో ప్రదర్శనకు పెట్టారనుకుంటే పప్పులే కాలేసినట్టే. నెల్లూరుకు చెందిన ఇద్దరు యువకులు అపహరించిన బైక్‌లు ఇవి. దొంగతనాలు పెరిగిపోయిన నేపథ్యంలో పోలీసులు నిఘా పెట్టడంతో వీరు దొరికిపోయారు. బేల్దారి పనివారైన వీరు 27 బైక్‌లు చోరీ చేయడంతో పోలీసులు కూడా అవాక్కయ్యారు.
నెల్లూరు (క్రైమ్) : బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని నగరంలోని చిల్డ్రన్స్‌పార్క్ వద్ద బాలాజీనగర్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ పరేడ్ మై దానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో పోలీసు అధికారులు నిందితుల వివరాలను వెల్లడించారు. దుత్తలూరు మండలం బ్రహ్మేశ్వరాకి చెందిన సూరే మహదేవ్ అలియాస్ మాధవ్ బేల్దారి పనులు చేసుకుంటూ ఉపాధి నిమిత్తం నాలుగేళ్ల కిందట నగరంలోని జాకీర్ హుస్సేన్‌నగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. వెంకటేశ్వపురానికి చెందిన పుట్టాల శ్రీని వాసులు అలియాస్ చిన్న బేల్దారి (కప్‌బోర్డు) పను లు చేస్తున్నాడు. పనుల వద్ద వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. కొద్దికాలంలోనే జల్సాలకు అలవాటు పడ్డారు. సులభ మార్గంలో డబ్బులు సంపాదించాలని బైక్ దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. నగరంలోని బాలాజీనగర్, ఒకటి, రెండు, మూడో నగర పోలీసుస్టేషన్ పరిధిలో రోడ్లపై నిలి పి ఉంచిన బైక్‌లను తస్కరించి నెల్లూరు, ప్రకాశం జిల్లాలో అమ్మివేసి వచ్చిన డబ్బుతో జల్సాగా విలాసవంతమైన జీవనం సాగిస్తున్నారు. ఇటీవల నగరంలో బైక్ దొంగతనాలు జరుగుతుండటంతో పోలీసులు అప్రమత్తమైయ్యారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. శుక్రవారం చిల్డ్రన్స్‌పార్క్ వద్ద నిందితులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా బాలాజీనగర్ ఇన్‌స్పెక్టర్ జి. మంగారావు, తన సిబ్బందితో కలి సి అదుపులోకి తీసుకుని విచారించగా 27 బైక్‌లను దొంగలించినట్లు అంగీకరించారు. ఆ బైక్‌లను స్వాధీ నం చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. బైక్‌ల విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుంది.
సిబ్బందికి రివార్డులు : నిందితులను అరెస్ట్ చేసి చోరీ సొత్తు రికవరీ చేయడానికి కృషి చేసిన బాలాజీనగర్ ఇన్‌స్పెక్టర్ జి. మంగారావు, ఎస్‌ఐలు డి. జగన్మోహన్‌రావు, ఎ. నాగేశ్వరరావు, సిబ్బందిని ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్ అభినందించి రివార్డులు ప్రకటించారు. సమావేశంలో ఏఎస్పీ రెడ్డి గంగాధర్‌రావు, నగర డీఎస్పీ పి. వెంకటనాథ్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.