Bike Thefts
-
ద్విచక్రవాహనాల దొంగ అరెస్ట్
మహబూబ్‌నగర్ క్రైం: ఆటో నడుపుతూ జల్సాలకు అలవాటుపడిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనాలు దొంగతనాలు చేయడం ప్రారంభించి.. పోలీసులకు దొరికిపోయాడు. జిల్లాలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడిన నిందితుడిని రాజాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి సోమవారం మహబూబ్‌నగర్ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కె.నరసింహ వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా విద్యానగర్‌కాలనీకి చెందిన తాయి ప్రశాంత్‌కుమార్ ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. ఈక్రమంలో అతను సుభద్ర అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఆ విషయం భార్యకు తెలిసి ఇద్దరు పిల్లలను చెరువులో తోసి ఆమె చెరువులో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇద్దరు పిల్లలు మృతి చెందగా ఆమె బతకగా.. పోలీసులు జైలుకు పంపారు. దీంతో తాయి ప్రశాంత్‌కుమార్, సుభద్రను తీసుకుని మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని లక్ష్మీనగర్‌కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో జీవనం కోసం చిన్న చిన్న పనులు చేస్తే వచ్చిన డబ్బులు సరిపోవడం లేదని బైక్ దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. మొదట రాజాపూర్‌లో మూడు, రంగారెడ్డిగూడలో రెండు, జడ్చర్లలో ఒకటి, షాద్‌నగర్‌లో రెండు, హయత్‌నగర్‌లో ఒకటి, కొత్తూర్‌లో ఒకటి, మైలార్‌దేవ్‌పల్లిలో ఒక బైక్‌తోపాటు సూర్యాపేటలో ఒక ఆటోను చోరీ చేశాడు. దొంగతనం చేసిన వాహనాలు అన్నింటిని తీసుకువచ్చి లక్ష్మీనగర్‌కాలనీలో అద్దెకు ఉంటున్న ఇంట్లో పెట్టుకున్నాడు. సోమవారం ఉదయం స్కూటీపై హైదరాబాద్ వెళ్తుండగా రాజాపూర్ పోలీసులు చేసిన వాహన తనిఖీల్లో పట్టుబడగా విచారిస్తే దొంగతనాలు బయటపడినట్లు ఎస్పీ తెలిపారు. అతని నుంచి మొత్తం 11 ద్విచక్రవాహనాలు, ఒక ఆటోను రికవరీ చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. ఇతను 2019లో సూర్యాపేటలో ఆటో దొంగతనం కేసులో జైలుశిక్ష అనుభవించినట్లు వెల్లడించారు. ప్రతి వాహనదారుడు వారికి సంబంధించిన వాహనాలకు జీపీఏ సిస్టంతోపాటు ఇంటి ఎదుట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇటీవల కాలంలో జిల్లాలో 40 దొంగతనం కేసులు ఛేదించినట్లు వివరించారు. సమావేశంలో ఏఎస్పీ రాములు, డీఎస్పీ లక్ష్మణ్, సీఐలు జమ్ములప్ప, ఇఫ్తేకార్, ఎస్ఐలు వెంకట్‌రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
క్రికెట్ బెట్టింగ్: మైనర్లు కాదు..ముదుర్లు!
ఆదోని అర్బన్(కర్నూలు జిల్లా): చక్కగా చదువుకుని మంచి భవిష్యత్‌ను నిర్మించుకోవాల్సిన విద్యార్థులు వారు. చెడు అలవాట్లకు బానిసై కటకటాల పాలయ్యారు. క్రికెట్ బెట్టింగ్‌ల కోసం అప్పులు చేసి, వాటిని తీర్చేందుకు మోటారు సైకిళ్లు చోరీ చేసి పోలీసులకు దొరికిపోయారు. ఆదోని టూ టౌన్ సీఐ శ్రీరాములు వారిని అరెస్ట్ చూపుతూ శనివారం వివరాలు వెల్లడించారు. ఆదోని పట్టణం ఎస్కేడీ కాలనీకి చెందిన విష్ణు పదో తరగతి చదువుతున్నాడు. పత్తికొండకు చెందిన ఎజాజ్ ఇంటర్ చదువుతూ ఆదోని పట్టణంలోని కార్వన్ పేటలో బంధువుల ఇంట్లో ఉంటున్నాడు. క్రికెట్ ఆడుతూ వీరు స్నేహితులయ్యారు. ఇద్దరూ కలిసి గతంలో ఐపీఎల్ బెట్టింగ్ ఆడుతూ ఒక్కొక్కరు రూ.15వేలు అప్పు చేశారు. అప్పుల వారి బాధతాళలేక ఏం చేస్తే డబ్బు వస్తుందని ఆలోచనలో పడి తుదకు బైక్ దొంగలుగా మారారు. స్ప్లెండర్ ప్లస్ బైక్ దొంగలిస్తే వెంటనే అమ్ముడవుతుందని పథక రచన చేసుకున్నారు. అలా మూడు బైక్‌లను దొంగలించారు. రెండు బైక్‌లను ఆదోని పట్టణంలో పాడుబడ్డ ఈఎస్ఐ ఆస్పత్రి బంగ్లాలో దాచిపెట్టారు. మరొక బైక్‌ను అమ్మేందుకు పత్తికొండకు వెళ్లారు. అక్కడ అమ్ముడుపోకపోవడంతో తిరిగి ఆదోనికి వస్తుండగా ఆస్పరి రోడ్డులో పోలీసులు పట్టుకున్నారు. విచారణలో బైకులు అపహరించినట్లు చెప్పారు. వీరి నుంచి మూడు బైకులు స్వాదీనం చేసుకున్నట్లు సీఐ చెప్పారు. చదవండి: పెళ్లి పేరుతో యువతి మోసం.. రూ.ఆరు లక్షలతో పరార్ దారుణంగా హత్య చేసి.. గుంతలో పడేసి.. -
భార్య కోరికల్ని తీర్చటానికి ఓ భర్త..
సూరత్ : భార్య డిమాండ్లను నెరవేర్చటానికి దొంగ అవతారం ఎత్తాడో భర్త. ఆమెకు విలాసవంతమైన జీవితాన్ని అందించటానికి బైకులు దొంగతనాలు చేస్తూ చివరకు జైలు పాలయ్యాడు. ఈ సంఘటన గుజరాత్లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భావ్‌నగర్ జిల్లా జలియ గ్రామానికి చెందిన బల్వంత్ చౌహాన్ వజ్రాలకు మెరుగులుదిద్దే పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడి భార్యకు వారి సాధారణ జీవితం నచ్చలేదు. తన జీవితాన్ని ధనవంతురాలైన ఆమె అక్క జీవితంతో పోల్చుకునేది. బిల్డర్ అయిన అక్క భర్తతో తన భర్తకు సాటికట్టేది. ప్రతి రోజు మూతి విరుపులు, దెప్పిపొడుపులు మామూలైపోయాయి. పోలీసులు స్వాధీనం చేసుకున్న బైకులు దీంతో ఆమె పోరు భరించలేక బైకుల దొంగతనాలు మొదలుపెట్టాడు. అయితే లాక్డౌన్ కారణంగా ఉద్యోగం పోవటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో బైకుల దొంగతనాలను మొదలుపెట్టాడు. 2017లో మొదటిసారి బైకు దొంగతనం చేశాడు. అనంతరం 2019లో నాలుగు.. 2020లో ఏకంగా 25 బైకుల్ని దొంగిలించాడు. ఆదివారం బైకు దొంగతనం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. -
‘జల్సా’ దొంగల అరెస్ట్
మడకం సూర్యప్రకాష్, అజ్మీరా మహేంద్ర నాయక్. మరో ఇద్దరు బాలురు (మైనర్లు) ఈ నలుగురూ.. డిప్లొమా విద్యార్థులు. ‘బిడ్డల్లారా.. బాగా చదువుకోండర్రా..’ అని, తల్లిదండ్రులు ఖమ్మం పంపించారు. కానీ, వీరు ఏం చేశారో తెలుసా...? జల్సాలకు అలవాటుపడ్డారు. దొంగతనాలకు తెగబడ్డారు. పోలీసులకు చిక్కారు. తమ తల్లిదండ్రులు తల దించుకునేలా చేశారు. ఖమ్మంక్రైం: ఖమ్మంలో డిప్లొమా చదువుతున్న నలుగురు విద్యార్థులు, జల్సాలకు అలవాటుపడ్డారు. డబ్బు కోసం దొంగతనాలకు తెగబడ్డారు. చివరికి, పోలీసులకు చిక్కారు. ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్లో బుధవారం విలేకరుల సమావేశంలో ఏసీపీ వెంకట్రావ్ వెల్లడించిన వివరాలు... పాల్వంచ రూరల్ మండలం వీరునాయక్ తండాకు చెందిన మడకం సూర్యప్రకాష్, అజ్మీరా మహేంద్ర నాయక్, మరో ఇద్దరు మైనర్లు ఖమ్మంలో డిప్లొమా చదువుతున్నారు. వీరు జల్సాలకు అలవాటుపడ్డారు. డబ్బు కోసం ద్విచక్ర వాహనాలను చోరీ చేయసాగారు. ఖమ్మం టూటౌన్ పరిధిలో ఐదు, ఖమ్మం వన్ టౌన్ పరిధిలో రెండు, ఖమ్మం త్రీ టౌన్ పరిధిలో రెండు, ఖానాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి చొప్పున ద్విచక్ర వాహనాలను చోరీ చేశారు. వీటిని తక్కువ రేటుకు అమ్మి, వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవారు. రద్దీ ప్రాంతాలే టార్గెట్ రద్దీగా ఉన్న ప్రాంతాలనే వీరు లక్ష్యంగా ఎంచుకున్నారు. నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను చోరీ చేశారు. పాల్వంచ నవభారత్ ముందు పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను కూడా చోరీ చేశారు. ఇలా దొరికారు అడిషనల్ డీసీపీ వెంకట్రావ్ ఆదేశాలతో టూటౌన్ సీఐ రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ యల్లయ్య, సిబ్బంది కలిసి నిఘా పెట్టారు. ఖమ్మంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద బుధవారం వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా వెళుతున్న సూర్యప్రకాష్, మహేంద్ర నాయక్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో వ్యవహారం బయటపడింది. వీరితోపాటు మరో ఇద్దరు మైనర్లను కూడా అరెస్ట్ చేశారు. వీరి నుంచి ద్విచక్ర వాహనాలను స్వాధీనపర్చుకున్నారు. వీటి విలువ రూ.4.70లక్షలు ఉంటుందని అంచనా. ఈ కేసులో పురోగతి సాధించిన సీఐ రాజిరెడ్డి, ఎస్ఐ యల్లయ్య, ఏఎస్ఐ సుబ్బారావు, హెడ్ కానిస్టేబుళ్లు రామచంద్ర నాయక్, బుచ్చయ్య నాయక్, కానిస్టేబుళ్లు రాజు నాయక్, సైదులు, భాస్కర్‌కు రివార్డులు అందించారు. సమావేశంలో సీఐలు వెంకన్నబాబు, నాగేంద్రచారి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
బైక్ దొంగలు అరెస్ట్
హైదరాబాద్: పార్కింగ్ చేసి ఉన్న వాహనాలను ఎత్తుకెళ్తున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 19 ద్విచక్రవాహనాలను ఎత్తుకెళ్లారు. నగరంలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీపీ సాయిశేఖర్ వివరాలు తెలిపారు. నగరంలో ఇళ్ల ముందు పార్క్ చేసి ఉన్న వాహనాలను టార్కెట్ చేసి దొంగతనాలకు పాల్పడే వారు. బాధితులు ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి నిందితులను అరెస్టు చేసినట్టు డీసీపీ తెలిపారు. -
దొంగగా మారిన హోంగార్డు
-
తిరుపతిలో అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
తిరుపతి: నగరంలో దొంగల ముఠాల ఆగడాలు రోజురోజుకీ మితిమీరుతున్నాయి. అంతరాష్ట్ర దొంగల ముఠా ఆగడాలను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం ఎప్పుటికప్పుడూ చర్యలు చేపడుతూనే ఉంది. ఈ చర్యల్లో భాగంగా తిరుపతిలో బుధవారం ఏడు మంది అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బైక్ దొంగతనాలు చేస్తుండగా పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. వీరినుంచి 20 బైకులు, 2 కంప్యూటర్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పట్టుబడిన ఏడుమంది దొంగలలో 6మంది విద్యార్థులు ఉండటం విశేషం. -
చోరోంకా.. షోరూం!
ఇక్కడ కనిపిస్తున్న బైక్‌లను చూసి షోరూంలో ప్రదర్శనకు పెట్టారనుకుంటే పప్పులే కాలేసినట్టే. నెల్లూరుకు చెందిన ఇద్దరు యువకులు అపహరించిన బైక్‌లు ఇవి. దొంగతనాలు పెరిగిపోయిన నేపథ్యంలో పోలీసులు నిఘా పెట్టడంతో వీరు దొరికిపోయారు. బేల్దారి పనివారైన వీరు 27 బైక్‌లు చోరీ చేయడంతో పోలీసులు కూడా అవాక్కయ్యారు. నెల్లూరు (క్రైమ్) : బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని నగరంలోని చిల్డ్రన్స్‌పార్క్ వద్ద బాలాజీనగర్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ పరేడ్ మై దానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో పోలీసు అధికారులు నిందితుల వివరాలను వెల్లడించారు. దుత్తలూరు మండలం బ్రహ్మేశ్వరాకి చెందిన సూరే మహదేవ్ అలియాస్ మాధవ్ బేల్దారి పనులు చేసుకుంటూ ఉపాధి నిమిత్తం నాలుగేళ్ల కిందట నగరంలోని జాకీర్ హుస్సేన్‌నగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. వెంకటేశ్వపురానికి చెందిన పుట్టాల శ్రీని వాసులు అలియాస్ చిన్న బేల్దారి (కప్బోర్డు) పను లు చేస్తున్నాడు. పనుల వద్ద వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. కొద్దికాలంలోనే జల్సాలకు అలవాటు పడ్డారు. సులభ మార్గంలో డబ్బులు సంపాదించాలని బైక్ దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. నగరంలోని బాలాజీనగర్, ఒకటి, రెండు, మూడో నగర పోలీసుస్టేషన్ పరిధిలో రోడ్లపై నిలి పి ఉంచిన బైక్‌లను తస్కరించి నెల్లూరు, ప్రకాశం జిల్లాలో అమ్మివేసి వచ్చిన డబ్బుతో జల్సాగా విలాసవంతమైన జీవనం సాగిస్తున్నారు. ఇటీవల నగరంలో బైక్ దొంగతనాలు జరుగుతుండటంతో పోలీసులు అప్రమత్తమైయ్యారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. శుక్రవారం చిల్డ్రన్స్‌పార్క్ వద్ద నిందితులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ జి. మంగారావు, తన సిబ్బందితో కలి సి అదుపులోకి తీసుకుని విచారించగా 27 బైక్‌లను దొంగలించినట్లు అంగీకరించారు. ఆ బైక్‌లను స్వాధీ నం చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. బైక్‌ల విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుంది. సిబ్బందికి రివార్డులు : నిందితులను అరెస్ట్ చేసి చోరీ సొత్తు రికవరీ చేయడానికి కృషి చేసిన బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ జి. మంగారావు, ఎస్ఐలు డి. జగన్మోహన్రావు, ఎ. నాగేశ్వరరావు, సిబ్బందిని ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్ అభినందించి రివార్డులు ప్రకటించారు. సమావేశంలో ఏఎస్పీ రెడ్డి గంగాధర్‌రావు, నగర డీఎస్పీ పి. వెంకటనాథ్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.