హైదరాబాద్: పార్కింగ్ చేసి ఉన్న వాహనాలను ఎత్తుకెళ్తున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 19 ద్విచక్రవాహనాలను ఎత్తుకెళ్లారు. నగరంలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీపీ సాయిశేఖర్ వివరాలు తెలిపారు. నగరంలో ఇళ్ల ముందు పార్క్ చేసి ఉన్న వాహనాలను టార్కెట్ చేసి దొంగతనాలకు పాల్పడే వారు. బాధితులు ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి నిందితులను అరెస్టు చేసినట్టు డీసీపీ తెలిపారు.