నాలుగురోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పలు చోట్ల ట్రాక్ దెబ్బతినడంతో రైల్వే అధికారులు ఆదివారం పలు రైళ్లను రద్దు చేశారు.
కాజీపేట రూరల్, న్యూస్‌లైన్ : నాలుగురోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పలు చోట్ల ట్రాక్ దెబ్బతినడంతో రైల్వే అధికారులు ఆదివారం పలు రైళ్లను రద్దు చేశారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్‌ను, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు వెళ్లే గరీభ్థ్‌న్రు, నాందేడ్ నుంచి విశాఖపట్నంకు వెళ్లే నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌ను, కాజీపేట నుంచి మణుగూర్‌కు వెళ్లే మణుగూర్ ప్యాసింజర్‌ను అప్‌అండ్‌డౌన్‌లో రద్దు చేశారు. కాగా, ముంబ యి నుంచి భువనేశ్వర్‌కు వెళ్లే కోణార్క్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్ నుంచి హౌరాకు వెళ్లే ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ను వయా బల్లార్షా మీదుగా పంపిచారు. ఇదిలా ఉండగా, భువనేశ్వర్ నుంచి ముంబయికి వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్ 7 గంటలు, సిర్‌పూర్‌కాగజ్‌నగర్ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ 2 గంటలు, సిర్‌పూర్‌కాగజ్‌న గర్ నుం చి సికింద్రాబాద్‌కు వెళ్లే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ గంట, సికింద్రాబాద్ నుంచి బల్లార్షాకు వెళ్లే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ గంట ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.