Tracks damaged
-
పట్టాల పైనుంచి ద్విచక్రవాహనం దాటిస్తుండగా.. విషాద ఘటన!
మహబూబ్‌నగర్: రైలు పట్టాల పైనుంచి ద్విచక్రవాహనం దాటిస్తుండగా.. అకస్మాతుగా రైలు రావడంతో బైక్ పూర్తిగా ధ్వంసమై దంపతులు ప్రాణాలతో బయటపడిన సంఘటన బుధవారం డోకూర్ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పేరూర్‌కి చెందిన అశోక్ తన భార్యకు వైద్యం నిమిత్తం డోకూర్‌కు వచ్చాడు. గ్రామంలో ఉన్న రైల్వే గేట్ వద్ద వారం రోజుల కిందట రైల్వే అధికారులు అండర్‌పాస్ నిర్మాణం చేపట్టి ప్రయాణికుల రాకపోకలకు ప్రత్యామ్నాయ దారిని ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలియకపోవడంతో గతంలో ఉన్న మార్గంలో వచ్చిన అశోక్ తన ద్విచక్రవాహనాన్ని (అండర్‌పాస్ నిర్మాణం పక్క నుంచి) పట్టాల పైనుంచి దాటిస్తున్న క్రమంలో అకస్మాతుగా రైలు వచ్చింది. దీంతో పట్టాలపై బైక్‌ను వదిలేసి పక్కకు తప్పుకొన్నాడు. ఈ సంఘటనలో బైక్ పూర్తిగా ధ్వంసం కాగా.. దంపతులు ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. బైక్ రైలు ముందు భాగంలో చిక్కుకపోవడంతో లోకోపైలెట్ రైలును నిలిపివేశాడు. స్థానిక సిబ్బంది సాయంతో రైలు కింద చిక్కుకున్న బైక్‌ను తొలగించిన అనంతరం రైలు ముందుకు కదిలింది. ఈ సంఘటనతో రైలు దాదాపు 15 నిమిషాల పాటు నిలిచిపోయింది. ఇవి చదవండి: వివాహిత మృతి! భర్తే వేధించి, పురుగుల మందు తాగించాడని.. -
పలు రైళ్ల రద్దు
కాజీపేట రూరల్, న్యూస్‌లైన్ : నాలుగురోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పలు చోట్ల ట్రాక్ దెబ్బతినడంతో రైల్వే అధికారులు ఆదివారం పలు రైళ్లను రద్దు చేశారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్‌ను, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు వెళ్లే గరీభ్థ్న్రు, నాందేడ్ నుంచి విశాఖపట్నంకు వెళ్లే నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌ను, కాజీపేట నుంచి మణుగూర్‌కు వెళ్లే మణుగూర్ ప్యాసింజర్‌ను అప్అండ్డౌన్లో రద్దు చేశారు. కాగా, ముంబ యి నుంచి భువనేశ్వర్‌కు వెళ్లే కోణార్క్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్ నుంచి హౌరాకు వెళ్లే ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ను వయా బల్లార్షా మీదుగా పంపిచారు. ఇదిలా ఉండగా, భువనేశ్వర్ నుంచి ముంబయికి వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్ 7 గంటలు, సిర్పూర్కాగజ్నగర్ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ 2 గంటలు, సిర్పూర్కాగజ్న గర్ నుం చి సికింద్రాబాద్‌కు వెళ్లే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ గంట, సికింద్రాబాద్ నుంచి బల్లార్షాకు వెళ్లే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ గంట ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.