
కాజీపేట: బంధుమిత్రుల నిరాదరణకు గురై అనాథ ఆశ్రమంలో ఉంటూ బతుకు వెళ్లదీస్తున్న ఓ వృద్ధుడు శుక్రవారం గుండెపోటుతో తనువు చాలించాడు. దీంతో సహృదయ అనాథ ఆశ్రమ నిర్వాహకురాలు యాకూబ్‌బీ కట్టుబాట్లను పక్కనబెట్టి తలకొరివి పెట్టింది. వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లికి చెందిన కోమాండ్ల వీరస్వామి, శోభ దంపతులు. వీరికి పిల్లలతో పాటు ఆస్తిపాస్తులు లేవు.
ఈ క్రమంలో జీవిత చరమాంకంలోకి అడుగిడిన ఈ దంపతుల దీనగాథను 2017లో ‘సాక్షి’వెలుగులోకి తీసుకురాగా, కాజీపేటలోని సహృదయ అనాథ ఆశ్రమ నిర్వాహకురాలు యాకూబ్‌బీ, చోటు దంపతులు అక్కున చేర్చుకున్నారు. ఇందులో వీరస్వామి శుక్రవారం మృతి చెందగా.. యాకూబ్‌బీ హిందూ సాంప్రదాయ పద్ధతిలో దహన సంస్కారాలు నిర్వహించింది.
చదవండి: ఆరేళ్లుగా కుమార్తె అస్థికలు భద్రపరిచి..
బాలికకు కరోనా తెచ్చిన కష్టం!
Comments
Please login to add a commentAdd a comment