
పరుమాండ్ల భిక్షపతి (ఫైల్)
కాజీపేట: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ కుటుంబానికి చెందిన సభ్యులు ఒక వ్యక్తిని దారుణంగా కొట్టి చంపిన ఘటన ఆదివారం తెల్లవారుజామున వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట పట్టణం బాపూజీనగర్ ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చిన్నకోడెపాక గ్రామానికి చెందిన పరుమాండ్ల రామనాథం బతుకుదెరువు కోసం 12 ఏళ్ల క్రితం కాజీపేట పట్టణానికి కుటుంబంతో వచ్చి పరుపులు విక్రయిస్తూ జీవిస్తున్నాడు. చిన్నకోడెపాకకే చెందిన పరుమాండ్ల భిక్షపతి (45) భార్య కొద్దికాలం క్రితం మరణించడంతో హన్మకొండకు వచ్చి ఓ హోటల్‌లో పనిచేస్తూ తన ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు.
ఇద్దరిదీ ఒకే గ్రామం కావడంతో భిక్షపతి తరచూ రామనాథం ఇంటికి వస్తుండేవాడు. అయితే వివాహేతర సంబంధం అనుమానాల కారణంగా రెండు కుటుంబాల మధ్య వివాదాలు జరుగుతున్నాయి. తమ ఇంటికి రావడం మానుకోవాలని రామనాథం కుటుంబం పలుమార్లు హెచ్చరించినా భిక్షపతి పట్టించుకోలేదు. రామ నాథం కుటుంబంలో కలహాలు పెరగడంతో అతను ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి రామనాథం ఇంటికి వచ్చిన భిక్షపతిని అతని కుటుంబ సభ్యులు బంధించి కర్రలు, కత్తులతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి çస్పృహ తప్పి పడిపోయాడు.
వారు 100 నంబర్‌కు డయల్ చేయడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆరా తీయగా.. భవనం పైనుంచి ప్రమాదవశాత్తు జారిపడినట్టు నమ్మించే ప్రయత్నం చేశారు. 108 వాహనంలో ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా çస్పృహలోకి వచ్చిన భిక్షపతి తనపై దాడి చేసి చంపడానికి ప్రయత్నించినట్లు పోలీసులకు చెప్పాడు. అతడిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగానే మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment