మా పిన్ని ఓ లేడీ టైగర్‌.. రక్షించండి సార్‌ | Warangal: Woman Requests Police Protection From Her Relatives Attack | Sakshi
Sakshi News home page

మా పిన్ని ఓ లేడీ టైగర్‌.. రక్షించండి సార్‌

Published Sat, Sep 4 2021 1:22 PM | Last Updated on Sat, Sep 4 2021 4:18 PM

Warangal: Woman Requests Police Protection From Her Relatives Attack - Sakshi

రుబీనా, చాంద్‌పాషా కుమార్తె

కాజీపేట అర్బన్‌(వరంగల్‌): వరంగల్‌ ఎల్బీనగర్‌లో అన్న చాంద్‌పాషా కుటుంబంపై తమ్ముడు షఫీ దాడిచేసి ముగ్గురిని చంపిన విషయం తెలిసిందే. చాంద్‌పాషా కుమార్తెతోపాటు ఖలీల్‌ పిల్లలు శుక్రవారం సీపీ తరుణ్‌జోషిని కలిశారు.  ( వరంగల్‌లో దారుణం.. అన్న కుటుంబంపై కత్తులతో దాడి )

మా పిన్ని పాత్ర కూడా ఉంది : చాంద్‌పాషా కుమార్తె రుబీనా
మా నాన్న చాంద్‌పాషా, తల్లి సాబీరా, మామయ్య ఖలీల్‌లను మా చిన్నాన్న షఫీ కిరాతకంగా చంపడంలో మా పిన్ని పాత్ర కూడా ఉంటుంది. మా పిన్ని ఓ లేడీ టైగర్‌గా వ్యవహరిస్తుంది. మా ఇద్దరు సోదరులు ఇప్పటికీ ప్రాణాపాయ స్ధితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎప్పుడు ఎవరు వచ్చి దాడి చేసి చంపుతారోనని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం, మాకు రక్షణ కల్పించాలని సీపీని వేడుకున్నా.

మాకు దిక్కెవరు: ఖలీల్‌ పిల్లలు
మా నాన్నను అతి కిరాతకంగా కళ్లల్లో కారం చల్లి కత్తులతో దాడిచేసి నరికిన షఫీని అదే విధంగా చంపాలి. ఇప్పుడు మాకు ఎవరు దిక్కు అంటూ వేడుకున్నారు ఖలీల్‌ పిల్లలు.

చదవండి: ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ కొనేవారికి తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement