Relatives attack
-
మా పిన్ని ఓ లేడీ టైగర్.. రక్షించండి సార్
కాజీపేట అర్బన్(వరంగల్): వరంగల్ ఎల్బీనగర్లో అన్న చాంద్‌పాషా కుటుంబంపై తమ్ముడు షఫీ దాడిచేసి ముగ్గురిని చంపిన విషయం తెలిసిందే. చాంద్‌పాషా కుమార్తెతోపాటు ఖలీల్ పిల్లలు శుక్రవారం సీపీ తరుణ్జోషిని కలిశారు. ( వరంగల్‌లో దారుణం.. అన్న కుటుంబంపై కత్తులతో దాడి ) మా పిన్ని పాత్ర కూడా ఉంది : చాంద్‌పాషా కుమార్తె రుబీనా మా నాన్న చాంద్‌పాషా, తల్లి సాబీరా, మామయ్య ఖలీల్‌లను మా చిన్నాన్న షఫీ కిరాతకంగా చంపడంలో మా పిన్ని పాత్ర కూడా ఉంటుంది. మా పిన్ని ఓ లేడీ టైగర్‌గా వ్యవహరిస్తుంది. మా ఇద్దరు సోదరులు ఇప్పటికీ ప్రాణాపాయ స్ధితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎప్పుడు ఎవరు వచ్చి దాడి చేసి చంపుతారోనని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం, మాకు రక్షణ కల్పించాలని సీపీని వేడుకున్నా. మాకు దిక్కెవరు: ఖలీల్ పిల్లలు మా నాన్నను అతి కిరాతకంగా కళ్లల్లో కారం చల్లి కత్తులతో దాడిచేసి నరికిన షఫీని అదే విధంగా చంపాలి. ఇప్పుడు మాకు ఎవరు దిక్కు అంటూ వేడుకున్నారు ఖలీల్ పిల్లలు. చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనేవారికి తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్! -
అమ్మాయితో స్నేహం నచ్చక కొట్టి చంపారు
న్యూఢిల్లీ: ఒక యువతితో స్నేహం చేసినందుకు ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని ఆమె బంధువులు కొట్టి చంపారు. ఈ నెల 7న ఢిల్లీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం పశ్చిమ ఢిల్లీ ఆదర్శనగర్‌లో ఉంటున్న 18 ఏళ్ల వయసున్న రాహుల్ రాజ్‌పుత్ ఢిల్లీ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కుటుంబాన్ని పోషించడానికి చాలా మందికి ట్యూషన్లు చెబుతూ ఉండేవాడు. అదే ప్రాంతానికి చెందిన ఒక అమ్మాయితో స్నేహం బాగా బలపడింది. ఇద్దరి కులాలు వేరు కావడంతో వారి స్నేహం నచ్చక అమ్మాయి తరఫు బంధువులు రాహుల్‌పై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత రాహుల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు నార్త్‌వెస్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు ఆర్య చెప్పారు. అయిదు మంది కలిసి రాహుల్‌ని తోస్తూ పక్కకి లాగడం, అతనిపై దాడికి దిగిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఆ అమ్మాయి సోదరుడు, మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుడి కుటుంబానికి ఢిల్లీ ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసింది. పల్లెటూరు నుంచి వచ్చిన ఆ కుటుంబాన్ని రాహుల్ పోషిస్తున్నాడని, అందరికీ సాయపడుతూ ఉండే అతని మృతి ఆ కుటుంబానికి తీరని లోటని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు. శనివారం ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. దోషుల్ని కఠినంగా శిక్షించి ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
ప్రేమజంటపై దాడి..
సాక్షి,జమ్మికుంట: గత నెల సికింద్రాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో ఓ ప్రేమజంట వివాహం చేసుకుంది. ఇది జీర్ణించుకోలేని అమ్మాయి తరపు బంధువులు ఆ జంటపై దాడిచేశారు. ఈ ఘటన కరీంగనర్ జిల్లాలో జరిగింది. వివరాలివి.. మహబూబాబాద్ అమ్మాయి, మండలంలోని శాయంపేట గ్రామానికి చెందిన ప్రవీణ్‌లు కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఇంట్లో పెద్దలను ఎదిరించి ఆర్య సమాజ్‌లో గతనెల పెళ్లి చేసుకున్నారు. దీంతో అమ్మాయి తరపు వారు వాహనాల్లో వచ్చి ప్రవీణ్‌పై దాడి చేసి అమ్మాయిని తీసుకెళ్లారు. గ్రామస్తులు ఒక వాహనాన్ని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనంతో పాటు ఐదుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. వారు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రవీణ్‌ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ప్రేమ వివాహానికి బంధువుల అడ్డగింత
కురవి(డోర్నకల్): ప్రేమ వివాహానికి బంధువులు అడ్డు తగిలారు.. అయినా బంధువుల కళ్లు గప్పిన ప్రేమికులు ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. వారిని బంధువులు వెంబడిస్తుండగా వారిరువురు శుక్రవారం సాయంత్రం కురవిలోని కానుగంటి లక్ష్మీభాయి ఇంట్లోకి వెళ్లి తల దాచుకున్నారు. వివరాల్లోకెళితే.. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కుడకుడకు చెందిన మామిడివిజయ్ అదే గ్రామానికి చెందిన బూర శిరీషలు గత సంవత్సరన్న కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు మేజర్లే. శుక్రవారం వారు ద్విచక్రవాహనంపై కురవికి చేరుకున్నారు. ఇక్కడి ప్రేమ పెళ్లిళ్లు చేయరని తెలుసుకుని మహబూబాబాద్ మండలంలోని అనంతారం ఆలయానికి వెళ్లారు. అక్కడ వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇంట్లో నుంచి శిరీష వెళ్లిన విషయాన్ని తెలుసుకున్న ఆమె బావ అతడి స్నేహితులతో కలసి కారులో అనంతారం వెళ్లారు. విజయ్, శిరీష జంటను వెంబడించారు. వారినుంచి తప్పించుకున్న ప్రేమికులు ద్విచక్రవాహనంపై కురవికి చేరుకుని లక్ష్మీభాయి ఇంట్లోకి వెళ్లి తల దాచుకున్నారు. బంధువులు వారు దాచుకున్న ఇంటిమీదకు వచ్చి గొడవకు దిగగా కాలనీవాసులు పోలీసులకు సమాచారం అందచేశారు. ఇద్దరు మేజర్లు కావడంతో పోలీసులు వారిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ విషయమై ఎస్సై అశోక్‌ను వివరణ కోరగా సర్టిఫికెట్లు పరిశీలించి మేజర్లు అయితే ఇంటికి పంపిస్తామన్నారు. -
అల్లుడి కుటుంబం దాడి,మామ ఆత్మహత్య
బోడుప్పల్: పురుగుల మందు తాగిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన శనివారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ వెంకటయ్య సమాచారం మేరకు... బోడుప్పల్ యాదవబస్తీకి చెందిన కురకల వెంకటేశ్(45), రుక్కమ్మ దంపతులు. వారికి రాధిక అనే కుమార్తె ఉంది. ఆమెను రాజేశ్ అనే వ్యక్తికి ఇచ్చి నాలుగు సంవత్సరాల క్రితం వివాహం చేశారు. రాజేశ్, రాధిక మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈనెల 24న కుమార్తె దగ్గరకు వెంకటేశ్ వెళ్లాడు. అక్కడ మాట మాట పెరిగి అల్లుడు రాజేశ్, వెంకటేశ్‌కు మధ్య గొడవ జరిగింది. ఇదే సమయంలో రాజేశ్ కుటుంబ సభ్యులు వెంకటేశ్‌పై దాడి చేశారు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన వెంకటేశ్ ఇంటికి వచ్చిన తరువాత ఈనెల 28న పురుగుల మందు తాగాడు. చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. వెంకటేశ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యను కొట్టాడని..
చందంపేట : భార్యను చిత్రహింసలు పెడుతున్నాడని, భార్య తరఫు బంధువులు ఆ భర్తను చితకబాదారు. ఈ ఘటన చందంపేట మండలం తెల్దేవర్పల్లి గ్రామపంచాయతీ పరిధి నక్కలగండితండాలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నక్కలగండితండాకు చెందిన మోతీలాల్, తెల్దేవర్పల్లి గ్రామానికి చెందిన సునిత దంపతులు. వీరికి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. నక్కలగండితండాలో ఉంటూ రోజూ వారీ కూలీగా చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కాగా మద్యానికి బానిసైన మోతీలాల్ ఇటీవల తరచూ భార్యను వేధిస్తుండేవాడు. ఇదే క్రమంలో శుక్రవారం రాత్రి భార్య సునితపై చేయిచేసుకున్నాడు. దీంతో విషయం తెలిసిన సునిత తరఫు బంధువులు ఆగ్రహించి మోతీలాల్పై దాడిచేసి చితకబాదారు. గాయపడిన మోతీలాల్‌ను చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాసుపత్రి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లారు.ఇరువర్గాల వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు -
షాద్‌నగర్‌లో వైద్యురాలిపై దాడి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. కాన్పు కోసం రజిత అనే మహిళ స్థానిక ఆస్పత్రిలో చేరింది. శిశువుకు జన్మ ఇచ్చిన కొద్దిసేపటికే సదరు మహిళ మృతి చెందింది. శిశువు పరిస్థితి కూడా విషమంగా ఉందని వెంటనే హైదరాబాద్ తరలించాలని వైద్యులు మృతురాలి బంధువులకు సూచించారు. దీంతో మృతురాలి బంధువులకు ఆగ్రహాం కట్టలు తెంచుకుంది. మీ నిర్లక్ష్యం వల్లే తల్లి చనిపోయిందని, శిశువు పరిస్థితి విషమంగా ఉందని ఆరోపిస్తున్న మృతురాలి బంధువులు వైద్యురాలిపై దాడి చేశారు. ఈ దాడిలో వైద్యురాలు డా. ఝాన్సీ తీవ్రంగా గాయపడింది. దీంతో స్థానికంగా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. పోలీసులు రంగంప్రవేశం చేసి మృతురాలి బంధువులను శాంతింప చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.