షాద్నగర్లో వైద్యురాలిపై దాడి | Relatives attack doctor after patient's death at Shadnagar | Sakshi
Sakshi News home page

షాద్నగర్లో వైద్యురాలిపై దాడి

Published Fri, Sep 26 2014 8:53 AM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM

Relatives attack doctor after patient's death at Shadnagar

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో విషాదం చోటు చేసుకుంది. కాన్పు కోసం రజిత అనే మహిళ స్థానిక ఆస్పత్రిలో చేరింది. శిశువుకు జన్మ ఇచ్చిన కొద్దిసేపటికే సదరు మహిళ మృతి చెందింది. శిశువు పరిస్థితి కూడా విషమంగా ఉందని వెంటనే హైదరాబాద్ తరలించాలని వైద్యులు మృతురాలి బంధువులకు సూచించారు.

దీంతో మృతురాలి బంధువులకు ఆగ్రహాం కట్టలు తెంచుకుంది. మీ నిర్లక్ష్యం వల్లే తల్లి చనిపోయిందని, శిశువు పరిస్థితి విషమంగా ఉందని ఆరోపిస్తున్న మృతురాలి బంధువులు వైద్యురాలిపై దాడి చేశారు. ఈ దాడిలో వైద్యురాలు డా. ఝాన్సీ తీవ్రంగా గాయపడింది. దీంతో స్థానికంగా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. పోలీసులు రంగంప్రవేశం చేసి మృతురాలి బంధువులను శాంతింప చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement