భార్యను కొట్టాడని.. | wife relatives attack husband | Sakshi
Sakshi News home page

భార్యను కొట్టాడని..

Published Sun, Jul 19 2015 9:08 AM | Last Updated on Sun, Sep 3 2017 5:48 AM

wife relatives attack husband

చందంపేట : భార్యను చిత్రహింసలు పెడుతున్నాడని, భార్య తరఫు బంధువులు ఆ భర్తను చితకబాదారు. ఈ ఘటన  చందంపేట మండలం తెల్దేవర్‌పల్లి గ్రామపంచాయతీ పరిధి నక్కలగండితండాలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నక్కలగండితండాకు చెందిన మోతీలాల్, తెల్దేవర్‌పల్లి గ్రామానికి చెందిన సునిత దంపతులు. వీరికి ఐదేళ్ల క్రితం  వివాహం జరిగింది. నక్కలగండితండాలో ఉంటూ రోజూ వారీ కూలీగా  చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

కాగా మద్యానికి బానిసైన మోతీలాల్ ఇటీవల తరచూ భార్యను వేధిస్తుండేవాడు. ఇదే క్రమంలో శుక్రవారం రాత్రి భార్య సునితపై చేయిచేసుకున్నాడు. దీంతో విషయం తెలిసిన సునిత తరఫు బంధువులు ఆగ్రహించి మోతీలాల్‌పై దాడిచేసి చితకబాదారు.  గాయపడిన మోతీలాల్‌ను చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాసుపత్రి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లారు.ఇరువర్గాల వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement