హిజ్రా నాయకురాలు హాసిని హత్య కేసును ఛేదించిన పోలీసులు
12 మంది అరెస్ట్..పరారీలో ముగ్గురు
నెల్లూరు (క్రైమ్): ఆధిపత్యం, పాత కక్షల నేపథ్యంతోనే హిజ్రా సంఘ నాయకురాలు మానికల హాసిని హత్య జరిగినట్లు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ చెప్పారు. ఈ కేసులోని 15 మంది నిందితుల్లో 12 మందిని అరెస్ట్ చేశామని, మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్‌లో హాసిని హత్యకు దారి తీసిన పరిస్థితులు, నిందితుల వివరాలను ఎస్పీ ఆదివారం వివరించారు.
తోటపల్లిగూడూరు మండలం చిన్నచెరుకూరుకి చెందిన హాసిని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలతో పాటుగా కర్ణాటకలోని బళ్లారి, రాయచూర్, ధార్వాడ్, చిక్‌మగ్‌ళూరు, హుబ్లీ జిల్లాల్లోని ట్రాన్స్‌జెండర్లకు నాయకురాలు. నెల్లూరు జిల్లాకు చెందిన హిజ్రా సంఘ మాజీ నాయకురాలు అలేఖ్య అలియాస్ అనిల్‌కుమార్‌కు హాసిని మధ్య విభేదాలున్నాయి. ఇద్దరి మీద నెల్లూరు, తిరుపతి జిల్లాలో పలు కేసులున్నాయి. హాసినికి బోడిగాడితోటకు చెందిన షీలా, సులోచనతోనూ విబేధాలున్నాయి. ఇవి తారస్థాయికి చేరుకోవడంతో హాసినిని అంతమొందించాలని వీరందరూ నిర్ణయించుకుని సుందరయ్యకాలనీకి చెందిన రౌడీషిటర్ చింతల భూపతిని,నెల్లూరు రూరల్ మండలానికి చెందిన మరో రౌడీషిటర్‌ను సంప్రదించారు.
వీరి ద్వారా కొందరిని సమీకరించుకుని సుపారీ ఇచ్చి అదను కోసం వేచి చూడసాగారు. గత నెల 26న రాత్రి హాసినిని టపాతోపు రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నిందితులు హత్య చేశారు. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితులను గుర్తించారు. కోవూరు అండర్ బ్రిడ్జి వద్ద కార్లలో వెళ్తున్న నిందితులైన రౌడీషిటర్ వంశీకృష్ణ అలియాస్ నాని, రాము, కార్తీక్, సుబ్రహ్మణ్యం, షేక్ మస్తాన్ వలీ అలియాస్ వలీ, వెంకటాద్రి, రాజే‹Ù, వంశీ, షీలా అలియాస్ శ్రీనివాసులు, అలేఖ్య అలియాస్ అనిల్ కుమార్, చింతల భూపతి, ఓ బాలుడిని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment